DSC స్కామ్ లో బిగ్ ట్విస్ట్.. ఎమ్మెల్యే కూనతో కుమ్మక్కైన SAAP
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయింపు కేసులో ఆయనపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2024 మార్చిలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ ఆయనపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్‌ను ఆశ్రయించారు.
దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్లను పరిశీలించిన శాసనసభ స్పీకర్ గతంలో వాటిని తిరస్కరించారు. దీంతో స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తొలుత సెప్టెంబర్ 16న తీర్పు వెలువడుతుందని భావించినప్పటికీ, న్యాయస్థానం తీర్పును సెప్టెంబర్ 18కి వాయిదా వేసింది.
ఈ కేసులో ప్రధానంగా దానం నాగేందర్ పార్టీ మారిన అంశం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం చర్చకు వచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు విషయంలో రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ నిబంధనలు ఎలా వర్తిస్తాయన్న అంశంపైనా న్యాయస్థానం విచారణలో పరిశీలన జరిగింది.
తాజా హైకోర్టు తీర్పుతో దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు పడింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రాతినిధ్యంపై తదుపరి రాజ్యాంగపరమైన ప్రక్రియ ఏ విధంగా సాగుతుందన్నది కీలకంగా మారింది.
దానం నాగేందర్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ఎన్నికల్లో ఒక పార్టీ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధి అనంతరం మరో పార్టీలో చేరితే అనర్హత నిబంధనలు ఎలా అమలవుతాయన్న అంశంపై ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో దానం నాగేందర్ తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ తీర్పుపై అప్పీల్ చేస్తారా? తదుపరి న్యాయపరమైన ప్రక్రియ ఎలా ఉంటుంది? అన్నది ఇప్పుడు రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్న మహానటుడు కైకాల సత్యనారాయణ. ఆయన నటనా విశేషాలను, వ్యక్తిత్వాన్ని ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. 1959లో చిత్రరంగ ప్రవేశం చేసి, 2019 వరకు దాదాపు 60 సంవత్సరాల పాటు సినీ ప్రయాణం చేసిన కైకాల, 700లకు పైగా సినిమాలలో నటించారు. ఆయన బహుముఖ ప్రజ్ఞను తమ్మారెడ్డి భరద్వాజ ఎంతగానో ప్రశంసించారు. యముడిగా, విలన్‌గా, తండ్రిగా, కమెడియన్‌గా, హీరోగా ఇలా ఆయన పోషించని పాత్ర లేదు అని ఆయన అన్నారు. మొదట సిపాయి కూతురు చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయమైన కైకాల సత్యనారాయణ, ఆ చిత్రం పరాజయం పాలైన తర్వాత రాముడు భీముడు వంటి సినిమాల్లో ఎన్.టి. రామారావు గారికి డూప్‌గా కూడా పనిచేశారు. పాత్రల కోసం ఆయన పడిన తపన అసాధారణం. అప్పటికే కొంత స్థిరపడినా, మంచి పాత్రలు దొరికినప్పుడు స్వయంగా చిత్ర నిర్మాణ కార్యాలయాలకు వెళ్లి దర్శకులను, నిర్మాతలను కలిసి అవకాశాలు అడిగేవారు. శారద సినిమాలో అన్నయ్య పాత్ర కోసం దర్శకుడు క్రాంతి గారిని ఒప్పించి మరీ నటించారట. ఆ పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను ఎంతగానో కదిలించింది.
Aditi Myakal : మేడమ్ సార్ మేడమ్ అంతే..! మెంటలెక్కిస్తున్న అర్జున్ రెడ్డి భామకైకాల సత్యనారాయణను నవరస నటనా సార్వభౌముడు అని పిలవడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదని తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఎందుకంటే, ఆయన నిజంగానే నవరసాలను పండించారు. మోసగాళ్ళకు మోసగాడు సినిమాలో క్రూరమైన విలన్‌గా ప్రేక్షకులను భయపెట్టిన ఆయన, సంసారం సాగరం వంటి చిత్రాల్లో రాజబాబు వంటి వారితో కలిసి హాస్యాన్ని పండించారు. పౌరాణిక చిత్రాల్లో దుర్యోధనుడి పాత్రలో (దాన వీర శూర కర్ణ), అలాగే బాలకృష్ణతో సింగీతం శ్రీనివాసరావు గారి చిత్రంలో ఆయన చూపిన హావభావాలు అద్భుతం. ఎన్.టి.ఆర్. సినిమాల్లో ఆయనకు దీటుగా నిలబడే పాత్రల్లో నటించి మెప్పించారు. ఎన్.టి.ఆర్. అన్ని చిత్రాల్లోనూ దాదాపుగా కైకాల సత్యనారాయణ ఉండేవారంటే ఆయన ప్రాముఖ్యత అర్థమవుతుంది.
ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.. కట్ చేస్తే సోషల్ మీడియాను షేక్ చేస్తుందిఎస్.వి. రంగారావు గారి మరణం తర్వాత తెలుగు చిత్రసీమలో ఏర్పడిన ఖాళీని కైకాల సత్యనారాయణ గారు సమర్థవంతంగా భర్తీ చేశారని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఎస్.వి.ఆర్. గారు ఏడిపించినా, నవ్వించినా, భయపెట్టినా ఇలా ఏ భావమైనా పండించగలిగినట్లుగానే కైకాల కూడా అన్ని రకాల పాత్రలను పోషించారు. వందల సినిమాలు చేసినా, ప్రతి డైలాగ్‌ను పది రకాలుగా సాధన చేసి, అందులో ఉత్తమమైన దానిని ఎంచుకుని నటించేవారట. నటుడిగా ఇంత ఎత్తుకు ఎదిగినా, కైకాల సత్యనారాయణ ఎప్పుడూ నిగర్విగానే ఉండేవారు. అందరితోనూ స్నేహపూర్వకంగా ఉండేవారు, ఎవరితోనూ సినిమా రాజకీయాలు చేయలేదని తమ్మారెడ్డి భరద్వాజ గుర్తుచేసుకున్నారు. ఒక పార్లమెంటు సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు. చివరి రోజుల్లో ఆరోగ్య కారణాల వల్ల, ముఖ్యంగా తన గొంతులో వచ్చిన మార్పుల వల్ల నటించడం మానేశారు. ఎందుకంటే, ఒక నటుడికి గొంతు అనేది ప్రధాన బలం. అది సరిగా లేనప్పుడు తాను ప్రేక్షకులను మోసం చేయకూడదని భావించి నటనకు స్వస్తి చెప్పారు.
అప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే మాజీ సీఎం భార్య.. ఇద్దరి మధ్య 27ఏళ్ల ఏజ్ గ్యాప్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వర్షిణి & ముకేశ్ లవ్? చరణ్ కు బిగ్ షాక్
Bikes Tyres: మనం ప్రతిరోజూ బైక్‌లు, స్కూటర్లపై ప్రయాణించినప్పటికీ, టైర్ సైజుపై పెద్దగా శ్రద్ధ పెట్టము. బైక్‌లకు పెద్ద టైర్లు, స్కూటర్లకు చిన్న టైర్లు ఎందుకు ఉంటాయోనని మీరెప్పుడైనా గమనించారా?
బైక్‌కి, స్కూటీకి టైర్ సైజులో ఎందుకు తేడా ఉంటుంది?బైక్‌లు, స్కూటీలు రెండూ మనం మన దైనందిన జీవితంలో ఎక్కువగా ఉపయోగించే వాహనాలే. కానీ ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే, మీకు ఒక చిన్న తేడా కనిపిస్తుంది. అదే టైర్ సైజు. బైక్‌కు పెద్ద టైరు, స్కూటీకి చిన్న టైరు ఇచ్చి ఉంటారు. దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు.
బైక్‌లకు పెద్ద టైర్లు ఎందుకు ఉంటాయి?బైక్‌లకు పెద్ద టైర్లు ఇవ్వడానికి ప్రధాన కారణం అవి రోడ్డుపై అందించే పట్టు. మనం వేగంగా వెళ్తున్నప్పుడు, గుంతలు, రాళ్లు, స్పీడ్ బ్రేకర్ల వంటి అనేక అడ్డంకులను ఎదుర్కొంటాము. మనకు పెద్ద టైర్లు ఉంటే వీటన్నింటినీ మనం సులభంగా అధిగమించవచ్చు.
అంతేకాకుండా మనం మన బైక్‌లను ఎక్కువగా సుదూర ప్రయాణాలకు, హైవేపై వేగంగా నడపడానికి ఉపయోగిస్తాము. అందువల్ల బైక్‌ను సమతుల్యంగా ఉంచడంలో పెద్ద టైర్లు చాలా సహాయపడతాయి. వేగంగా వెళ్తున్నప్పుడు బైక్‌ను నియంత్రించడానికి ఇది చాలా ముఖ్యం. అందుకే చాలా బైక్‌లు పెద్ద సైజు టైర్లను ఉపయోగిస్తాయి.
ఇది కూడా చదవండి: BSNL Plan: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. కేవలం రూపాయికే 24 రోజుల వ్యాలిడిటీ..!
స్కూటీకి చిన్న టైర్లు ఎందుకు ఉంటాయి?స్కూటీ టైరు చిన్నగా ఉండటానికి ప్రధాన కారణం దాని డిజైన్. బైక్‌పై, స్కూటీపై కూర్చునే భంగిమలో తేడా ఉంటుంది. బైక్‌పై మనం ఇంజిన్‌కు ఇరువైపులా కాళ్లు పెట్టుకుని కూర్చుంటాము. కానీ, స్కూటీలో మన కాళ్లను ముందుకు పెట్టుకోవడానికి వీలుగా ఫ్లోర్‌బోర్డ్ ఉంటుంది. మనం సౌకర్యవంతంగా కూర్చుని ప్రయాణించడానికి వీలుగా స్కూటీని రూపొందించారు. ఈ డిజైన్‌కు చిన్న టైర్లు మాత్రమే సరిగ్గా సరిపోతాయి.
కాంపాక్ట్ డిజైన్మనం నగరంలో ఎక్కువగా స్కూటీలను ఉపయోగిస్తాము. ఆఫీసుకు, కాలేజీకి లేదా మార్కెట్‌కు వంటి తక్కువ దూరాలకు ప్రయాణించడానికి స్కూటీలు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. నగర ట్రాఫిక్‌లో మీరు నెమ్మదిగా నడపాలి, తరచుగా మలుపులు తిరగాలి.. బ్రేకులు వేయాలి. ఇలాంటి సమయాల్లో స్కూటీ కాంపాక్ట్ డిజైన్ చాలా ఉపయోగపడుతుంది.
ఇది కూడా చదవండి: Ration Card: రేషన్‌కార్డు ఉన్న వారికి బిగ్ షాక్.. వీరి రేషన్ నిలిపివేత..!
వాహనానికి చిన్న టైర్లు ఉంటే అది సరిగ్గా నడవదని అనుకోవడం తప్పు. కేవలం టైరు పరిమాణం మాత్రమే వాహనం పనితీరును నిర్ణయించదు. టైరు వెడల్పు, రబ్బరు నాణ్యత, గాలి, రహదారి పరిస్థితులు, వాహనం బరువు వంటి అనేక అంశాలు వాహనం ఎలా నడుస్తుందో నిర్ణయిస్తాయి.
అన్ని బైక్‌లకు పెద్ద టైర్లు, అన్ని స్కూటీలకు చిన్న టైర్లు ఉంటాయని చెప్పలేము. కొన్ని స్కూటీలు పెద్ద టైర్లను, కొన్ని బైక్‌లు చిన్న టైర్లను ఉపయోగిస్తాయి. వాహనం మోడల్‌ను బట్టి, దాని వినియోగాన్ని బట్టి టైర్ పరిమాణం మారుతూ ఉంటుంది. ఇంజనీర్లు ప్రతి వాహనాన్ని దాని ఉద్దేశించిన వినియోగానికి అనుగుణంగా రూపొందిస్తారు. టైర్ పరిమాణం కూడా ఒక ముఖ్యమైన అంశం అనేది గమనించదగ్గ విషయం.
ఇది కూడా చదవండి: BSNL Plan: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. కేవలం రూపాయికే 24 రోజుల వ్యాలిడిటీ..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మేషం: సప్తమంలో ఉన్న శుక్రుడిని రాశ్యధిపతి కుజుడు చతుర్థ స్థానం నుంచి చూడడం వల్ల ఈ రాశి వారిలో వృత్తి, ఉద్యోగాల్లో అధికారం చేపట్టాలన్న కోరిక పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధం కావడం, ఉద్యోగంలో శ్రమను పెంచడం వంటివి జరుగుతాయి. ధనార్జన మీద ఆశలు, ఆకాంక్షలు బాగా పెరుగుతాయి. అదనపు ఆదాయ మార్గాల మీద, అదనపు రాబడి మీద దృష్టి సారిస్తారు. సుఖవంతమైన జీవితం కోసం ఆరాటం ఎక్కువవుతుంది. శృంగార జీవితం మీద ధ్యాస పెరుగుతుంది.
మిథునం: ఈ రాశివారికి పంచమ స్థానంలో ఉన్న శుక్రుడిని కుజుడు ధన స్థానం నుంచి వీక్షించడం వల్ల జీవ నశైలి పూర్తిగా మారిపోతుంది. విదేశీయానం మీద, విదేశాల్లో ఉద్యోగాల మీద దృష్టి పడుతుంది. మరింత మెరుగైన జీవితం గడపాలన్న ఏకైక లక్ష్యంతో కొత్త ప్రయత్నాలు ప్రారంభించి సఫలం అవుతారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాల మీద శ్రమను పెంచుతారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు పోవడం జరుగుతుంది. కొత్త పరిచయాలు, కొత్త పద్ధతులు, మంచి విలాస జీవితం ఏర్పడతాయి.
కర్కాటకం: ఈ రాశికి ఉన్న కుజుడు చతుర్థ స్థానంలో ఉన్న శుక్రుడిని వీక్షించడం వల్ల భోగభాగ్యాల మీద ఆశలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతుల కోసం లేదా అధికారం కోసం తీవ్రంగా ప్రయ త్నించి విజయం సాధించడం జరుగుతుంది. విలాస జీవితానికి అలవాటు పడతారు. ప్రముఖు లతో పరిచయాలు పెరుగుతాయి. గృహ, వాహన యోగాలు పడతాయి. అదనపు ఆదాయ మార్గాల్ని విస్తరిస్తారు. ప్రేమ వ్యవహారాలు, దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది.
కన్య: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న శుక్రుడిని లాభ స్థానం నుంచి కుజుడు చూడడం వల్ల శృంగార సంబంధమైన కోరికలు విజృంభించడానికి అవకాశం ఉంది. అనవసర పరిచయాలు ఏర్పడతాయి. విలాస జీవితం అలవడుతుంది. వ్యక్తిగత సుఖాల మీద ఖర్చు పెరుగుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అవుతాయి. సిరిసంపదలు కలిసి వస్తాయి. ప్రేమ జీవితం, దాంపత్య జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. సంపన్న వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.
తుల: ఈ రాశిలో ఉన్న రాశ్యధిపతి శుక్రుడిని దశమస్థానం నుంచి కుజుడు వీక్షించడం వల్ల ఈ రాశి వారు ఆదాయ వృద్ధి కోసం బాగా శ్రమపడతారు. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టే పెట్టుబడులు బాగా లాభిస్తాయి. సుఖసంతోషాలకు కోసం తాపత్రయపడడం జరుగుతుంది. శృంగార సంబంధమైన కోరికలు పెరుగుతాయి. గృహ, వాహన సౌకర్యాలు అమరుతాయి. విహార యాత్రల మీద ఖర్చు పెరుగుతుంది. అనవసర పరిచయాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవి లభిస్తుంది.
మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న కుజుడు దశమ స్థానంలో ఉన్న శుక్రుడిని వీక్షించడం వల్ల ఉద్యోగంలో పదోన్నతి కోసం, జీతభత్యాల పెరుగుదల కోసం గట్టి కృషి సాగించి సఫలం అవుతారు. ఆదాయ వృద్ధికి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెంచడం జరుగుతుంది. లాభదాయక పరిచయాలు, లాభదాయక ఒప్పందాలు చోటు చేసుకుంటాయి. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు.
Upward Lines From Life Line Telugu: హస్తసాముద్రికం ప్రకారం, అరచేతిలోని గీతలకు వ్యక్తి స్వభావం, ఆలోచనా విధానం, జీవనశైలి, శక్తి సామర్థ్యాలకు సంబంధించిన కొన్ని సంకేతాలు ఉంటాయని నమ్ముతారు. ముఖ్యంగా జీవిత రేఖను శారీరక శక్తి, జీవశక్తి, ఉత్సాహం, చురుకుదనం వంటి అంశాలకు ప్రతీకగా పరిగణిస్తారు. అయితే మీ అరచేతిలోని జీవిత రేఖ నుంచి చిన్న చిన్న శాఖలు పైకి విస్తరించి కనిపిస్తే, హస్తసాముద్రికంలో వాటిని సాధారణంగా శుభసూచకాలుగా భావిస్తారు. ఇలాంటి గీతలు ఉన్నవారు ఆశావాద దృక్పథం, ఆత్మవిశ్వాసం, పట్టుదల కలిగిన వ్యక్తులుగా ఉంటారని సంప్రదాయ హస్తసాముద్రిక విశ్వాసం చెబుతోంది.
ఆశావాద స్వభావానికి సంకేతమటజీవిత రేఖ నుంచి పైకి వెళ్లే శాఖలు ఉన్నవారు జీవితాన్ని సానుకూల దృక్పథంతో చూడటానికి ప్రయత్నిస్తారని నమ్ముతారు. చిన్న చిన్న సమస్యల్లోనూ సంతోషాన్ని వెతుక్కోగలగడం, ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆశను కోల్పోకపోవడం వారి ప్రత్యేకతగా చెబుతారు. అలాంటి వ్యక్తులు సాధారణంగా స్నేహశీలురుగా ఉంటారని, తమ చుట్టూ ఉన్నవారిలోనూ ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నిస్తారని హస్తసాముద్రికం పేర్కొంటుంది. కష్టకాలంలో కూడా ధైర్యంగా ఉండటానికి ప్రయత్నిస్తారని భావిస్తారు.
కష్టాలను ఎదుర్కొనే మానసిక బలంజీవిత రేఖ నుంచి పైకి వెళ్లే గీతలను మానసిక దృఢత్వానికి కూడా అనుసంధానిస్తారు. సమస్యలు ఎదురైనప్పుడు వాటి నుంచి పారిపోకుండా, వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించే స్వభావం ఉంటుందని చెబుతారు. ఎప్పుడైనా నిరాశ ఎదురైనా ఎక్కువకాలం దానిలోనే ఉండకుండా తిరిగి తమను తాము ప్రోత్సహించుకుని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారని నమ్ముతారు. జీవితంలో కొత్త అవకాశాలను స్వీకరించే ధైర్యం కూడా వీరిలో ఉంటుందని హస్తసాముద్రిక విశ్వాసం.
శక్తి, ఉత్సాహం, పట్టుదలకు ప్రతీకఈ రకమైన శాఖలను వ్యక్తిలోని శక్తి, ఉత్సాహం, కార్యదీక్షకు సంకేతాలుగా కూడా పరిగణిస్తారు. లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత దాన్ని సాధించేందుకు పట్టుదలతో పనిచేసే స్వభావం ఉంటుందని చెబుతారు. ఒక పనిని ప్రారంభించిన తర్వాత మధ్యలో వదిలేయకుండా పూర్తి చేసేందుకు కృషి చేయడం, కొత్త అవకాశాల కోసం అన్వేషించడం, జీవితంలో పురోగతి సాధించాలనే తపన కలిగి ఉండటం వీరి లక్షణాలుగా సంప్రదాయ హస్తసాముద్రికంలో పేర్కొంటారు.
జీవశక్తికి సంబంధించిన సంకేతమటహస్తసాముద్రికంలో జీవిత రేఖను జీవశక్తి, చురుకుదనం వంటి అంశాలతో అనుసంధానిస్తారు. ఈ రేఖ స్పష్టంగా ఉండటంతో పాటు దాని నుంచి పైకి వెళ్లే శాఖలు కనిపిస్తే, వాటిని సానుకూల శక్తి, ఉత్సాహం, చురుకుదనానికి సంకేతాలుగా భావిస్తారు.
(Disclaimer: అరచేతిలోని ఒక్క గీత ఆధారంగా వ్యక్తి జీవితాన్ని పూర్తిగా అంచనా వేయలేమని గుర్తుంచుకోవాలి. హస్తసాముద్రికం ఒక సంప్రదాయ విశ్వాస విధానం మాత్రమే; దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)
ED నోటీసులు.. అంబటిపై మరో కేసు..
బుల్లితెరపై తమదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యే నటీనటులు చాలామందే ఉన్నారు. అయితే కొందరు మాత్రం సీరియల్స్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ షోల ద్వారా కూడా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో కన్నడ భామ కావ్యశ్రీ ఒకరు. ‘గోరింటాకు’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. ఆ తర్వాత పలు సీరియల్స్, టెలివిజన్ కార్యక్రమాల్లో కనిపిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. కావ్య షేర్ చేసే ఫోటోలు, రీల్స్ అభిమానులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కావ్యశ్రీ.. తన సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని, అలాగే పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’లో పాల్గొనే అంశంపై తన అభిప్రాయాలను వెల్లడించింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
Aditi Myakal : మేడమ్ సార్ మేడమ్ అంతే..! మెంటలెక్కిస్తున్న అర్జున్ రెడ్డి భామపవన్ కళ్యాణ్ ప్రస్తావన రాగానే కావ్యశ్రీ ఎంతో ఉత్సాహంగా మాట్లాడింది.. ఆయనను నటుడిగానే కాకుండా నాయకుడిగా కూడా తాను ఎంతో అభిమానిస్తానని చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ మాట్లాడే విధానం తనకు ఎంతో నచ్చుతుందని, ఆయన మాటలు వింటే తనకు తెలియకుండానే గూస్బంప్స్ వస్తాయని చెప్పుకొచ్చింది కావ్య. తన దృష్టిలో పవన్ క ళ్యాణ్ ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని పేర్కొన్న కావ్యశ్రీ.. ఆయనతో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించాలని తనకు ఎప్పటి నుంచో కోరికగా ఉందని తెలిపింది.
ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.. కట్ చేస్తే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది‘‘హీరోయిన్గా నటించే అవకాశం రావాలనే లేదు. ఆయనతో కలిసి సినిమాలో ఏదైనా చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చినా సంతోషంగా అంగీకరిస్తాను. ఆయనతో ఒకసారి అయినా స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది’’ అంటూ తన మనసులోని కోరికను బయటపెట్టిసింది. కావ్యశ్రీ చేసిన ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా పవన్‌పై ఆమె చూపించిన అభిమానాన్ని పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తున్నారు.
అప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే మాజీ సీఎం భార్య.. ఇద్దరి మధ్య 27ఏళ్ల ఏజ్ గ్యాప్View this post on Instagram
A post shared by kavyashree natraj (@kavya_shree_official)
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
BYD Denza Z9 GT: బీవైడీ గ్రూప్ ప్రీమియం కార్ బ్రాండ్ అయిన డెన్సా భారతదేశ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో కొత్త పోటీని సృష్టించడానికి సిద్ధమవుతోంది. డెన్సా 2026 చివరి నాటికి భారతదేశంలో విడుదల అవుతుందని భావిస్తున్నారు. ప్రారంభంలో Z9 GT, D9 అనే రెండు మోడళ్లను పరిచయం చేయవచ్చని సమాచారం.
Z9 GT ఒక సంప్రదాయ ఎలక్ట్రిక్ కారు కాదు, ఇది ఒక అధిక పనితీరు గల ప్రీమియం షూటింగ్-బ్రేక్ మోడల్. భారతదేశంలో BYD ప్రస్తుతం విక్రయిస్తున్న కార్ల కంటే అధిక ధర, ప్రీమియం విభాగంలో డెన్సా బ్రాండ్‌ను నిలబెట్టాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. Z9 GT అతిపెద్ద బలం దాని శక్తివంతమైన మూడు-మోటార్ల వ్యవస్థ. ఈ కారుకు ముందు భాగంలో ఒక ఎలక్ట్రిక్ మోటార్, వెనుక భాగంలో రెండు మోటార్లు ఉన్నాయి.
ఇవి రెండూ కలిసి గరిష్టంగా 850 kW, లేదా సుమారు 1,156 PS పవర్‌ని అందిస్తాయి. దీని గరిష్ట టార్క్ 1,210 న్యూటన్ మీటర్లు. ఇంత శక్తితో Z9 GT కేవలం 2.7 సెకన్లలో 0 నుండి 100 km/h వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం 270 km/h అని నివేదించారు. అంటే ఇది కుటుంబంతో ప్రయాణించడానికి అనువుగా కనిపించినప్పటికీ, డిజైన్ పరంగా మాత్రం స్పోర్ట్స్ కార్లకు దీటుగా పనితీరును అందించేలా దీనిని రూపొందించారు.
ఇది కూడా చదవండి: BSNL Plan: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. కేవలం రూపాయికే 24 రోజుల వ్యాలిడిటీ..!
రేంజ్, ఛార్జింగ్ పరంగా కూడా Z9 GT దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది 122.49 kWh సామర్థ్యం గల రెండవ తరం ప్లేట్ బ్యాటరీని ఉపయోగిస్తుంది. WLTP టెస్టింగ్ పద్ధతి ప్రకారం, ఇది ఒకే పూర్తి ఛార్జ్‌పై 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. ఇది ఫ్లాష్ ఛార్జింగ్ అనే హై-స్పీడ్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా అందిస్తుంది. ఇది గరిష్టంగా 1,500 kW వరకు ఛార్జింగ్ పవర్‌కు మద్దతు ఇస్తుందని నివేదించారు. కంపెనీ ప్రకారం, బ్యాటరీని 10 శాతం నుండి 70 శాతానికి ఛార్జ్ చేయడానికి కేవలం 5 నిమిషాలు మాత్రమే పడుతుంది.
అంతేకాకుండా 10 నుండి 97 శాతం వరకు ఛార్జ్ అవ్వడానికి సుమారు 9 నిమిషాలు పడుతుందని BYD పేర్కొంది. ఈ ఛార్జింగ్ వేగం భారతదేశంలో ఎంతవరకు అందుబాటులో ఉంటుందనేది ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై ఆధారపడి ఉంటుంది. పనితీరుతో పాటు, Z9 GTలో ప్రీమియం ఫీచర్లకు కూడా ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో డ్యూయల్-ఛాంబర్ ఎయిర్ సస్పెన్షన్, రియర్-వీల్ స్టీరింగ్ వంటి టెక్నాలజీలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Business Ideas: కేవలం రూ.5 వేలతో మీ జీవితాన్ని మార్చే బిజినెస్ గురించి మీకు తెలుసా?
ముఖ్యంగా గ్రాబ్-వాక్ అని పిలిడే ఈ ప్రత్యేకమైన వాహన నిర్వహణ ఫీచర్ గరిష్టంగా 15 డిగ్రీల వరకు పనిచేస్తుందని ప్రసిద్ధి చెందింది. ఈ కారు 5.1 మీటర్ల కంటే పొడవుగా ఉన్నప్పటికీ, ఇరుకైన ప్రదేశాలలో కారును తిప్పడానికి, పట్టణ రహదారులపై సులభంగా నడపడానికి వీలుగా రియర్-వీల్ స్టీరింగ్ వంటి ఫీచర్లు రూపొందించారు. అందువల్ల, ఇది ఒక పెద్ద ప్రీమియం కారు అయినప్పటికీ, టెన్సా డ్రైవర్‌కు సులభమైన నియంత్రణను అందించడానికి ప్రయత్నించింది.
డెన్సా ఇంకా భారతదేశంలో Z9 GT అధికారిక ధరను, దాని పూర్తి స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు. ప్రస్తుత మార్కెట్ అంచనాల ప్రకారం, దీని ధర రూ. 1.10 కోట్ల నుండి రూ. 1.50 కోట్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు.
ఈ కారును పూర్తిగా అసెంబుల్ చేసిన స్థితిలో భారతదేశానికి దిగుమతి చేస్తారా? ఏ బ్యాటరీ, ఛార్జింగ్ సిస్టమ్‌ను అందిస్తారు.. అలాగే భారతీయ టెస్టింగ్ సిస్టమ్‌లో ఎంత రేంజ్ అందుబాటులో ఉంటుంది వంటి వివరాలు అధికారిక లాంచ్‌లో మాత్రమే స్పష్టమవుతాయి. అయినప్పటికీ, 1,156 PS పవర్, 1,210 న్యూటన్ మీటర్ల టార్క్, 2.7 సెకన్లలో 0-100 kmph వేగం, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో, Z9 GT భారతదేశపు ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో ఖచ్చితంగా, దృష్టిని ఆకర్షించే మోడల్ అవుతుంది.
ఇది కూడా చదవండి: Ration Card: రేషన్‌కార్డు ఉన్న వారికి బిగ్ షాక్.. వీరి రేషన్ నిలిపివేత..!
ఇది కూడా చదవండి: బంగారం ధరలు పెరిగినా తక్కువ ధరల్లో జ్యువెలరీస్ కొనడం ఎలాగో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అడవికి రాజుగా పేరొందిన పులి, మానవ నాగరికతకు దూరంగా, తనదైన నియమావళిలో జీవిస్తుంది. అటవీ అధికారి రామమోహన్ పులుల గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పులుల జాతులు, వాటి స్వభావం, సంతానోత్పత్తి, పెంపకం గురించి ఆయన లోతైన విశ్లేషణ అందించారు.
పులుల జాతులు, వాటి ప్రత్యేకతలు:ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది పులి ఉపజాతులు ఉండగా, దురదృష్టవశాత్తు జావా, బాలి, కాస్పియన్ టైగర్స్ అనే మూడు జాతులు ఇప్పటికే అంతరించిపోయాయి. ప్రస్తుతం కేవలం ఆరు ఉపజాతులు మాత్రమే మనుగడలో ఉన్నాయి. సైబీరియన్ టైగర్ రష్యా ప్రాంతంలో ఉండగా, భారతదేశంలో విస్తరించి ఉన్నది రాయల్ బెంగాల్ టైగర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ ఉపజాతి పులులే కనిపిస్తాయి. పులుల శరీర రంగు, చారలు వాటి ప్రత్యేకత. సాధారణంగా పులి శరీరం పసుపు-నారింజ రంగు ఫర్‌తో నల్లటి చారలను కలిగి ఉంటుంది. ఈ చారలు ప్రతి పులికి ప్రత్యేకమైనవి, మానవుల వేలిముద్రల వలె ఉంటాయి. అటవీ శాఖ అధికారులు కెమెరా ట్రాపింగ్ ద్వారా ఈ చారల నమూనాలను రికార్డు చేసి, పులులను గుర్తిస్తారు. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్లో భాగంగా టైగర్ సెన్సస్ నిర్వహించడానికి ఇది ఒక ప్రామాణిక పద్ధతి.
తెల్ల పులులు.. ప్రకృతిలో అరుదైన వర్ణ వైవిధ్యానికి ప్రతీకలు!తెల్ల పులులు సాధారణ పులుల నుంచి ప్రత్యేకంగా కనిపించే అరుదైన జంతువులు. వాటి శరీరంపై ఉండే తెలుపు రంగు, నల్లటి లేదా గోధుమ రంగు చారలు చూపరులను ఆకట్టుకుంటాయి. అయితే తెల్ల పులులు ప్రత్యేకమైన పులి జాతికి చెందినవి కావు. జన్యుపరమైన మార్పుల కారణంగా శరీరంలో నల్లటి, నారింజ రంగులను అందించే వర్ణద్రవ్యం తగ్గడం వల్ల అవి తెల్లగా కనిపిస్తాయి. ఈ లక్షణాన్ని శరీర వర్ణహీనతగా పేర్కొంటారు. తెల్ల పులుల కళ్లకు సాధారణంగా నీలం రంగు ఉండవచ్చు. ముక్కు, చర్మం, చారల రంగుల్లోనూ ప్రత్యేకత కనిపిస్తుంది.
తెల్లగా కనిపించినప్పటికీ, వాటి శరీర నిర్మాణం, వేట స్వభావం, మాంసాహార జీవన విధానం సాధారణ పులుల మాదిరిగానే ఉంటాయి. తెల్ల పులులు కూడా బలమైన వేటగాళ్లే. వాటి రంగు మార్పు వాటిని మరింత శక్తివంతమైనవిగా లేదా ప్రత్యేకమైన స్వభావం కలిగినవిగా మార్చదు. ప్రకృతిలో తెల్ల పులులు చాలా అరుదుగా కనిపిస్తాయి. తెల్ల రంగు కారణంగా అడవుల్లో పరిసరాలతో కలిసిపోవడం కష్టమయ్యే అవకాశం ఉండటంతో వేటలోనూ కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు.
ప్రస్తుతం తెల్ల పులులు ఎక్కువగా జంతుప్రదర్శనశాలలు, సంరక్షణ కేంద్రాల్లో కనిపిస్తాయి. వాటి అరుదైన రంగు కారణంగా గతంలో నియంత్రణలేని పెంపకం, దగ్గరి బంధువుల మధ్య సంతానోత్పత్తి వంటి విధానాలు అనుసరించబడ్డాయి. దీనివల్ల కొన్ని తెల్ల పులుల్లో జన్యుపరమైన సమస్యలు, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల తెల్ల పులులను కేవలం అందమైన జంతువులుగా కాకుండా, శాస్త్రీయ అవగాహనతో, బాధ్యతాయుతమైన సంరక్షణతో చూడాల్సిన అవసరం ఉంది. తెల్ల పులుల ప్రత్యేకత వాటి రంగులోనే ఉన్నప్పటికీ, వాటి సంరక్షణలో ప్రధాన లక్ష్యం ఆరోగ్యం, సంక్షేమం, జన్యు వైవిధ్యాన్ని కాపాడటమే కావాలి.
పులుల స్వభావం, వేట పద్ధతులు:పులులు “సీక్రెటివ్ అనిమల్స్”, “సాలిటరీ అనిమల్స్” అంటే ఒంటరిగా, నిగూఢంగా జీవించే జంతువులు. మనుషుల నుంచి దూరంగా దట్టమైన అడవుల్లో ఉండటానికి ఇష్టపడతాయి. అవి సిగ్గుపడే జీవులు కావు, వాటి సహజమైన జీవన శైలి అది. పులి ఒక మాంసాహార ప్రిడేటర్. 200 నుంచి 300 కిలోల బరువు ఉండే ఈ భారీ జీవులు వేగంగా పరుగెత్తలేవు. కాబట్టి, అవి వేటాడేందుకు ఒక చోట నక్కి కూర్చుని, ఆహార జంతువులు రాగానే దూకి పట్టుకుంటాయి. అధ్యయనాల ప్రకారం, 20 వేట ప్రయత్నాలలో ఒకటి లేదా రెండు మాత్రమే విజయవంతమవుతాయని అంచనా. చిరుతపులుల వలె పులులు చెట్లు ఎక్కలేవు.
సంతానోత్పత్తి, పిల్లల పెంపకం:పులులకు నిర్దిష్టమైన సంతానోత్పత్తి కాలం అంటూ ఏమీ లేదు, ఏడాది పొడవునా ఎప్పుడైనా జతకట్టవచ్చు. గర్భావధి కాలం సుమారు 110 రోజులు. ఒకసారి రెండు నుంచి ఆరు పిల్లలు పుట్టే అవకాశం ఉంది. జతకట్టిన తర్వాత మగపులి ఆడపులిని వదిలి వెళ్లిపోతుంది, పిల్లల పెంపకంలో ఎటువంటి పాత్ర పోషించదు. ఆడపులి (టైగ్రెస్) మాత్రమే పిల్లల సంరక్షణ బాధ్యతను పూర్తిగా వహిస్తుంది. కళ్లు తెరవని పిల్లలకు పాలు ఇచ్చి పెంచుతుంది. క్రమంగా మాంసం తినడం నేర్పుతుంది. తల్లి పులి పిల్లలకు వేట నైపుణ్యాలను నేర్పడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వేటాడుతున్నప్పుడు పిల్లలను వెంట తీసుకువెళ్లి, ఎలా ఆహారం సంపాదించాలో నేర్పుతుంది. పిల్లలు తల్లిని అనుసరించడానికి ప్రత్యేక మార్గాలున్నాయి. తల్లి అడుగులు వేసినప్పుడు దాని కాలి వేళ్ల సందుల నుంచి వెలువడే వాసనను చూసుకుంటూ పిల్లలు వెళ్తాయి. అలాగే, తల్లి చెవుల వెనుక భాగంలో ఉండే తెల్లటి మచ్చలను చూసి కూడా అనుసరిస్తాయి. పిల్లలు పుట్టిన మొదటి కొన్ని నెలల్లో దాదాపు 50 శాతం మరణిస్తాయి. మూడు, నాలుగేళ్ల వయసులో పిల్లలు తల్లిని వదిలి, తమకంటూ ఒక ప్రత్యేక జీవనాన్ని ప్రారంభిస్తాయి. ముఖ్యంగా మగ పులులు ఇన్ బ్రీడింగ్ (దగ్గరి బంధువుల మధ్య సంతానోత్పత్తి) ని నివారించడానికి చాలా దూర ప్రాంతాలకు వెళ్లి తమ టెరిటరీని ఏర్పాటు చేసుకుంటాయి. ఇది జాతి జన్యు వైవిధ్యాన్ని పరిరక్షించడానికి ప్రకృతి చేసిన ఒక సహజ ఏర్పాటు. పులుల ఉనికి పర్యావరణ సమతుల్యతకు అత్యవసరం. వాటిని సంరక్షించడం మనందరి బాధ్యత.
కావలసిన పదార్థాలు: రెండు కేజీల మైదాపిండి, పావుకిలో బొంబాయి రవ్వ, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొంచం ఉప్పు, ఇంకా సరిపడా నీళ్ళు, ఒక కప్పు తురిమిన బెల్లం, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, కలర్ ఫుడ్ పసుపు రంగు, డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ ను తీసుకోవాలి.
ముందుగా ఒక చిన్న గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. ఇంకా దీనిలో కొంచం ఉప్పు, ఒక టీస్పూన్ బొంబాయి రవ్వను కలపాలి. బొంబాయి రవ్వ కలపడం వల్ల జిలేబీలు ఎక్కువ సమయం వరకు క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీటిని కలుపుతూ పిండిని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. పిండి మరీ పల్చగా లేదా మరీ చిక్కగా కాకుండా, జిలేబీ చేయడానికి సరిపడా కన్సిస్టెన్సీలో ఉండాలి. పిండి సిద్ధమైన తర్వాత మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టాలి.
పిండి పక్కన పెట్టే సమయంలో బెల్లం పాకాన్ని సిద్ధం చేసుకోవచ్చు. ఒక పాన్‌లో ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకుని, అందులో అర కప్పు నీటిని పోయాలి. బెల్లం కరిగి పాకం కాసేపు మరిగించాలి. పాకం మరీ తీగపాకంలా కాకుండా, రెండు వేళ్లతో పట్టుకుంటే అంటుకునేలా జిగురుగా ఉండాలి. ఈ దశలో అర టీస్పూన్ యాలకుల పొడి, చిటికెడు పసుపు రంగు వేయాలి. చివరిగా, ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని కలపాలి. నిమ్మరసం కలపడం వల్ల పాకం తిరిగి గట్టిపడకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, పాకం చల్లారకుండా మూతపెట్టి పక్కన ఉంచాలి.
పది నిమిషాల తర్వాత, పిండి కాస్త చిక్కబడి ఉంటుంది. దీనికి కారణం బొంబాయి రవ్వ నీటిని పీల్చుకోవడం. ఇప్పుడు పిండిని తక్షణమే పులియబెట్టడానికి మూడు టీస్పూన్ల నిమ్మరసం , అర టీస్పూన్ బేకింగ్ పౌడర్‌ను కలపాలి. బేకింగ్ పౌడర్ లేకపోతే, బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. వీటన్నింటినీ పిండిలో బాగా కలిపి చిలుకాలి. పిండి మరీ చిక్కగా అనిపిస్తే, ఒకటి లేదా రెండు టీస్పూన్ల నీటిని కలిపి సరైన కన్సిస్టెన్సీకి తీసుకురావాలి. నిమ్మరసం, బేకింగ్ పౌడర్ కలపడం వల్ల పిండి తక్షణమే పులిసినట్లు అవుతుంది, జిలేబీల తయారీకి సిద్ధంగా ఉంటుంది.
సిద్ధం చేసుకున్న పిండిని జిలేబీ బాటిల్ లేదా చిన్న రంధ్రం ఉన్న పాలు కవర్లో తీసుకోవాలి. జిలేబీలు వేయించడానికి ఫ్లాట్‌గా ఉండే పాన్ తీసుకుని, డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె వేడెక్కాక, మంటను మధ్యస్థ స్థాయికి తగ్గించి జిలేబీలను వేయాలి. జిలేబీలు ఒకవైపు గట్టిపడిన తర్వాత, మరోవైపు తిప్పి క్రిస్పీగా వేయించాలి. జిలేబీలను అధిక మంటపై కాకుండా, మధ్యస్థ మంటపై వేయించడం ముఖ్యం.నూనెలో క్రిస్పీగా వేగిన జిలేబీలను వెంటనే తీసి, గోరువెచ్చని బెల్లం పాకంలో వేయాలి. జిలేబీ చల్లారితే పాకాన్ని సరిగ్గా పీల్చుకోదు. కాబట్టి వేడి జిలేబీలను గోరువెచ్చని పాకంలో వేసి 30-40 సెకన్లు నానబెట్టాలి. పాకం జిలేబీలకు బాగా పట్టిన తర్వాత, వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన పిండితో కూడా ఇదే పద్ధతిలో జిలేబీలను తయారుచేసుకోవాలి. జిలేబీ చేసేటప్పుడు పాకం చల్లారిపోతే, మళ్లీ కాస్త వేడి చేసి ఉపయోగించాలి. ఈ విధంగా తయారుచేస్తే, ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే నోరూరించే బెల్లం జిలేబీలు సిద్ధమవుతాయి. ఈ జిలేబీలు రెండు రోజుల వరకు కూడా తమ క్రిస్పీనెస్‌ను కోల్పోకుండా ఉంటాయి.
రేణిగుంట రైల్వే స్టేషన్ లో ఘోర సంఘటన
Ind Vs Afg: భారత్ అలాగే అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరిగిన టీ20 క్రికెట్ సిరీస్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. ఈ సిరీస్ విజయవంతంగా ముగిసినప్పటికీ, మరోవైపు ఢిల్లీ పోలీసులకు ఒక పెద్ద సవాలు ఎదురైంది. క్రికెట్ మ్యాచ్‌లంటే చాలు టికెట్ల కోసం అభిమానులు ఎగబడుతుంటారు. అధికారిక వెబ్సైట్లలో టికెట్లు క్షణాల్లో అయిపోతుండటంతో ఇదే అదనుగా భావించిన కొందరు కేటుగాళ్లు బ్లాక్ మార్కెటింగ్‌కు తెరలేపారు. ఈ అక్రమ దందాను అణచివేయడానికి ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. అరుణ్ జైట్లీ స్టేడియం పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఎంతో వ్యూహాత్మకంగా ఈ దందాను అడ్డుకున్నారు.
పోలీసులు సాధారణ ప్రజల మాదిరిగా డికాయ్ ఆపరేషన్ నిర్వహించారు. నకిలీ వినియోగదారులుగా వెళ్లి టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ బాగోటాన్ని బయటపెట్టారు. ఢిల్లీ గేట్ మెట్రో స్టేషన్ అలాగే ఎంజీ మార్గ్ ప్రాంతాల్లో నిరంతరం గస్తీ కాశారు. స్టేడియానికి వచ్చే ప్రేక్షకులను అదునుగా తీసుకుని భారీ ధరలకు టికెట్లు విక్రయిస్తున్న మోసగాళ్ల గుట్టు రట్టు చేశారు. మూడు రోజుల పాటు సాగిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో మొత్తం 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 71 మ్యాచ్ టికెట్లతో పాటు రూ.7400ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ సిరీస్‌లో భాగంగా సెప్టెంబర్ 13, 15 అలాగే 17 తేదీలలో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 3 మ్యాచ్‌లు జరిగాయి. మ్యాచ్ తేదీలతో సంబంధం లేకుండా పోలీసులు మొదటి రోజు నుంచి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మొదటి మ్యాచ్ ముగిసిన మరుసటి రోజు 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 29 టికెట్లు లభించాయి. రెండో మ్యాచ్ రోజు మరో 10 మందిని అరెస్ట్ చేసి 31 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. చివరి మ్యాచ్ రోజు కూడా నిఘా కొనసాగించి 4 గురు నిందితులను అరెస్ట్ చేశారు.
అధికారిక ధర కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తూ అమాయక ప్రేక్షకులను మోసం చేస్తున్న ఈ ముఠాల ఆటకట్టించారు. స్టేడియం వెలుపల అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం ద్వారా భారీ మోసానికి తెరపడింది. పట్టుబడిన నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పర్యాటకులు అలాగే సాధారణ ప్రజలను మోసగించే వారిపై చట్టంలోని కఠిన నిబంధనలను ప్రయోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇక మైదానంలో ఆట విషయానికి వస్తే రోహిత్ సేన ప్రత్యర్థి జట్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ 3 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వాప్ చేసింది. ప్రతి మ్యాచ్‌లోనూ భారత బ్యాటర్లు అలాగే బౌలర్లు సమిష్టిగా రాణించి అదరగొట్టారు. చివరి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 30 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ బాది అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. మైదానంలో జట్టు సాధించిన విజయాలు ఒకవైపు అభిమానులకు ఆనందాన్ని పంచుతుంటే, మరోవైపు స్టేడియం వెలుపల జరిగిన అక్రమాలపై పోలీసులు తీసుకున్న చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
BSNL Plan: ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), వినియోగదారుల కోసం ఒక రూపాయి ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. అయితే గతంలో ప్రవేశపెట్టిన ప్లాన్‌ను మళ్లీ తిరిగి ప్రారంభించింది. తన వినియోగదారుల సంఖ్యకు కొత్త కస్టమర్లను చేర్చుకోవడానికి ఈ ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ ఈ రూపాయి ప్లాన్‌ను తిరిగి ప్రారంభించింది. వీలైనంత వేగంగా కొత్త వినియోగదారులను చేర్చుకోవడమే BSNL లక్ష్యం. ఈ ప్లాన్ సరిగ్గా అదే చేస్తుంది. ఇది కంపెనీ నుండి లభించే ఫస్ట్ రీఛార్జ్ కూపన్ (FRC) అని గమనించాలి. ఫస్ట్ రీఛార్జ్ కూపన్ అంటే ప్రాథమికంగా, కొత్త సిమ్ కార్డు తీసుకునే వినియోగదారులకు కంపెనీ దీనిని అందిస్తుంది. ఈ ప్లాన్ 24 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. అలాగే ఇది భారతదేశం అంతటా అందుబాటులో ఉంది. BSNL ఈ రూపాయి ప్లాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి: Business Ideas: కేవలం రూ.5 వేలతో మీ జీవితాన్ని మార్చే బిజినెస్ గురించి మీకు తెలుసా?
ప్లాన్ ప్రయోజనాలు:BSNL రూ. 1 ప్లాన్ 24 రోజుల సర్వీస్ వ్యాలిడిటీతో లభిస్తుంది. ఈ FRC ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 1GB డేటా లభిస్తుంది. అంటే వినియోగదారులకు 24GB డేటా లభిస్తుంది. దీనితో పాటు రోజుకు 100 SMSలు కూడా బండిల్‌గా వస్తాయి. ఈ ప్లాన్ రోజుకు కేవలం రూ. 0.04 ఖర్చుతో లభిస్తుంది. వినియోగదారుడు ఈ ప్లాన్‌ను ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలరని గమనించండి. దీనిని మళ్లీ పొందాలంటే మీరు మరొక సిమ్ కార్డు తీసుకోవలసి ఉంటుంది. సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచడానికి, తదుపరి రీఛార్జ్‌ను పాన్ ఇండియాలో అందుబాటులో ఉన్న రెగ్యులర్ ప్రీపెయిడ్ ప్లాన్లతో చేయాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Ration Card: రేషన్‌కార్డు ఉన్న వారికి బిగ్ షాక్.. వీరి రేషన్ నిలిపివేత..!
ఈ ప్లాన్‌ను BSNL చాలాసార్లు ప్రవేశపెట్టింది. కంపెనీ కొన్ని సమయాల్లో ఈ ఆఫర్‌ను ఉపసంహరించుకుంది కూడా. మీరు ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేయాలంటే నేరుగా BSNL నుండే సిమ్ తీసుకోవాలి. సిమ్ కార్డు పొందడానికి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదా సమీపంలోని BSNL కార్యాలయానికి గానీ లేదా అధీకృత రిటైలర్‌కు గానీ వెళ్లవచ్చు. BSNL తన 4G నెట్‌వర్క్‌లోని వినియోగదారుల సంఖ్యను పెంచుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ రూపాయి సిమ్ ప్లాన్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రూపాయి ఆఫర్ అక్టోబర్ 12 వరకు అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.
Kabhi-kabhi connection ki shuruaat bas ₹1 se hoti hai.
#BSNLIndia #BSNLSelfCareApp #InternetForEveryone #DigitalLife #IndiaOnline #BSNLServices #SmartIndia #EverydayConnectivity #freedom1 @CMDBSNL @robertravi21 https://t.co/ETOokN6K8i
— BSNL India (@BSNLCorporate) September 16, 2026
ఇది కూడా చదవండి: బంగారం ధరలు పెరిగినా తక్కువ ధరల్లో జ్యువెలరీస్ కొనడం ఎలాగో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Ganesh Visarjan Rituals Telugu: పది రోజుల పాటు ప్రతి ఇంటిలో ఆనందాన్ని, భజన-కీర్తనలతో భక్తి భావాన్ని, మోదకాల మాధుర్యాన్ని పంచిన తర్వాత బప్పాకు వీడ్కోలు పలికే సమయం రాగానే మనసు కాస్త బరువెక్కుతుంది. 2026లో గణేష్ విసర్జన సెప్టెంబర్ 25, శుక్రవారం అనంత చతుర్దశి రోజున జరగనుంది. గణేష్ చతుర్థి నుంచి అనంత చతుర్దశి వరకు భక్తిశ్రద్ధలతో గణేశుడిని సేవిస్తాం. అయితే, నిమజ్జనానికి ముందు బప్పాకు వీడ్కోలు పలికే ఆ చివరి క్షణాలు కూడా ఎంతో ప్రత్యేకమైనవిగా భావిస్తారు. పౌరాణిక, జానపద విశ్వాసాల ప్రకారం.. బప్పా తన నివాసానికి తిరిగి వెళ్తూ భక్తుల కష్టాలు, బాధలను తనతో పాటు తీసుకెళ్లి, వారి జీవితాల్లో సుఖసంతోషాలను నింపుతాడని నమ్మకం. అందుకే నిమజ్జనానికి ముందు గణేశుడి చెవిలో మనసులోని కోరికను చెప్పే ఆచారం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.
బప్పా చెవిలో ఎందుకు కోరిక చెబుతారు?పారంపర్య విశ్వాసాల ప్రకారం గణేశుడు తన భక్తుల ప్రార్థనలను ఆలకించే దేవుడిగా భావిస్తారు. నిమజ్జనం రోజున బప్పా తన నివాసానికి తిరిగి వెళ్తాడని భక్తులు నమ్ముతారు. అందువల్ల ఆయనకు వీడ్కోలు పలికే ముందు మనసులోని కోరికను ఆయన చెవిలో చెప్పడం ద్వారా తమ ప్రార్థనను బప్పాకు నేరుగా తెలియజేసినట్లుగా భావిస్తారు. కొన్ని జానపద విశ్వాసాల్లో.. భక్తులు చెప్పిన కోరికలను గణేశుడు తనతో పాటు తీసుకెళ్లి శివపార్వతులకు తెలియజేస్తాడని కూడా చెబుతారు. అందుకే నిమజ్జనానికి ముందు బప్పా చెవిలో మనసులోని మాటను చెప్పే సంప్రదాయాన్ని కొందరు భక్తులు పాటిస్తారు.
బప్పా చెవిలో ఏమి, ఎలా చెప్పాలి?1. ఎడమ చెవిలో చెప్పాలి: కొన్ని సంప్రదాయాల్లో గణేశుడి ఎడమ చెవిలో కోరికను చెప్పడం శుభప్రదంగా భావిస్తారు.
2. భక్తిశ్రద్ధలతో ప్రార్థించాలి: మీ కుడి చేతిని నోటికి దగ్గరగా ఉంచి, ఇతరులకు వినిపించకుండా బప్పా చెవిలో మెల్లగా మీ మనసులోని మాటను చెప్పవచ్చు.
3. ‘మామ్ కార్యమ్ కురు’ అని చెప్పే ఆచారం: కొన్ని జానపద విశ్వాసాల ప్రకారం.. బప్పా చెవిలో “మామ్ కార్యమ్ కురు” అని చెప్పే సంప్రదాయం ఉంది. దీని భావం “నా కార్యాన్ని నెరవేర్చు” అని. సంస్కృతంలో చెప్పడం ఇబ్బందిగా అనిపిస్తే, మీకు సులభమైన భాషలోనే మీ కోరికను భక్తితో చెప్పవచ్చు.
4. మీ కోరికను స్పష్టంగా చెప్పండి: ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ శాంతి, ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర వ్యక్తిగత కోరికలు ఏవైనా ఉంటే.. వాటిని బప్పా ముందు మనస్ఫూర్తిగా ప్రార్థించవచ్చు. ముఖ్యంగా ఇతరులకు హాని కలిగించే కోరికల కంటే, కుటుంబం, సమాజానికి మేలు చేసే కోరికలను కోరుకోవడం మంచిదని భక్తులు భావిస్తారు.
గణేష్ విసర్జనకు ముందు ఈ 4 విషయాలు గుర్తుంచుకోండి1. పొరపాట్లకు క్షమాపణ కోరండి: పది రోజుల పూజా సమయంలో తెలిసీ తెలియక ఏదైనా పొరపాటు జరిగి ఉంటే, నిమజ్జనానికి ముందు చేతులు జోడించి బప్పాను క్షమాపణ కోరండి.
2. ప్రసాదాన్ని వెంట తీసుకెళ్లేలా చేయండి: కొన్ని ప్రాంతీయ ఆచారాల్లో బప్పా ప్రయాణం శుభప్రదంగా సాగాలని కోరుతూ ఆయనతో పాటు బెల్లం, మోదక్ లేదా కొబ్బరికాయ వంటి పొడి ప్రసాదాన్ని ఉంచుతారు.
3. చివరి హారతి ఇవ్వండి: నిమజ్జనానికి ముందు కుటుంబ సభ్యులంతా కలిసి చివరి హారతి ఇచ్చి, ప్రార్థనలు చేసుకోవాలి. కొన్ని సంప్రదాయాల్లో విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్లే ముందు దాని స్థానంలో నుంచి కొద్దిగా ముందుకు జరిపే ఆచారం కూడా ఉంది.
4. భక్తితో వీడ్కోలు పలకండి: బప్పాకు వీడ్కోలు పలుకుతూ “గణపతి బప్పా మోరియా.. వచ్చే ఏడాది త్వరగా రండి!” అంటూ భక్తితో నినదించండి. బప్పా మళ్లీ తమ ఇంటికి రావాలని కోరుకుంటూ ఆనందంగా వీడ్కోలు ఇవ్వడం ఈ పండుగలో ముఖ్యమైన భావంగా భావిస్తారు. బప్పాకు వీడ్కోలు అంటే కేవలం విగ్రహ నిమజ్జనం మాత్రమే కాదు.. ఆయన ఆశీర్వాదాలను మనసులో నిలుపుకుని, వచ్చే ఏడాది మరింత భక్తిశ్రద్ధలతో స్వాగతించాలనే సంకల్పంతో వీడ్కోలు పలకడం కూడా.
(Disclaimer: ఈ కథనంలోని వివరాలు మతపరమైన విశ్వాసాలు, జానపద కథలు, ప్రాంతీయ ఆచారాల ఆధారంగా అందించబడ్డాయి. వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన విషయాలుగా భావించకూడదు. ఆచారాలను పాటించాలా వద్దా అనేది వ్యక్తిగత విశ్వాసం, సంప్రదాయం, విచక్షణపై ఆధారపడి ఉంటుంది.)
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవలే మనశాంకర వరప్రసాద్ గారు సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు చిరు. ఇక ఇప్పుడు రెండు సినిమాలను లైనప్ చేశారు. వాటిలో ఒకటి ఎప్పటినుంచో సాగుతున్న విశ్వంభర. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా కాలంగా సాగుతుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అలాగే మరో సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కితున్న కాకా. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే చిరంజీవి ఓ బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్నారట. ఆ సినిమాను సూపర్ స్టార్ రజినీకాంత్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారట. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.?
Aditi Myakal : మేడమ్ సార్ మేడమ్ అంతే..! మెంటలెక్కిస్తున్న అర్జున్ రెడ్డి భామమలయాళ క్లాసిక్ ‘మణిచిత్రతాళు’ విషయంలో జరిగింది. ఈ కథను తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించాలనే ఆలోచన ఒక దశలో ఉండగా.. ఆయన ఆసక్తి చూపకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదట. ఆ తర్వాత ఇదే కథలో కీలక మార్పులు చేసి తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌తో చంద్రముఖిగా తెరకెక్కించారు. 1993లో దర్శకుడు ఫాజిల్ రూపొందించిన ‘మణిచిత్రతాళు’ మలయాళ సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. హారర్, సైకలాజికల్ థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా అంశాలను కలగలిపి రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.. కట్ చేస్తే సోషల్ మీడియాను షేక్ చేస్తుందిమోహన్లాల్, శోభన, సురేష్ గోపీ తదితరులు నటించిన ఈ చిత్రం కథనం, పాత్రల చిత్రణ, మిస్టరీ, క్లైమాక్స్ కారణంగా క్లాసిక్‌గా నిలిచిపోయింది. ముఖ్యంగా సినిమాలోని మానసిక పరిస్థితులను చూపించిన తీరు అప్పట్లో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. మణిచిత్రతాళు విజయం తర్వాత ఈ కథను తెలుగులోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరిగాయి. దర్శకుడు వి.ఎన్. ఆదిత్య ఈ కథను మెగాస్టార్ చిరంజీవితో రీమేక్ చేయాలనే ఆలోచనతో ఆయనను సంప్రదించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. మలయాళంలో మోహన్‌లాల్ పోషించిన సైకియాట్రిస్ట్ పాత్రను తెలుగులో చిరంజీవితో చేయించాలని భావించారు. కథను చిరంజీవికి వివరించినప్పుడు ఆయన కథలోని ప్రత్యేకతను అర్థం చేసుకున్నప్పటికీ.. తన అప్పటి స్టార్ ఇమేజ్‌కు ఈ సినిమా ఎంతవరకు సరిపోతుందనే విషయంలో సందేహాలు వ్యక్తమైనట్లు సమాచారం. అప్పట్లో చిరంజీవి సినిమాలంటే ప్రేక్షకులు భారీ స్థాయిలో కమర్షియల్ అంశాలను ఆశించేవారు. హీరో ఇంట్రడక్షన్, యాక్షన్ సన్నివేశాలు, పాటలు, డ్యాన్సులు, పవర్ఫుల్ డైలాగులు వంటి అంశాలు ఆయన సినిమాల్లో కీలకంగా ఉండేవి. అయితే ‘మణిచిత్రతాళు’ కథ మాత్రం పూర్తిగా భిన్నమైనది. కథలో అసలు మిస్టరీ మహిళా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. హీరో పాత్ర కంటే సినిమాలో మిస్టరీ మహిళ పాత్రే ఎక్కువ హైలెట్ అవుతుంది. దాంతో ఈ సినిమా మెగాస్టార్ చేయలేదు. దాంతో ఈ కథ దర్శకుడు పి. వాసు దృష్టికి వెళ్లింది. అయితే ఆయన దాన్ని యథాతథంగా రీమేక్ చేయకుండా.. తమిళ ప్రేక్షకుల అభిరుచికి, ముఖ్యంగా రజనీకాంత్ స్టార్ ఇమేజ్‌కు అనుగుణంగా కథనంలో అనేక మార్పులు చేశారు. 2005లో ‘చంద్రముఖి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు, వడివేలు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది.
అప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే మాజీ సీఎం భార్య.. ఇద్దరి మధ్య 27ఏళ్ల ఏజ్ గ్యాప్మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Vastu Tips for Rental House Telugu: వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి నిర్మాణం, గదుల అమరిక లేదా వస్తువుల స్థానంలో ఉండే లోపాలను వాస్తు దోషాలుగా భావిస్తారు. వీటి వల్ల కుటుంబంలో అశాంతి, మానసిక ఒత్తిడి, అనవసర ఖర్చులు, పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయని చాలామంది నమ్ముతారు. అందుకే సొంత ఇల్లు నిర్మించే సమయంలో వాస్తు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, అద్దె ఇంట్లో నివసించే వారికి నిర్మాణంలో మార్పులు చేయడం సాధ్యం కాదు. అలాంటి సందర్భాల్లో కొన్ని సులభమైన అలవాట్ల ద్వారా ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా, సానుకూలంగా ఉంచుకోవచ్చని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
ఇంట్లో గాలి, వెలుతురు ప్రసరించేలా చూడండిప్రతి ఉదయం కిటికీలు, తలుపులు కొంతసేపు తెరిచి ఉంచండి. దీని వల్ల ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి, సహజ కాంతి ప్రవేశిస్తాయి. వాస్తు విశ్వాసాల ప్రకారం, ఇది ప్రతికూలతను తగ్గించి ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.
సాయంత్రం దీపం లేదా ధూపం వెలిగించండిసాయంత్రం సమయంలో దీపం, అగరబత్తి లేదా కర్పూరంతో ధూపం వేయడం చాలామంది ఆచరిస్తారు. పరిమళభరితమైన వాతావరణం మనసుకు ప్రశాంతతను అందించడమే కాకుండా ఇంటికి ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తుందని నమ్ముతారు. అవసరమైతే సహజ సువాసనలు లేదా ఫ్రెషనర్లను కూడా ఉపయోగించవచ్చు.
ఇంటిని పరిశుభ్రంగా ఉంచండిఇంట్లో అనవసర వస్తువులు పేరుకుపోకుండా చూసుకోవాలి. విరిగిపోయిన, పాడైన లేదా ఉపయోగించని వస్తువులను తొలగించడం మంచిది. వాస్తు ప్రకారం, అస్తవ్యస్తంగా ఉన్న ప్రదేశాలు ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయని చెబుతారు.
అలాగే, ఇంటి మూలలను తరచూ శుభ్రం చేయాలి. దుమ్ము, సాలెగూళ్లు పేరుకుపోకుండా చూసుకుంటే ఇల్లు తాజాగా, పరిశుభ్రంగా కనిపిస్తుంది.
వాస్తు విశ్వాసాల ప్రకారం, నీటిలో కొద్దిగా ఉప్పు లేదా నల్ల ఉప్పు కలిపి నేలను తుడవడం వల్ల ప్రతికూలత తగ్గుతుందని భావిస్తారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక వంటి శుభ చిహ్నాలను ఉంచవచ్చు. అలాగే, ఒక చిన్న గాజు పాత్రలో ఉప్పు పెట్టి ద్వారం దగ్గర ఉంచడం కూడా కొందరు పాటించే ఆచారం. వారానికి ఒకసారి ఆ ఉప్పును మార్చడం మంచిదని చెబుతారు. బాత్రూంలో కూడా ఒక పాత్రలో సముద్రపు ఉప్పు ఉంచడం ద్వారా ఆ ప్రదేశంలోని శక్తి సమతుల్యం అవుతుందని వాస్తు నిపుణులు పేర్కొంటారు. ఈ ఉప్పును కూడా క్రమం తప్పకుండా మార్చాలి.
ఇంట్లో చిన్న మొక్కలను పెంచండిచిన్న ఇండోర్ మొక్కలు ఇంటికి సహజ అందాన్ని తీసుకురావడమే కాకుండా వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి. పచ్చదనం మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. అయితే, ఇంట్లో తేమ, గాలి ప్రసరణ లేదా ఇతర పర్యావరణ సమస్యలు ఎక్కువగా ఉంటే, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
(Disclaimer: వాస్తు చిట్కాలు సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా ఉంటాయి. వీటిని వ్యక్తిగత నమ్మకాల ప్రకారం అనుసరించవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)
ప్రపంచంలో ఎన్నో రకాల అడవి జంతువులు ఉన్నాయి. వాటిలో కొన్ని తమ ప్రత్యేకమైన శరీరాకృతి, జీవనశైలి, అలవాట్లతో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి. అలాంటి అరుదైన జంతువుల్లో మార్కోర్ ఒకటి. మెలికలు తిరిగిన కొమ్ములు, కొండలను సైతం అవలీలగా ఎక్కే సామర్థ్యం, ప్రత్యేకమైన జీవన విధానం ఈ అడవి మేకను విశిష్టంగా నిలబెడతాయి. పాకిస్థాన్ జాతీయ జంతువుగా గుర్తింపు పొందిన మార్కోర్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
మార్కోర్ అంటే ఏమిటి?మార్కోర్ మేకల కుటుంబానికి చెందిన పెద్ద అడవి జంతువు. మధ్య, దక్షిణ ఆసియాలోని పర్వత ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది. ముఖ్యంగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, భారత్‌లోని కొన్ని ప్రాంతాలు, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ తదితర ప్రాంతాల్లో దీని ఆవాసాలు ఉన్నాయి. ఎత్తైన పర్వతాలు, రాతి వాలులు, పొదలతో కూడిన అడవుల్లో జీవించడానికి ఇది అలవాటు పడింది. మార్కోర్ను ప్రత్యేకంగా గుర్తించేది దాని మెలికలు తిరిగిన కొమ్ములే. ఈ కారణంగానే దీనిని మెలికల కొమ్ముల మేక అని కూడా పిలుస్తారు. మగ మార్కోర్ కొమ్ములు పొడవుగా, మెలికలు తిరిగిన ఆకారంలో ఉంటాయి. ఆడ జంతువులకు కూడా కొమ్ములు ఉన్నప్పటికీ, అవి సాధారణంగా మగ జంతువుల కొమ్ముల కంటే చిన్నవిగా ఉంటాయి.
పాములను తినే మేకగా పేరు.. కానీ నిజంగా తింటుందా?మార్కోర్ అనే పేరుకు కొన్ని భాషల్లో పాములను తినే జంతువు అనే అర్థం ఉందని చెబుతారు. అయితే ఈ జంతువు వాస్తవానికి శాకాహారి. గడ్డి, ఆకులు, పొదలు, చెట్ల కొమ్మలు, మొగ్గలు వంటి మొక్కల పదార్థాలను ఆహారంగా తీసుకుంటుంది. పాములను తింటుందనే ప్రచారం ఉన్నప్పటికీ, దాని సాధారణ ఆహారంలో పాములు భాగం కావు. మార్కోర్ ఆహారపు అలవాట్లు అది నివసించే పర్వత ప్రాంతాల్లో లభించే వృక్ష సంపదపై ఆధారపడి ఉంటాయి. కాలానుగుణంగా ఆహారంలో మార్పులు కనిపిస్తాయి.
నిటారుగా ఉన్న కొండలను సైతం అవలీలగా ఎక్కుతుందిమార్కోర్ ప్రత్యేకతల్లో కొండలను ఎక్కే సామర్థ్యం ఒకటి. రాతితో కూడిన నిటారుగా ఉన్న పర్వత వాలులపై కూడా ఇది చురుగ్గా కదలగలదు. బలమైన కాళ్లు, రాళ్లపై పట్టును అందించే గిట్టలు పర్వత ప్రాంతాల్లో సంచరించడానికి సహాయపడతాయి. కొన్ని ప్రాంతాల్లో మార్కోర్ చెట్లపైకి ఎక్కి ఆకులను తింటున్నట్లు కూడా గమనించారు. కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో జీవించగలిగే సామర్థ్యం ఈ జంతువుకు ప్రకృతి అందించిన అద్భుతమైన లక్షణంగా చెప్పవచ్చు.
వేల అడుగుల ఎత్తులో జీవనంమార్కోర్ సాధారణంగా పర్వత అడవులు, పొదలతో కూడిన ప్రాంతాలు, రాతి వాలుల్లో నివసిస్తుంది. సముద్ర మట్టానికి సుమారు 600 నుంచి 3,600 మీటర్ల ఎత్తు వరకు ఉన్న ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది. చలికాలంలో వాతావరణ పరిస్థితులను బట్టి తక్కువ ఎత్తులోని ప్రాంతాలకు కదులుతుంది. పర్వత ప్రాంతాల్లోని చలి, రాతి నేల, పరిమిత ఆహార వనరులకు అనుగుణంగా జీవించగలగడం మార్కోర్ ప్రత్యేకత. అయితే వివిధ ప్రాంతాల్లోని మార్కోర్ జాతులు, ఉపజాతుల ఆవాస పరిస్థితుల్లో తేడాలు ఉంటాయి.
మగ మార్కోర్ ఒంటరిగా.. ఆడవి గుంపులుగామార్కోర్ సామాజిక జీవన విధానం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. మగ జంతువులు సాధారణంగా ఒంటరిగా సంచరిస్తుంటాయి. మరోవైపు ఆడ మార్కోర్లు తమ పిల్లలతో కలిసి చిన్న గుంపులుగా కనిపిస్తాయి. సంతానోత్పత్తి కాలంలో మగ జంతువులు ఆడ గుంపులతో కలుస్తాయి. ఈ సమయంలో ప్రత్యర్థి మగ జంతువుల మధ్య కొమ్ములతో పోరాటాలు జరగవచ్చు. ఆడ జంతువులను ఆకర్షించేందుకు, ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఈ పోరాటాలు చోటుచేసుకుంటాయి.
పాకిస్థాన్ జాతీయ జంతువుగా గుర్తింపుమార్కోర్ పాకిస్థాన్ జాతీయ జంతువు. ఆ దేశ పర్వత పర్యావరణ వ్యవస్థలో దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రకృతి వారసత్వానికి, వన్యప్రాణుల సంరక్షణకు ఇది ఒక ముఖ్యమైన ప్రతీకగా నిలుస్తుంది. మార్కోర్ సంరక్షణపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచేందుకు ఐక్యరాజ్యసమితి మే 24ను అంతర్జాతీయ మార్కోర్ దినోత్సవంగా ప్రకటించింది. పర్వత ప్రాంతాల జీవవైవిధ్యాన్ని కాపాడటంలో ఈ జంతువు ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ దినోత్సవం ఉద్దేశాల్లో ఒకటి.
అంతరించిపోయే ప్రమాదం నుంచి రక్షణ అవసరంగతంలో మార్కోర్ సంఖ్యపై వేట, అక్రమ వేట, ఆవాసాల నష్టం వంటి సమస్యలు ప్రభావం చూపాయి. పశువుల మేత కోసం పోటీ, వాతావరణ మార్పులు కూడా దీని మనుగడకు సవాళ్లుగా ఉన్నాయి. అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంస్థ అంచనా ప్రకారం మార్కోర్ ప్రస్తుతం ముప్పు సమీపంలో ఉన్న జాతిగా పరిగణించబడుతోంది. రక్షిత ప్రాంతాల ఏర్పాటు, అక్రమ వేట నియంత్రణ, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో సంరక్షణ కార్యక్రమాలు చేపట్టడం ఈ జంతువు భవిష్యత్తుకు కీలకం.
మంచు చిరుతలకు ఆహారంగా కూడా మార్కోర్పర్వత పర్యావరణ వ్యవస్థలో మార్కోర్ ఆహార గొలుసులో ఒక ముఖ్యమైన భాగం. మంచు చిరుత వంటి పెద్ద మాంసాహార జంతువులకు ఇది ఆహారంగా ఉపయోగపడుతుంది. అందువల్ల మార్కోర్ సంరక్షణ కేవలం ఒక జంతువును కాపాడటానికే పరిమితం కాదు. పర్వత ప్రాంతాల పర్యావరణ సమతుల్యతను రక్షించడంలోనూ దీనికి ప్రాధాన్యత ఉంది.
మార్కోర్ జీవితకాలం ఎంత?మార్కోర్ సాధారణంగా అడవిలో సుమారు పది నుంచి పదమూడు సంవత్సరాల వరకు జీవించగలదని వన్యప్రాణుల సమాచారం సూచిస్తుంది. ఆహారం లభ్యత, ఆవాస పరిస్థితులు, వ్యాధులు, వేటాడే జంతువులు వంటి అనేక అంశాలు దీని జీవితకాలంపై ప్రభావం చూపుతాయి.
మెలికలు తిరిగిన కొమ్ములతో ప్రత్యేకమైన రూపం, నిటారుగా ఉన్న కొండలను ఎక్కే సామర్థ్యం, పర్వత పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర.. మార్కోర్ను ప్రకృతిలోని అద్భుతమైన జంతువుల్లో ఒకటిగా నిలబెడుతున్నాయి. అరుదైన ఈ అడవి మేకను కాపాడేందుకు వన్యప్రాణుల సంరక్షణ, ఆవాసాల రక్షణ ఎంతో అవసరం. మార్కోర్ గురించి తెలుసుకోవడం ద్వారా పర్వత ప్రాంతాల్లోని జీవవైవిధ్యాన్ని, ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవాల్సిన బాధ్యతను మనం గుర్తించవచ్చు.
Jos Buttler: క్రికెట్ ప్రపంచంలో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ మరోసారి తన సత్తా చాటాడు. గురువారం నాడు శ్రీలంక జట్టుతో ముగిసిన 2వ టీ20 పోరులో ఇంగ్లండ్ జట్టు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన ఇంగ్లీష్ జట్టు, కేవలం 13వ ఓవర్లోనే విజయలక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి 3 మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ కీలక పోరులో శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 146 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టార్గెట్ చిన్నదే అయినప్పటికీ, ఆరంభంలోనే వేగంగా పరుగులు సాధించాలనే లక్ష్యంతో ఇంగ్లండ్ ఓపెనర్లు బరిలోకి దిగారు. ఓపెనర్‌గా క్రీజులోకి అడుగుపెట్టిన జోస్ బట్లర్ తనదైన శైలిలో బ్యాటింగ్ ప్రారంభించాడు. కేవలం 16 బంతులను మాత్రమే ఎదుర్కొన్న అతను, ఒక ఫోర్ అలాగే ఒక సిక్సర్ సహాయంతో 30 పరుగులు బాది జట్టుకు బలమైన పునాది వేశాడు. ఈ చిన్న ఇన్నింగ్స్ అయినప్పటికీ, క్రికెట్ చరిత్రలో ఇది ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
15000 పరుగుల అద్భుత ఘనత
1000 కాదు.. 2000 కాదు.. ఏకంగా 15000 పరుగుల ప్రయాణాన్ని పూర్తి చేయడం ఏ బ్యాటరైనా సరే సాధించే సాధారణ విషయం కాదు. 2009 నుంచి టీ20 ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్న బట్లర్, ఈ మ్యాచ్‌తో తన మొత్తం టీ20 కెరీర్లో సరికొత్త రికార్డును సృష్టించాడు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోని మొట్టమొదటి క్రికెటర్‌గా అతడు చరిత్ర పుటల్లో నిలిచాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు అగ్రస్థానంలో కొనసాగిన వెస్టిండీస్ దైత్యుడు కీరన్ పొలార్డ్ రికార్డును బద్దలు కొట్టాడు. పొలార్డ్ గతంలో 14999 పరుగులు చేసి ఉండగా, బట్లర్ ఆ రికార్డును సులభంగా అధిగమించాడు.
ఇప్పటివరకు 528 మ్యాచ్‌లు ఆడిన బట్లర్, 497 ఇన్నింగ్స్‌లలో 35.46 సగటుతో సరిగ్గా 15000 పరుగులు పూర్తి చేశాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అతడు 9 సెంచరీలు, 107 హాఫ్ సెంచరీలు సాధించి తన జోరును చాటుకున్నాడు. మైదానంలో నలుమూలలా షాట్లు ఆడే అతడి సామర్థ్యమే ఈ అరుదైన రికార్డు సాధనకు ప్రధాన కారణమని చెప్పవచ్చు.
అగ్రస్థానంలో నిలిచిన దిగ్గజాల జాబితా
టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాను పరిశీలిస్తే, జోస్ బట్లర్ 15000 పరుగులతో అగ్రపీఠాన్ని అలంకరించాడు. అతడి తర్వాతి స్థానాల్లో ప్రపంచ స్థాయి హిట్టర్లు నిలిచారు. కీరన్ పొలార్డ్ 14999 పరుగులతో 2వ స్థానానికి పరిమితమయ్యాడు. ఆ తర్వాత అలెక్స్ హేల్స్ 14581 పరుగులు, క్రిస్ గేల్ 14562 పరుగులు, అలాగే డేవిడ్ వార్నర్ 14284 పరుగులతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఇక భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ 6వ స్థానంలో నిలిచాడు. కోహ్లీ 430 మ్యాచ్‌లలో 413 ఇన్నింగ్స్‌లు ఆడి 14218 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో కోహ్లీ 10 సెంచరీలు, 118 హాఫ్ సెంచరీలు నమోదు చేసి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఆధార్ గుర్తింపు కార్డు లేదు.. ప్యాంటు జేబులో ఉన్నది 280 రూపాయలే .. ఆ చిన్న మొత్తంతో, గుండెల నిండా ధైర్యంతో 17 ఏళ్ల టీనేజ్ కుర్రాడు శ్రీలంక వెళ్లే సాహసం చేసాడు. అతనికి ఫేస్ బుక్ ద్వారా ఓ 14 ఏళ్ల బాలిక పరిచయమైంది. బాలిక పై మనసు పారేసుకున్న తమిళ టీనేజ్ బాలుడు తన ప్రియురాలిని కలిసేందుకు శ్రీలంకలోకి అక్రమంగా ప్రవేశించాడు. బాలికను నేరుగా చూడాలన్న ఆశతో .. శ్రీలంకకు వెళ్లడానికి తొలుత రామేశ్వరం వచ్చాడు. శ్రీ లంక తీసుకెళ్లాలని రామేశ్వరంలో ఒక బోటు ఆపరేటర్‌ను ప్రాధేయపడ్డాడు. బదులుగా తన మెడలోని బంగారు గొలుసు తీసి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. పడవ ఆపరేటర్ అంగీకరించడంతో బేరం కుదిరింది. అయితే, పాక్ జలసంధిని దాటించిన ఆ వ్యక్తి శ్రీలంకలోని తలైమన్నార్ సమీపంలో జనసంచారం లేని ఓ ఇసుక దిబ్బపై కుర్రాడిని దింపాడు. స్థానిక శ్రీలంక పడవ వచ్చి తీసుకెళుతుందని, భయపడకుండా వేచి చూడాలని చెప్పి దింపి వెళ్లిపోయాడు. బోటు ఆపరేటర్ మాటలు నమ్మి కుర్రాడు ఆ నిర్జన ప్రాంతంలో శ్రీలంక పడవ కోసం గంటల తరబడి వేచి చూసాడు. ఒంటరిగా ఇసుక దిబ్బ పై నీరసంగా కూర్చున్న బాలుడిని గమనించిన శ్రీలంక నావికాదళం అధికారులు సెప్టెంబర్ 11న అతడ్ని రక్షించారు. ఒడ్డుకు చేర్చి ఆహారం, తాగునీరు అందించడంతో పాటు వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత చట్టపరమైన చర్యల కోసం తలైమన్నార్ పోలీసులకు కుర్రాడిని అప్పగించారు.
Indian Teenager Left Alone In Sand Bank Near Sri Lanka
తల్లి శ్రీలంక వాస్తవ్యురాలుపోలీసుల విచారణలో కుర్రాడి కుటుంబ వివరాలు తెలిసాయి. కుర్రాడి తల్లి శ్రీలంకకు చెందిన వ్యక్తి కాగా, ఆ కుర్రాడు భారతదేశంలో జన్మించిన భారతీయ పౌరుడని తేలింది. అయితే, తన జాతీయతను ధ్రువీకరించే గుర్తింపు కార్డు కానీ సరైన ప్రయాణ పత్రాలు కానీ లేకుండానే అక్రమంగా ప్రవేశించడంతో సెప్టెంబర్ 12న శ్రీలంకలోని మన్నార్ కోర్టులో అతడిని హాజరుపరిచారు. అయితే కోర్టులో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కుర్రాడి నానమ్మ తనే నంటూ ఒక వృద్ధురాలు ముందుకు వచ్చారట. అయితే వారి మధ్య బంధాన్ని నిరూపించే అధికారిక పత్రాలు సమర్పించాలని కోర్టు కోరగా ఆమె తన దగ్గర ఫొటోలు లేవని చెప్పారట. దాంతో కుర్రాడిని ఆమెకు కస్టడీ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. దర్యాప్తు నివేదిక అందే వరకు కుర్రాడిని ప్రభుత్వ సంరక్షణ హోమ్‌లో ఉంచాలని మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసారు.
జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు
వచ్చే నెలలో కర్కాటక రాశిలో గురు, చంద్రుడు కలవబోతున్నారు. ఈ శక్తివంతమైన కలయిక వలన గజకేసరి యోగం ఏర్పడనుంది. అంతే కాదు, ఈ ప్రభావం 12 రాశుల వారి పైన పడనుంది. 12 రాశులలో రెండు రాశులకు మాత్రం విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఇంకా వీరి వ్యాపారాలు కూడా విస్తరిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
మీ ఆదాయం పెరుగుతుంది ఇంకా మీకు రావాల్సిన డబ్బులు కూడా వస్తాయి. ఇంకా వీరి ఆర్థిక ప్రణాళికలపరిస్థితులు కూడా మెరుగుపడతాయి ఇంకా కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయినా వారికీ కూడా మొత్తం మారుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. మీ పైఅధికారుల నుండి ప్రశంసలు వస్తాయి
కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టిన వాళ్ళకి అధిక లాభాలు వస్తాయి. అలాగే మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఇంకా పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది. మీరు కొత్తగా చేసే ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం వస్తుంది అప్పుడు మొత్తం మారుతుంది.
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
నదులు, జలాశయాలు ఎండిపోతున్న తీవ్రమైన ఎండలు, కరువు పరిస్థితుల మధ్య దక్షిణ బోస్నియాలోని ఓ శతాబ్దాల నాటి బావి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఏడాది నెలల తరబడి వర్షం లేకపోయినా, ఈ పురాతన బావిలో నీరు అస్సలు ఇంకిపోకపోవడం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఈ బావి ఎప్పటికీ పూర్తిగా ఎండిపోదు అనే స్థానికుల నమ్మకాన్ని నిజం చేస్తూ, ఇది నిరంతరం నీటితో కళకళలాడుతోంది. దక్షిణ బోస్నియాలోని బోల్జుని గ్రామానికి సమీపంలో, మధ్యయుగం నాటి సమాధుల ప్రాంగణంలో ఈ బావి ఉంది. స్థానికులు తరతరాలుగా ఈ నీటిని తాగడానికి, పంటలకు, బట్టలు ఉతకడానికి ఉపయోగించారు.
సుమారు 1300 రాతి పలకలను ఉపయోగించి, ఆరు మీటర్ల లోతుతో, 20 వలయాకార పొరలుగా ఈ బావిని నిర్మించారు. పురావస్తు నిపుణుల అంచనా ప్రకారం, 15వ శతాబ్దానికి చెందిన సమాధుల కంటే ఇది వందల ఏళ్ల క్రితం నాటిది. ప్రాచీన మానవులు ప్రకృతితో ఎంత సామరస్యంగా జీవించారో, వారి నిర్మాణ నైపుణ్యం ఎంత గొప్పదో ఈ బావి నిదర్శనం. యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంలో భాగంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతం, 2022లో కొత్త హైవే అందుబాటులోకి రావడంతో ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. పూర్వకాలంలో బావుల్లో వస్తువులను వేసే ఆచారం ఉన్నందున, శాస్త్రీయ తవ్వకాలు జరిపితే మరిన్ని చారిత్రక రహస్యాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.
సెప్టెంబర్ చివరలో శుక్ర యోగం ఏర్పడనుంది. ముఖ్యంగా మూడు నక్షత్రాల్లో జన్మించిన వారిపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందంట. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం వలన మూడు రాశుల వారికి ఈ సమయంలో ఆర్థికంగా కలిసి రానున్నది. కాగా, ఏ రాశుల వారికి శుక్రుడి అనుగ్రహంతో అదృష్టం కలిసి వస్తుందో చూద్దాం.
సింహ రాశి : సింహ రాశి వారికి శుక్ర యోగం వలన చాలా అద్భుతంగా ఉంటుంది. మహాలక్ష్మీ అనుగ్రహం వీరిపై ఉండటం వలన వీరికి ధనానికి ధాన్యానికి లోటే ఉండదు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. చేతినిండా డబ్బులతో చాలా ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు కూడా కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అన్నివిధాలుగా వీరికి చాలా అద్భుతంగా ఉండనుంది.
మీన రాశి : మీన రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఈ రాశి వారు గత కొన్ని రోజుల నుంచి ఎవరు అయితే సమస్యలతో బాధపడతారో, వారు వాటి నుంచి బయట పడతారు. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం. ఆర్థికంగా కలిసి వస్తుంది. గత కొన్ని రోజుల నుంచి అప్పుల బాధలతో సతమతం అయ్యే వారు కూడా ఈ సమయంలో వాటి నుంచి బయటపడతారు. ఆనందంగా ఉంటారు.
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేసే ఛాన్స్ ఉంది. అన్ని విధాలుగా వీరికి ఇది చాలా శుభ సమయం.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు
పిల్లల మంచి ఆహారం అందించాలని , వారికి బలమైన, మంచి పోషకాలు ఉన్న ఆహారం అందించాలని తల్లిదండ్రులు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అందుకోసం, ప్రతి రోజు కొత్త కొత్త ఆహారాలను రెడీ చేయడం కోసం సెర్చ్ చేస్తుంటారు. అయితే పిల్లలకు ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా, వారు ఇష్టంగా ఫుడ్ తినాలి అంటే తప్పకుండా వారి డైట్లో ఈ టమాటా రైస్ ఉండాల్సిందేనంట. దానిని సులభంగా ఎలా చేయాలి అంటే?
టమాటా రైస్ చేయడానికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. టమాటాలు, నెయ్యి, నూనె, పచ్చి మిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బంగాళ దుంపలు, లవంగాలు, కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, బియ్యం, పుదీనా, గరం మసాలా.
తయారీలోకి వెళ్లితే.. ముందుగా బియ్యం తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత రిసిపీ రెడీ చేయడం కోసం, ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని, అందులో 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్స్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
ఆ తరువాత, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరిగిన బంగాళ దుంప ముక్కలు, టమాట ముక్కలు వేసి బాగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి, టమాట ముక్కలు మెత్తగా అయ్యేవరకు సుమారు 5 నిమిషాలు మగ్గించాలి.
ఇప్పుడు, ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసి ఒక నిమిషం పాటు కలపాలి. బియ్యానికి సరిపడా నీళ్లు పోసి, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా గరం మసాలా వేసి కలపాలి. కుక్కర్ మూత పెట్టి, మీడియం మంటపై 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత, మూత తీసి నెమ్మదిగా కలిపితే, కమ్మని టమాటో రైస్ సిద్ధంగా ఉంటుంది. ఇది పిల్లల లంచ్ బాక్స్‌కే కాకుండా, ఇంట్లో అల్పాహారానికి కూడా బెస్ట్
కొండచిలువ పేరు వింటేనే గుండెల్లో దడ పుడుతుంది. అలాంటిది అడుగుల కొద్దీ పొడవున్న భారీ కొండచిలువ ఎదురుపడితే ఎవరైనా ఆమడదూరం పరుగులు తీస్తారు. కానీ ఓ యువకుడు మాత్రం కలలో కూడా ఊహించని సాహసానికి ఒడిగట్టాడు. బావిలో పడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న భారీ కొండచిలువను కాపాడేందుకు ఏకంగా లోతైన బావిలోకి దిగి ప్రాణాలకు తెగించాడు. ప్రస్తుతం నెట్టింట ఒళ్లు గగుర్పొడిచే ఈ రెస్క్యూ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రకారం.. లోతైన బావిలోని నీటి గుంట వద్ద ప్రమాదవశాత్తు ఒక భారీ కొండచిలువ చిక్కుకుపోయింది. అది బయటకు రాలేక విలవిల్లాడుతుండటాన్ని గమనించిన ఒక యువకుడు, దానిని రక్షించాలని నిర్ణయించుకున్నాడు. బావి అడుగుభాగానికి దిగి కొండచిలువను చేతులతో బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. అయితే దగ్గరకు వెళ్లి పరిశీలించగానే దాని భారీ ఆకారం, ఊహకందని పొడవు, బరువు చూసి ఆ యువకుడు కొన్ని క్షణాల పాటు నిశ్చేష్టుడయ్యాడు. కాస్త పట్టు తప్పినా ఆ కొండచిలువ చుట్టేసేంత ప్రమాదం పొంచి ఉండటంతో ఆపరేషన్ అత్యంత క్లిష్టంగా మారింది.
అయినా ఏమాత్రం భయపడకుండా, పూర్తి సంయమనంతో ఆ యువకుడు కొండచిలువ తోక భాగాన్ని గట్టిగా పట్టుకుని నెమ్మదిగా లాగడం మొదలుపెట్టాడు. ఆ యువకుడి పట్టు నుంచి తప్పించుకునేందుకు ఆ భారీ కొండచిలువ తన సర్వశక్తులూ ఒడ్డి మెలికలు తిరుగుతూ పోరాడింది. ఒకవైపు నిలబడటానికే వీల్లేని బావి అడుగుభాగంలో సమతుల్యత కాపాడుకోవడం, మరోవైపు ఎటునుంచి దాడి చేస్తుందో తెలియని భారీ సర్పం.. వెరసి క్షణక్షణం ఉత్కంఠ రేపింది.
ప్రాణాల మీద ఆశ వదలకుండా ఆ యువకుడు ప్రదర్శించిన అసమాన ధైర్యం, సహనంతో కొండచిలువను సురక్షితంగా బావి నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఈ దృశ్యాలను అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ప్రాణాలకు తెగించి ఓ మూగజీవాన్ని కాపాడిన ఆ యువకుడి అద్భుతమైన ధైర్యసాహసాలను చూసి నెటిజన్లు ఫిదా అవుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
వీడియో చూడండి..भाई को अपनी जान जोखिम मैं नहीं डालनी चाहिए थी pic.twitter.com/OM23gCiF02
— Vijay Singh (@vstechsolution) September 16, 2026
కుంభ రాశి : కుంభ రాశి వారు సెప్టెంబర్ చివరి రోజుల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. లేకపోతే అనేక ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. అందువలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. పనులు ఆలస్యంగా పూర్తి అవుతాయి
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి బంధువుల నుంచి సమస్యలు ఎదురు అవుతాయ. అందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. కోర్టు వ్యవహారాలు వ్యతిరేకంగా వస్తాయి. అంతే కాకుండా విద్యార్థులు కూడా కష్టానికి తగిన ఫలితాలను అందుకోవడంలో వెనకబడే ఛాన్స్ ఉంది.
తుల రాశి : తుల రాశి వారికి ఆదాయం డబుల్ అవుతుంది. కానీ ఖర్చులు వీరికి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తాయి. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వారికి ఈ సారి కూడా నిరాశే ఎదురు అవుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది ఖర్చులను పెంచడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా నష్టపోయేలా చేస్తుంది. అందువలన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
సింహ రాశి : సింహ రాశి వారికి ఇది చాలా కష్టాల సమయం. మీరు ఎంత నిశ్శబ్దం వహిస్తే మీకు అది అంత మేలు చేస్తుంది. అందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాటతీరే మిమ్మల్ని అనుకోని సమస్యల్లోకి నెట్టి వేస్తుంది. మనస్పర్థలు వచ్చే ఛాన్స్ ఉంది. బంధాన్ని కాపాడుకోవాలి అంటే చాలా వరకు నిశ్శబ్దమే మీకు మేలు చేస్తుంది.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు
Hardik Pandya: భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గత కొద్ది నెలలుగా టీమిండియాకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ మీద ఒక అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత పెద్దగా పోటీ క్రికెట్ ఆడದ హార్దిక్, త్వరలో జరగబోయే ఇండియా ‘ఎ’ వర్సెస్ ఆస్ట్రేలియా ‘ఎ’ వన్డే సిరీస్ ద్వారా మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సిరీస్‌లో హార్దిక్ ప్రదర్శనే అతని భవిష్యత్తును నిర్ణయిస్తుందని కోచ్ స్పష్టం చేశారు.
ఫిట్నెస్ నిరూపించుకుంటేనే ఛాన్స్
ఆఫ్ఘానిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో గెలుచుకున్న అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం పూర్తిస్థాయిలో 10 ఓవర్లు బౌలింగ్ చేసే ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉందని తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్లోకి తొందరపడి తీసుకొచ్చి అతనిపై భారం మోపాలని కోచింగ్ సిబ్బంది భావించడం లేదని, ముందుగా దేశవాళీ లేదా ‘ఎ’ టీమ్ మ్యాచ్‌లలో సత్తా చాటాలని స్పష్టం చేశారు.
ఇండియా ‘ఎ’ సిరీస్‌పైనే అందరి చూపు
అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్న ఇండియా ‘ఎ’ – ఆస్ట్రేలియా ‘ఎ’ వన్డే సిరీస్ కోసం హార్దిక్ ఎంపికయ్యాడు. ఈ సిరీస్ అక్టోబర్ 11తో ముగియనుంది. ఒకవేళ హార్దిక్ కనుక ఈ మ్యాచ్‌లలో అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిస్తే, ఆ వెంటనే అక్టోబర్ 22 నుంచి ప్రారంభమయ్యే న్యూజిలాండ్ పర్యటనకు భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. గాయం కారణంగా వెస్టిండీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు అతను దూరమైనప్పటికీ, త్వరలోనే రీఎంట్రీ ఖాయమని తెలుస్తోంది.
జట్టు బ్యాలెన్సింగ్ కోసం హార్దిక్ అవసరం
దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న మెగా టోర్నీలను దృష్టిలో ఉంచుకుని, పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ పాత్ర ఎంతో కీలకమని గంభీర్ అభిప్రాయపడ్డారు. నితీష్ కుమార్ రెడ్డితో పాటు హార్దిక్ పాండ్యా కూడా జట్టులో ఉంటే టీమిండియా మరింత పటిష్టంగా మారుతుందని, తద్వారా జట్టుకు అదనపు బలం చేకూరుతుందని కోచ్ ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. విటమిన్ ఎ, బీటా కెరోటిన్, పొటాషియం, పీచు పదార్థాలతో నిండిన ఈ అద్భుతమైన కూరగాయ కంటి చూపు మెరుగుపడటానికే కాక రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే సీజన్‌ను బట్టి మనం తినే ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని ఆయుర్వేదం, ఆధునిక వైద్య శాస్త్రం రెండూ చెబుతాయి. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు.. కూరగాయలు, ఆకుకూరలు తీసుకునే విషయంలో రెట్టింపు జాగ్రత్తలు అవసరం. ఏడాది పొడవునా పచ్చి క్యారెట్లను నమిలి తినే అలవాటు ఉన్నవారు.. ఈ వానాకాలంలో మాత్రం కాస్త ఆలోచించాల్సిందేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వానాకాలంలో పచ్చి క్యారెట్లు ఎందుకు ప్రమాదకరం?క్యారెట్ నేల లోపల పండే దుంప జాతి కూరగాయ. వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతం విపరీతంగా పెరిగిపోవడం వల్ల నేలలో బ్యాక్టీరియా, ఫంగస్, పరాన్నజీవులు అత్యంత వేగంగా వృద్ధి చెందుతాయి.
నులిపురుగులు, బ్యాక్టీరియా ముప్పు: వానాకాలపు మురుగు లేదా కలుషిత నీటి ప్రభావం వల్ల క్యారెట్ పై పొరల్లో ఈ కోలి వంటి బ్యాక్టీరియాలు, నులిపురుగుల సూక్ష్మ గుడ్లు చేరే అవకాశం చాలా ఎక్కువ. కంటికి కనిపించని ఈ క్రిములు పచ్చి క్యారెట్లను తిన్నప్పుడు నేరుగా కడుపులోకి చేరి తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి.
కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్: సరిగ్గా శుభ్రం చేయని పచ్చి క్యారెట్ల వల్ల విరేచనాలు, వాంతులు, కడుపులో నులిపురుగుల సమస్య, తీవ్రమైన అజీర్తి తలెత్తుతాయి.
మందగించే జీర్ణశక్తి: వర్షాకాలంలో సహజంగానే మన శరీర జీవక్రియ, జీర్ణవ్యవస్థ కాస్త నెమ్మదిస్తాయి. పచ్చి క్యారెట్లో పీచు పదార్థం గట్టిగా ఉండటం వల్ల, బలహీనపడిన జీర్ణవ్యవస్థ దాన్ని సులభంగా జీర్ణం చేసుకోలేదు. ఫలితంగా కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలు పెరుగుతాయి.
ఉడికించిన క్యారెట్లే ఎందుకు బెస్ట్?వర్షాకాలంలో క్యారెట్లను పచ్చిగా తినడం కంటే తేలికపాటి ఆవిరి మీద ఉడికించిలేదా సూప్‌లు, కూరల్లో వేసి తీసుకోవడమే అత్యంత సురక్షితమైన పద్ధతి.
క్రిములు నాశనమవుతాయి: వేడి నీటిలో ఉడకబెట్టడం వల్ల క్యారెట్లపై ఉండే హానికరమైన బ్యాక్టీరియా, క్రిముల గుడ్లు పూర్తిగా నశిస్తాయి.
బీటా-కెరోటిన్ శోషణ పెరుగుతుంది: క్యారెట్లను ఉడకబెట్టినప్పుడు వాటి కణజాలం మెత్తబడి, శరీరానికి విటమిన్-ఎ అందించే బీటా-కెరోటిన్ ను మన శరీరం మరింత వేగంగా, సమర్థవంతంగా గ్రహిస్తుంది.
సులభంగా జీర్ణమవుతాయి: ఉడికించిన క్యారెట్లు మృదువుగా మారి జీర్ణాశయంపై భారం పడకుండా త్వరగా అరిగిపోతాయి. పిల్లలు, వృద్ధులు, జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది చాలా మంచిది.
షుగర్ లెవల్స్‌కు మేలు: ఉడకబెట్టడం ద్వారా క్యారెట్లలోని సహజ చక్కెరల తీవ్రత కాస్త తగ్గి, డయాబెటిస్ ఉన్నవారికి కూడా మరింత అనువుగా మారుతుంది.
వర్షాకాలంలో పాటించాల్సిన కీలక జాగ్రత్తలువేడి ఉప్పు నీటితో శుభ్రం: ఒకవేళ సలాడ్లలో పచ్చి క్యారెట్లను తినాలనుకుంటే, ముందుగా గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు లేదా వెనిగర్ వేసి క్యారెట్లను కనీసం 10 నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడగాలి.
తొక్క పూర్తిగా తీసేయాలి: క్యారెట్ పైపొరను తప్పనిసరిగా పూర్తిగా చెక్కేయాలి. కడిగిన వెంటనే కాకుండా తడి ఆరిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి.
అధిక వేడి మీద వేపొద్దు: క్యారెట్లను వండేటప్పుడు ఎక్కువ నూనె, మసాలాలు వేసి అధిక మంటపై డీప్ ఫ్రై చేయకూడదు. తక్కువ మంటపై ఆవిరి మీద లేదా సాంబారు, పులుసుల్లో వేసి ఉడికిస్తే అందులోని పోషకాలు చెక్కుచెదరకుండా ఉంటాయి.
వానాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే క్యారెట్లను దూరం పెట్టాల్సిన అవసరం లేదు. తినే పద్ధతిని మార్చుకుంటే చాలు. పచ్చిగా తిని కడుపు సమస్యలు తెచ్చుకోవడం కంటే.. చక్కగా ఉడికించి, సూప్‌ల రూపంలో లేదా వేడివేడి వంటకాల్లో చేర్చుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడం మేలు.
SBI Credit Card Limit Check: క్రెడిట్ కార్డులు మనం మన ఆర్థిక వ్యవహారాలను నిర్వహించే విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. కొనుగోళ్లు చేయడానికి, మీ బిల్లులు చెల్లించడానికి, ఆర్థిక అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి కూడా క్రెడిట్ కార్డ్ ఒక సౌకర్యవంతమైన, సురక్షితమైన మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఈ క్రెడిట్ కార్డులు రివార్డ్ పాయింట్లు, ప్రత్యేక ఆఫర్లు, మరెన్నో ప్రయోజనాలతో కూడా వస్తాయి. ఇటువంటి క్రెడిట్ కార్డులను అందించే బ్యాంకులలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఒకటి. ఇది మీ విభిన్న అవసరాలకు అనుగుణంగా రకరకాల క్రెడిట్ కార్డులను అందిస్తుంది. అయితే మీ ఖర్చులను నిర్వహించుకోవడానికి, ఓవర్-లిమిట్ ఫీజులను నివారించడానికి మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పరిమితిని ఎలా తనిఖీ చేయాలో సులభంగా తెలుసుకోండి. ఈ బ్లాగ్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పరిమితిని తనిఖీ చేయడానికి గల 10 విభిన్న మార్గాల గురించి తెలుసుకుందాం.
SBI క్రెడిట్ కార్డ్ పరిమితిని ఎలా తనిఖీ చేయాలి?- ముందుగా ఎస్బీఐ చాట్‌బాట్ వెబ్‌సైట్‌కు వెళ్లండి – https://ila.sbicard.com/
- మీ యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ILA లోకి లాగిన్ అవ్వండి.
- ఇప్పుడు మీకు అవసరమైన సమాచారం, అంటే మీ అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితి, నగదు పరిమితి, చెల్లించాల్సిన బకాయిలు మొదలైన వాటి గురించి ILAని అడగండి. పూర్తి వివరాలు వస్తాయి.
- https://www.sbicard.com/ కు వెళ్ళండి .
- మీ మొబైల్ నంబర్, యూజర్ ఐడి లేదా కార్డ్ వివరాలను జోడించి మీ ఎస్బీఐ కార్డ్ ఖాతాలోకి లాగిన్ అవ్వండి.
- ఇప్పుడు మీ అందుబాటులో ఉన్న క్రెడిట్, నగదు పరిమితిని చూడటానికి మీ Account Summary విభాగాన్ని తనిఖీ చేయండి.
- SBI కార్డ్ మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి.
- మీ ఆధారాలతో SBI కార్డ్ మొబైల్ యాప్‌లోకి లాగిన్ అవ్వండి.
- మీరు లాగిన్ అయిన తర్వాత, మీ SBI క్రెడిట్ కార్డ్‌పై అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితి, నగదు పరిమితిని చూడటానికి Summary ట్యాబ్ కింద తనిఖీ చేయండి.
- మీ SBI క్రెడిట్ కార్డ్ పరిమితిని తనిఖీ చేయడానికి సులభమైన మార్గం కావాలంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 8422845513 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి.
- మీరు నమోదు చేసుకున్న మొబైల్ నంబర్‌కు, మీకు అందుబాటులో ఉన్న క్రెడిట్, నగదు పరిమితికి సంబంధించిన తాజా సమాచారంతో కూడిన SMS తక్షణమే వస్తుంది.
- మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పరిమితిని తెలుసుకోవడానికి మరో సులభమైన మార్గం ఉంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 5676791 నంబర్‌కు BAL అని SMS పంపడం.
- మీకు అందుబాటులో ఉన్న క్రెడిట్, నగదు పరిమితి వివరాలను పొందడానికి మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 5676791 నంబర్‌కు AVAIL అని టెక్స్ట్ మెసేజ్ కూడా పంపవచ్చు.
- మీరు ఈ సందేశాలలో ఏదైనా పంపిన వెంటనే, మీ క్రెడిట్, నగదు పరిమితికి సంబంధించిన అన్ని వివరాలతో కూడిన SMS మీకు తక్షణమే వస్తుంది.
- 1860 180 1290 (టోల్-ఫ్రీ) లేదా 39 02 02 02 (స్థానిక STD కోడ్‌ను ప్రిఫిక్స్గా ఉపయోగించండి) వద్ద ఉన్న SBI హెల్ప్‌లైన్ నంబర్లలో దేనికైనా కాల్ చేయండి.
- కాల్ అందుకున్న తర్వాత, మీ ప్రాధాన్యత ప్రకారం సంభాషణ కోసం భాషను ఎంచుకోండి.
- ఇప్పుడు మీ క్రెడిట్ కార్డ్‌కు సంబంధించిన సమాచారం ఉన్న విభాగానికి వెళ్లడానికి ‘1’ నొక్కండి.
- తర్వాత మళ్లీ ‘1’ నొక్కి, మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అవసరమైన వివరాలను నమోదు చేయండి.
- ఆమోదం పొందిన తర్వాత మీరు మీ అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితి, నగదు పరిమితి, చెల్లించవలసిన మొత్తం మొదలైన మీ క్రెడిట్ కార్డ్ ఖాతాకు సంబంధించిన సమాచారాన్ని ఫోన్లో వినవచ్చు.
- మీ క్రెడిట్ పరిమితిని తెలుసుకోవడానికి ఉన్న సులభమైన మార్గాలలో మరొకటి మీకు ఇమెయిల్ ద్వారా వచ్చే నెలవారీ స్టేట్మెంట్ను డౌన్లోడ్ చేసుకోవడం.
- మీరు నమోదు చేసుకున్న ఇమెయిల్ ఐడికి లాగిన్ అయి మీ ఇమెయిల్‌లలో ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ కోసం వెతకండి.
- ఇప్పుడు అడిగిన విధంగా సురక్షితమైన పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి. అప్పుడు మీరు మీ ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ డిజిటల్ కాపీని పొందగలుగుతారు.
sbicard.com/emailలో మీ SBI క్రెడిట్ కార్డ్ వివరాలతో బ్యాంకుకు ఒక ఇమెయిల్ వ్రాసి, స్టేట్మెంట్ కోసం అభ్యర్థించండి. త్వరలో మీకు మీ ఇ-స్టేట్మెంట్ మెయిల్లో వస్తుంది.
- ఎస్బిఐ ఏటిఎమ్‌ను సందర్శించండి:
- దగ్గరలోని ఎస్బిఐ ఏటిఎమ్‌కు వెళ్లండి.
- మీ SBI క్రెడిట్ కార్డును ATM లో పెట్టండి.
- ‘క్రెడిట్ కార్డ్ ఖాతా నిల్వ’ పై క్లిక్ చేసి, మీ క్రెడిట్ కార్డ్ పిన్ను నమోదు చేయండి.
- మీకు అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితి మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- మీకు దగ్గరలో ఉన్న ఎస్బిఐ బ్రాంచ్‌కు వెళ్లండి.
- అక్కడ ఉన్న అధికారిని సంప్రదించి, మీ క్రెడిట్ కార్డ్ వివరాలను అడగండి.
- మీ ప్రస్తుత క్రెడిట్ పరిమితిని తెలుసుకోవడానికి మీరు మీ క్రెడిట్ కార్డ్ నంబర్, పుట్టిన తేదీ మొదలైన వివరాలను అందించాల్సి ఉంటుంది.
- మీరు అలా చేసిన తర్వాత అధికారి మీ క్రెడిట్, నగదు పరిమితికి సంబంధించిన వివరాలను మీతో పంచుకుంటారు.
ఇది కూడా చదవండి: Business Ideas: కేవలం రూ.5 వేలతో మీ జీవితాన్ని మార్చే బిజినెస్ గురించి మీకు తెలుసా?
ఇది కూడా చదవండి: బంగారం ధరలు పెరిగినా తక్కువ ధరల్లో జ్యువెలరీస్ కొనడం ఎలాగో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Vaibhav Sooryavanshi: భారత్-ఆఫ్ఘానిస్తాన్ మధ్య ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం దక్కలేదు. తుది జట్టులో అతనికి చోటు లభించకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. దీనిపై తాజాగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ ఓ సంచలన ప్రకటన చేశారు. వైభవ్ భవిష్యత్తు, అతనికి జట్టులో ఎందుకు అవకాశం దక్కడం లేదనే విషయాలపై స్పష్టతనిచ్చారు.
ఆఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోనూ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకున్న సంజూ.. వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో 10, 57, 50 పరుగులతో రాణించి రెండు హాఫ్ సెంచరీలు బాదాడు. గత రెండు-మూడేళ్లుగా నిలకడగా రాణిస్తున్న సీనియర్ ఆటగాడికి ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఉంటుందని, అందుకే వైభవ్ తన అవకాశం కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
మూడో టీ20 ముగిసిన అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీతో మేమంతా చాలా స్పష్టంగా మాట్లాడామని తెలిపారు. “వైభవ్ ఎంతటి అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆటగాడో మా అందరికీ తెలుసు. భవిష్యత్తులో అతను పెద్ద మ్యాచ్ విన్నర్ అవుతాడు. అయితే నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లకే జట్టులో ప్రాధాన్యం దక్కుతుంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు అవకాశం కోసం ఓపికగా ఎదురుచూడాల్సిందే” అని గంభీర్ తేల్చిచెప్పారు.
తన చిన్న కెరీర్లో ఇప్పటివరకు 6 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ 193 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధశతకాలు ఉండగా, అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 81 పరుగులుగా ఉంది. కోచ్ గంభీర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే, ప్రస్తుతానికి జట్టులో ఉన్న కాంపిటీషన్ కారణంగా వైభవ్ తన అరంగేట్రం లేదా తుది జట్టులో స్థానం కోసం కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదని స్పష్టమవుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నిజామాబాద్, సెప్టెంబర్ 18: నిజామాబాద్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిజర్వ్ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ)గా విధులు నిర్వహిస్తున్న సతీశ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. విధుల్లో భాగంగా ఉన్న సమయంలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో నిజామాబాద్ పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. ఆర్ఐ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆర్ఐ సతీశ్ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రాథమికంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు, ఆర్ఐ వ్యక్తిగత పరిస్థితులు, ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ఓటీటీలలో కొత్త కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. వెబ్ సిరీస్, సినిమాలు చాలా వరకు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సిరీస్ మాత్రం దాదాపు ఆరు సంవత్సరాలుగా ట్రెండ్ అవుతుంది. ఈ సిరీస్ కంటెంట్, ట్విస్టులు, సీన్స్ ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందాయి. అంటే జనాలకు పూర్తిస్థాయి వినోదాన్ని అందించే సిరీస్ అని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న సిరీస్ పేరు ఏంటీ అనే వివరాలు ఇప్పుడు తెలుసుకోవాల్సిందే.
ఇది కేవలం కామెడీ సిరీస్ మాత్రమే. ఎలాంటి సస్పెన్స్ గానీ, హింస గానీ లేకపోవడమే ఈ సిరీస్ విజయానికి ప్రధాన బలం. ఇప్పటివరకు మొత్తం నాలుగు సీజన్స్ రాగా.. అందులో దాదాపు 32 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతీ సీజన్ సూపర్ హిట్ అయ్యింది. అలాగే ఇందులో స్టార్ నటీనటులు ఎవరూ లేరు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా నెంబర్ వన్ వెబ్ సిరీస్ గా మారింది. ఇంతకీ ఆ సిరీస్ ఏంటీ అని ఆలోచిస్తున్నారా.. ? అదేనండి.. పంచాయత్.
పంచాయత్ వెబ్ సిరీస్ లో జితేంద్ర కుమార్, రఘుబీర్ యాదవ్, నీనా గుప్తా వంటి నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. గత ఆరు సంవత్సరాలుగా ఈ సిరీస్ ప్రేక్షకులను అలరిస్తుండగా.. ఎక్కడా కూడా జనాలకు బోర్ కొట్టించదు. ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ 2020లో విడుదల కాగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సీజన్ 2ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు మేకర్స్.
ఇక రెండు సంవత్సరాల్లోనే 2022లో ఈ సిరీస్ రెండవ సీజన్ రిలీజ్ చేశారు. అలాగే 2024లో మూడవ సీజన్, 2025లో నాల్గవ సీజన్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రతి సీజన్ లో దాదాపు ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇక ఈ సిరీస్ సీజన్ 5 సైతం త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఈ సీజన్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
సీజన్ 5 విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. కానీ ఇందులో ఫులేరా గ్రామానికి సంబంధించిన ఉత్కంఠభరితమైన కథ ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీజన్ 5 కోసం జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎలాంటి యాక్షన్ సీన్స్, గ్లామర్ సాంగ్స్ లేకుండా విడుదలైన ఈ చిన్నపాటి సిరీస్ తక్కువ సమయంలోనే జనాలకు దగ్గరైంది.
Lord Ganesha’s Original Head Story Telugu: గణేశుడిని హిందూ సంప్రదాయంలో ప్రథమ పూజ్యుడిగా, విఘ్నాలను తొలగించే దేవుడిగా ఆరాధిస్తారు. ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా ముందుగా గణపతిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. గణేశుడి జననం, ఏనుగు తల పొందడం వెనుక ఉన్న పురాణగాథ కూడా అందరికీ తెలిసిందే. పురాణ కథనం ప్రకారం.. పార్వతీదేవి తన శరీరానికి రాసుకున్న పసుపు పిండితో గణేశుడిని సృష్టించి, తనకు కాపలాగా ద్వారం వద్ద నిలబడమని ఆదేశించింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన శివుడిని గణేశుడు అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహానికి గురైన శివుడు గణేశుడి తలను తన త్రిశూలంతో నరికేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి తీవ్ర ఆవేదనకు గురై, గణేశుడిని తిరిగి బ్రతికించాలని శివుడిని కోరింది. దీంతో శివుడు ఏనుగు తలను గణేశుడి శరీరానికి అమర్చి ప్రాణం పోశాడని, అనంతరం గణేశుడికి ప్రథమ పూజ అందుకునే వరాన్ని ప్రసాదించాడని విశ్వాసం.
అయితే.. ఈ కథకు సంబంధించిన మరో ఆసక్తికరమైన నమ్మకం ఉత్తరాఖండ్‌లోని పాతాళ భువనేశ్వర్ గుహతో ముడిపడి ఉంది. గణేశుడి అసలు మానవ తల అక్కడే ఉందని ఒక మతపరమైన విశ్వాసం ఉంది. ఇంతకీ ఈ నమ్మకం వెనుక కథ ఏమిటి?
పాతాళ భువనేశ్వర్ గుహలో గణేశుడి తల ఉందా?ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్ జిల్లాలో గంగోలిహాట్ సమీపంలో ఉన్న పాతాళ భువనేశ్వర్ గుహ అనేక సహజ శిలా నిర్మాణాలు, పురాణ విశ్వాసాలతో ప్రసిద్ధి చెందింది. స్థానిక మత సంప్రదాయం ప్రకారం, శివుడు ఖండించిన గణేశుడి మానవ శిరస్సు ఈ గుహలోనే ఉందని నమ్ముతారు. గుహలోని ఒక సహజ శిలను ‘ఆది గణేశ’గా భావించి భక్తులు పూజలు నిర్వహిస్తారు. అదే గణేశుడి అసలు తలకు ప్రతీక అని విశ్వసిస్తారు. అయితే ఈ వాదన మతపరమైన విశ్వాసం, స్థానిక సంప్రదాయాలపై ఆధారపడిందే తప్ప దీనిని నిర్ధారించే చారిత్రక లేదా శాస్త్రీయ ఆధారాలు లేవు.
శిలా రూపంలో ‘ఆది గణేశుడు’పాతాళ భువనేశ్వర్ గుహలో కనిపించే సహజ శిలా నిర్మాణాల్లో ఒకదాన్ని భక్తులు ఆది గణేశుడి రూపంగా భావిస్తారు. గణేశుడి అసలు మానవ శిరస్సు అక్కడే ఉందనే విశ్వాసంతో దీనికి ప్రత్యేక పూజా ప్రాధాన్యత ఏర్పడింది. గుహలోని సహజ రాతి ఆకారాలను వివిధ దేవతలు, పురాణ పాత్రలతో అనుసంధానించడం కూడా ఇక్కడి మత సంప్రదాయంలో భాగంగా కనిపిస్తుంది.
ఆది గణేశుడిపై పడే నీటి బిందువులుఆది గణేశ శిలకు పైన సహజంగా ఏర్పడిన ఒక శిలా నిర్మాణం ఉంది. దాని నుంచి నీటి బిందువులు కిందకు జారుతూ ఆది గణేశుడి తలపై పడుతుంటాయని భక్తులు చెబుతారు. ఈ సహజ ప్రక్రియకు స్థానిక భక్తులు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యతను ఆపాదిస్తారు. దీనిని దైవ
అనుగ్రహానికి ప్రతీకగా భావించే సంప్రదాయం కూడా ఉంది.
పాతాళ భువనేశ్వర్‌కు సంబంధించిన మరో ప్రచారంలో, గణేశుడి అసలు తల లేదా దాని ప్రతీకను స్వయంగా శివుడే రక్షిస్తున్నాడని చెబుతారు. ఈ నమ్మకం కారణంగా గుహను గణేశుడు, శివుడితో అనుబంధం ఉన్న అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భక్తులు భావిస్తారు. అయితే, శివుడు గణేశుడి తలను ఇక్కడే కాపాడుతున్నాడనే విషయానికి కూడా ఆధారాలు లేవు. ఇది స్థానిక పురాణాలు, మత విశ్వాసాలు, జానపద సంప్రదాయాల్లో కనిపించే కథనంగా చూడాలి.
పాతాళ భువనేశ్వర్ గుహను ఆది శంకరాచార్యులు కనుగొన్నారా?మత సంప్రదాయం ప్రకారం, కలియుగంలో ఆది శంకరాచార్యులు పాతాళ భువనేశ్వర్ గుహను కనుగొన్నారని విశ్వసిస్తారు. గుహలోని అనేక సహజ శిలా నిర్మాణాలను వివిధ దేవతా స్వరూపాలతో అనుసంధానిస్తూ పూజలు నిర్వహించే సంప్రదాయం కొనసాగుతోంది. గుహలోని ఆది గణేశుడి శిలకు సంబంధించిన విశ్వాసం కూడా ఈ పురాతన మత సంప్రదాయంలో ఒక భాగంగా చెప్పబడుతుంది.
పాతాళ భువనేశ్వర్‌కు ఎందుకంత ప్రాధాన్యత?పాతాళ భువనేశ్వర్ కేవలం సహజ గుహగా మాత్రమే కాకుండా, పురాణాలు, జానపద కథలు, ఆధ్యాత్మిక విశ్వాసాలతో ముడిపడిన పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. గుహలోని సహజ శిలా నిర్మాణాలను దేవతా స్వరూపాలుగా భావించి భక్తులు దర్శించుకుంటారు. ముఖ్యంగా గణేశుడి అసలు మానవ తల ఇక్కడే ఉందనే విశ్వాసం ఈ గుహకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. అయితే ఈ కథనాలను మత విశ్వాసాలు, పురాణ సంప్రదాయాల పరిధిలోనే చూడాలి. గణేశుడి మానవ శిరస్సు నిజంగా ఈ గుహలో ఉందని నిర్ధారించే చారిత్రక లేదా శాస్త్రీయ ఆధారాలు ప్రస్తుతం లేవు.
(Disclaimer: పాతాళ భువనేశ్వర్, ఆది గణేశుడికి సంబంధించిన విషయాలు పురాణాలు, స్థానిక మత విశ్వాసాలు, జానపద సంప్రదాయాల ఆధారంగా ప్రచారంలో ఉన్నాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని భావించకూడదు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ ఫారెస్ట్ సబ్ ఆర్డినేట్ సర్వీస్‌లో 23 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అక్టోబర్ 16, 2026 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకంలో స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు. సింగిల్ లెవెల్ కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షతో పాటు వాకింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 23 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) పోస్టులను భర్తీ చేయనున్నారు.
అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు పోస్టుకు నిర్దేశించిన శారీరక అర్హతలను కూడా కలిగి ఉండాలి. ఎంపిక ప్రక్రియలో వాకింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉండటంతో అభ్యర్థులు సంబంధిత ఫిజికల్ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో నవంబర్ 5, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు సింగిల్ లెవెల్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) నిర్వహిస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు. ఎంపికైన అభ్యర్థులకు రూ.25,220 నుంచి రూ.80,910 వరకు నెలవారీ వేతనం లభిస్తుంది. ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈ పోస్టులు ఉపయోగకరమైన అవకాశం. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు వయోపరిమితి, ఫిజికల్ స్టాండర్డ్స్, వాకింగ్ టెస్ట్ నిబంధనలు, దరఖాస్తు రుసుము, సిలబస్ తదితర పూర్తి వివరాలను అధికారిక APPSC నోటిఫికేషన్లో తప్పనిసరిగా పరిశీలించాల్సి ఉంటుంది.
రాత పరీక్ష విధానం..రాత పరీక్షలో మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ 100 ప్రశ్నలు, 100 మార్కులకు ఉంటుంది. పేపర్ 2లో జనరల్ సైన్స్, జనరల్ మ్యాథమెటిక్స్ (SSC స్థాయి) నుంచి 100 ప్రశ్నలు, 100 మార్కులకు ఉంటుంది. అదనంగా ఇంగ్లిష్, తెలుగు లేదా ఉర్దూలో వ్యాస రచనకు క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది. దీనికి 45 నిమిషాల వ్యవధిలో 50 మార్కులు కేటాయించారు. రాత పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు చొప్పున కోత విధిస్తారు. కాబట్టి అభ్యర్థులు సమాధానాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పండుగలు, శుభకార్యాలు, పూజలు ఏవైనా సరే.. బంతి పువ్వులు లేనిదే అలంకరణ పూర్తికాదు. గుమ్మాలకు కట్టే తోరణాల నుంచి దేవుడి పటాల వరకు బంతి పువ్వుల పసుపు, నారింజ రంగులు ఇంటికే సరికొత్త శోభను తెచ్చిపెడతాయి. అందుకే చాలామంది తమ ఇళ్లలో, బాల్కనీలలో బంతి మొక్కలను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. అయితే ఎంతో ఆశగా నాటిన మొక్కకు సరిగ్గా పూలు పూయకపోవడం, పూసినా చిన్నగా ఉండటం చాలామందిని నిరాశకు గురిచేస్తుంది. సరైన పోషణ, కొన్ని సహజసిద్ధమైన ఎరువులతో పాటు చిన్నపాటి మెలకువలు పాటిస్తే బంతి మొక్కలు గుత్తులు గుత్తులుగా పూలు పూసేలా చేయవచ్చు.
సహజసిద్ధమైన పోషణ: బంతి మొక్కకు బలాన్నిచ్చే ఎరువులుఆవపిండి ద్రావణం : మొక్కలకు ఆవపిండి అద్భుతమైన సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. ఆవపిండి లేదా దాని పొడిని నీటిలో కొన్ని రోజుల పాటు నానబెట్టి, పులియబెట్టిన తర్వాత ఆ ద్రావణాన్ని పలుచగా చేసి వడకట్టాలి. ఈ ద్రావణాన్ని జాగ్రత్తగా మొక్కల మట్టికి అందిస్తే వేర్లు దృఢపడి మొగ్గలు బాగా వస్తాయి. అయితే ఈ గాఢ ద్రావణాన్ని నేరుగా వేర్ల మొదట్లో పోయకుండా పక్కగా అందించడం మంచిది.
వర్మీకంపోస్ట్‌తో దీర్ఘకాలిక పోషణ: బంతి మొక్కల కుండీల్లోని పైమట్టిని కొద్దిగా వదులు చేసి, బాగా తయారైన వర్మీకంపోస్ట్‌ను కలపాలి. ఇది నేల నాణ్యతను పెంచి, మొక్కకు అవసరమైన పోషకాలను నిరంతరం అందిస్తూ ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడుతుంది.
అరటి తొక్కల ద్రావణం: అరటి తొక్కలను నీటిలో నానబెట్టి తయారుచేసిన నీటిని మొక్కలకు పోయడం ద్వారా కొంతమేర పొటాషియం వంటి సూక్ష్మ పోషకాలు అందుతాయి. అయితే దీని ప్రభావం పరిమితంగానే ఉంటుంది కాబట్టి, ఇతర సేంద్రియ ఎరువులతో కలిపి సమతుల్యంగా వాడటం ఉత్తమం.
ఎక్కువ పూలు పూయాలంటే నివారించాల్సిన మూడు తప్పులువాడిపోయిన పువ్వులను మొక్కపైనే ఉంచడం: మొక్కపై ఎండిపోయిన, వాడిపోయిన పువ్వులు అలాగే ఉంటే అవి విత్తనాల తయారీపై దృష్టి పెట్టి, కొత్త మొగ్గలు రావడాన్ని అడ్డుకుంటాయి. కాబట్టి వాడిన పువ్వులను ఎప్పటికప్పుడు శుభ్రమైన కత్తెరతో కత్తిరించాలి. దీనివల్ల మొక్కకు కొత్త శాఖలు వచ్చి పూల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది.
ఎండ సరిగ్గా తగలకపోవడం: బంతి మొక్కలకు ప్రత్యక్ష సూర్యరశ్మి ప్రాణాధారం. కుండీలను నీడపట్టున ఉంచితే మొక్క ఆకులతో పచ్చగా ఏపుగా పెరుగుతుందే తప్ప మొగ్గలు వేయదు. రోజూ కనీసం కొన్ని గంటల పాటు పుష్కలంగా ఎండ తగిలే చోట కుండీలను ఉంచాలి.
అధిక నైట్రోజన్ వాడకం: కేవలం ఆకుల పచ్చదనం పెంచే నత్రజని శాతం ఎక్కువగా ఉండే ఎరువులను వాడితే మొక్క పువ్వుల కంటే ఆకుల మీదే ఎక్కువ శక్తిని కేంద్రీకరిస్తుంది. అందుకే పువ్వులు పూసే దశలో సమతుల్యమైన ఎరువులను మాత్రమే అందించాలి.
ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు.. రాబోయే పండుగల నాటికి మీ ఇంటి ప్రాంగణంలోని బంతి మొక్కలు పూలతో కళకళలాడుతూ ఇంటికి పండుగ శోభను తీసుకువస్తాయి.
పట్టణాల్లో నివసించే పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. పట్టణాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు రెడీ అవుతోంది. టిడ్కో టవర్లను జీ+8, జీ+10, జీ+12, జీ+14 విధానంలో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కొ ఫ్లాట్ 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పట్టణాలలో పేదలు ఉండే ప్రాంతాల్లోనే వీటిని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. పట్టణాలకు దూరంగా నిర్మించడం వల్ల పేదలు అక్కడికి వెళ్లి స్థిరపడాల్సి ఉంటుంది. అలాంటి ఇబ్బంది లేకుండా పట్టణాల్లోని భవన సముదాయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణాల్లో అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తిస్తారు. స్థలం బట్టి ఎన్ని అంతస్తులుగా నిర్మించాలనేది అధికారులు నిర్ణయిస్తారు. ఒక్కొ ఫ్లాట్ ధర రూ.15 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు ఉండనుంది.
ఇప్పటికే రాష్ట్రంలో టిడ్కో ఇళ్లను కొన్నిచోట్ల నిర్మించగా.. వీటిని 300,365,430 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. కానీ ఇప్పుడు ఒక్కొ ఫ్లాట్‌ను 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక స్థలంతో పాటు లబ్దిదారుల సంఖ్యను బట్టి ఎన్ని అంతస్తుల సముదాయం నిర్మించాలనేది నిర్ణయిస్తారు. ఇక ఈ అంతస్తులో లిఫ్ట్ సౌకర్యంతో పాటు పార్కింగ్ సౌకర్యం, షాపులు, అంగన్వాడీ కేంద్రాలు, బ్యాంకులు, కమర్షియల్ కాంప్లెక్స్ అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలోని అధికారులు వివిధ రాష్ట్రాల్లో నిర్మించిన టిడ్కో ఇళ్లను పరిశీలించారు. వాటికి అనుగుణంగా అన్ని సౌకర్యాలు ఉండేలా డిజైన్ రూపొందించారు. ఈ డిజైన్‌ను ప్రభుత్వం కూడా ఆమోదించడంతో టిడ్కో ఇళ్ల నిర్మాణంపై ముందడుగు పడింది.
2017లో జీ+3గా పద్దతిలో టిడ్కో ఇళ్లను నిర్మించారు. అప్పుడు ఒక్కొ ఫ్లాట్‌కు రూ.8.50 లక్షల ఖర్చు అయింది. కేంద్రం రూ.3 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.90 వేలు తన వాటాగా అందించగా.. మిగతా సొమ్ము లబ్దిదారులు భరించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. దీంతో విస్తీర్ణం, టవర్,ఫ్లోర్‌ను బట్టి ఎంత ఖర్చు అవుతుందనేది అధికారులు అంచనా వేస్తారు. అంతస్తులు పెరిగే కొద్ది వ్యయం తగ్గుతుంది. జీ+8 పద్దతిలో నిర్మిస్తే ఒక్కొ ఫ్లాటుకు రూ.17.51 లక్షలు, జీ+10 విధానంలో రూ.16.52 లక్షలు, జీ+12 విధానంలో ఒక్కొ ఫ్లాటుకు రూ.16.14 లక్షలు, జీ+14విధానంలో రూ.15.70 లక్షల వ్యయం కానుంది. కేంద్రం, రాష్ట్రం తన వాటాగా రూ.3 లక్షలు అందిస్తాయి. మిగతా నిధులను లబ్దిదారులను భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే 24 వేల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే సర్వే నిర్వహిస్తోంది. ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా వీటిని నిర్మించేందుకు సిద్దమవుతోంది.
క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ, జో రూట్ పేర్లు ఎప్పుడూ చర్చనీయాంశమే. బ్యాటింగ్‌లో వీరు సృష్టించిన రికార్డులపై నిత్యం పోలికలు వస్తూనే ఉంటాయి. అయితే తాజాగా టెస్ట్ కెప్టెన్సీ విషయంలోనూ ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య సరికొత్త పోలిక తెరపైకి వచ్చింది. పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో.. జో రూట్ టెస్టుల్లో సారథిగా తన 68వ మ్యాచ్‌ను పూర్తి చేసుకున్నాడు. విశేషమేమిటంటే.. 2022లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా సరిగ్గా 68 టెస్టులకే సారథ్యం వహించాడు. సమాన సంఖ్యలో మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన నేపథ్యంలో, టెస్ట్ సారథిగా వీరిలో ఎవరు బెస్ట్ అనే చర్చ క్రికెట్ వర్గాల్లో మొదలైంది.
గణాంకాల్లో కోహ్లీదే తిరుగులేని ఆధిపత్యంమ్యాచ్ల సంఖ్య ఒక్కటే అయినప్పటికీ, విజయాల శాతం పరంగా కోహ్లీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచాడు. 68 టెస్టుల్లో భారత్‌ను నడిపించిన విరాట్.. ఏకంగా 40 విజయాలు సాధించి, 17 ఓటములు, 11 డ్రాలతో 58.82శాతం విన్నింగ్ పర్సంటేజీని నమోదు చేశాడు. భారత టెస్ట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సారథిగా నిలిచాడు. మరోవైపు ఇంగ్లాండ్ కెప్టెన్‌గా 68 మ్యాచ్‌ల్లో రూట్ 30 విజయాలు, 27 ఓటములు, 11 డ్రాలతో 44.1శాతం గెలుపు శాతాన్ని కలిగి ఉన్నాడు. ముఖాముఖి పోరులో మాత్రం ఈ ఇద్దరు దిగ్గజాలు చెరో 6 విజయాలతో సమవుజ్జీలుగా నిలిచారు.
ఇంగ్లాండ్ రికార్డుల్లో జో రూట్ చరిత్రఅలిస్టర్ కుక్ తర్వాత 2017లో పగ్గాలు చేపట్టిన జో రూట్.. 2022 వరకు 64 టెస్టులకు సారథ్యం వహించి 27 విజయాలు అందించాడు. అనంతరం బెన్ స్టోక్స్ సస్పెన్షన్, రిటైర్మెంట్ పరిణామాలతో ఈ ఏడాది మళ్లీ శాశ్వత కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. తాజాగా సాధించిన విజయంతో మొత్తం 30 గెలుపులను ఖాతాలో వేసుకున్న రూట్.. మైకేల్ వాన్ (26 విజయాలు) రికార్డును అధిగమించి ఇంగ్లాండ్ తరఫున అత్యధిక టెస్టు విజయాలు అందించిన సారథిగా చరిత్ర సృష్టించాడు. కెప్టెన్సీ ఒత్తిడిలోనూ దాదాపు 47 సగటుతో పరుగులు రాబట్టడం అతనిలోని అద్భుత నిలకడకు నిదర్శనం.
టెస్ట్ క్రికెట్‌ను శాసించిన కోహ్లీ శకంమహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ తర్వాత 2014లో టెస్ట్ పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ.. భారత జట్టు రూపురేఖలనే మార్చేశాడు. స్వదేశంలో ఆడిన మొత్తం 11 టెస్ట్ సిరీస్‌లలోనూ భారత్‌ను అజేయంగా నిలిపాడు. అంతేకాకుండా 2018-19లో ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించిన తొలి ఆసియా కెప్టెన్‌గా రికార్డుకెక్కాడు. 2016 నుంచి 2021 వరకు వరుసగా ఐదేళ్లపాటు టీమిండియాను ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో నిలిపిన ఘనత కోహ్లీకే దక్కుతుంది. భారత్‌ను తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేర్చడంతో పాటు, సారథిగా అత్యధికంగా ఏడు డబుల్ సెంచరీలు బాదిన రికార్డునూ సొంతం చేసుకున్నాడు.
మొత్తంగా చూస్తే.. గణాంకాలు, విజయాల పరంగా కోహ్లీ రికార్డు తిరుగులేనిదిగా నిలిస్తే.. ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా జో రూట్ తనదైన ముద్ర వేశాడు. 2025లో కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలకడంతో అతని రికార్డులు అక్కడితో ఆగగా, ప్రస్తుతం మళ్లీ పగ్గాలు అందుకున్న జో రూట్‌కు టెస్టుల్లో తన విజయాల సంఖ్యను మరింత పెంచుకునే అవకాశం మిగిలి ఉంది.
తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని యవత్మాల్ జిల్లాలోని ముకుట్‌బన్, చంద్రపూర్ జిల్లాలోని గడ్చాందూర్.. ఇవి రెండు ముఖ్యమైన పారిశ్రామిక, మైనింగ్ కేంద్రాలు. ఇక్కడ చాలా వరకు సిమెంట్ ప్లాంట్లు, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు చెందిన బొగ్గు గనులు, సున్నపురాయి గనులు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో ఈ కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే.. పారిశ్రామిక ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ దొరకడంతో పాటు సరుకు రవాణాను కూడా ఈజీ అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న వార్ధా-మాణిక్‌గఢ్ సెక్షన్లో రద్దీ తగ్గడంతో పాటు ప్రజలకు రవాణా ఖర్చులతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు DPR ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత రోజుకు రెండు దిశల్లో రెండు మెము రైళ్లతో పాటు, ఏడాదికి 6.08 MTPA సరుకు రవాణా చేయవచ్చని అధికారులు అంచనా వేశారు. ఈ సరుకు రవాణాలో బొగ్గు, కోక్, సిమెంట్, స్పాంజ్ ఐరన్, మెటల్ స్క్రాప్, ఇనుము, ఉక్కు, ఎరువులు, ఆహార ధాన్యాలు తదితర ఉత్పత్తులు ఉంటాయని తెలిపారు.
ఈ కొత్త లైన్ బొగ్గు, సిమెంట్ క్లస్టర్లను నేరుగా మాజ్రి-నాందేడ్ మార్గంతో కనెక్ట్ చేయవచ్చని.. దీనివల్ల జాల్నా, పర్భానీ, ఛత్రపతి శంభాజీనగర్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలోని ఇతర ప్రాంతాలకు బొగ్గు, సిమెంట్, ఇతర ట్రాఫిక్ మరింత త్వరగా చేరుకోవడానికి వీలవుతుందని అధికారులు తెలిపారు.
అలాగే ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఎప్పుడూ రద్దీగా ఉండే బల్హార్షా-నాగ్‌పూర్ హై-డెన్సిటీ నెట్వర్క్ రూట్‌పై ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందని అధికారులు తెలిపారు. అలాగే యవత్మాల్, చంద్రపూర్ జిల్లాల్లోని తక్కువ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలకు రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని.. ఇది మెరుగైన రైల్వే మౌలిక సదుపాయాల ద్వారా ఈ ప్రాంత పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి ఇది తోడ్పడుతుందని తెలిపారు.
ఈ కొత్త రైల్వే లైన్ ప్రాంతీయ రైల్వే నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచుతుందని.. నిత్యావసర వస్తువుల రవాణాను సులభతరం చేయడంతో పాటు, పెరుగుతున్న సరుకు, ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి ఎంతగాగో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల పారిశ్రామిక, ప్రాంతీయ ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభించడంతో పాటు, ప్రస్తుతం ఉన్న రైల్వే నెట్‌వర్క్‌ను మరింత సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు.
Zero Balance Savings Account: బ్యాంక్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ (Minimum Balance) మైంటైన్ చేయలేదని ప్రతి నెలా మీ ఖాతా నుండి డబ్బులు కట్ అవుతున్నాయా? ఎటువంటి మినిమం బ్యాలెన్స్ అవసరం లేని, ఉచిత సదుపాయాలు ఇచ్చే బ్యాంక్ ఖాతా కోసం చూస్తున్నారా? అయితే భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) అందించే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతా మీకోసమే.
సామాన్య ప్రజలకు ఉచితంగా, అందుబాటు ధరల్లో బ్యాంకింగ్ సేవలను అందించాలనే లక్ష్యంతో ఆర్బీఐ ఈ BSBD ఖాతాలను అందుబాటులోకి తెచ్చింది.
ఇది కూడా చదవండి: Ration Card: రేషన్‌కార్డు ఉన్న వారికి బిగ్ షాక్.. వీరి రేషన్ నిలిపివేత..!
BSBD ఖాతాలోని ముఖ్య ప్రయోజనాలు:- మినిమం బ్యాలెన్స్ శూన్యం: ఈ ఖాతాలో రూపాయి కూడా ఉంచాల్సిన అవసరం లేదు (Zero Balance). దీనికి ఎలాంటి పెనాల్టీలు ఉండవు.
- డిపాజిట్లపై పరిమితి లేదు: ఈ ఖాతాలో ఒక నెలలో ఎన్నిసార్లైనా డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. గరిష్ట పరిమితి ఉండదు.
- ఉచిత ఏటీఎం/డెబిట్ కార్డ్: ఎటువంటి వార్షిక రుసుము లేకుండానే ఏటీఎం కార్డ్‌ను పొందవచ్చు.
- ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్: డిజిటల్ లావాదేవీల కోసం మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉచితంగా లభిస్తుంది.
- పాస్‌బుక్, చెక్‌బుక్: ఉచిత పాస్‌బుక్‌తో పాటు అవసరమైన వారికి ఉచిత చెక్‌బుక్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.
- నెలలో 4 ఉచిత విత్‌డ్రాయల్స్: నెలకు కనీసం 4 ఉచిత నగదు ఉపసంహరణల (Cash Withdrawals/ATM) సదుపాయం ఉంటుంది.
మీకు ఇప్పటికే ఏదైనా బ్యాంక్‌లో సాధారణ సేవింగ్స్ ఖాతా ఉంటే, దానిని కూడా సులభంగా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాగా మార్చుకునే అవకాశం ఉంది. దీని కోసం మీ బ్యాంక్ శాఖకు వెళ్ళి అభ్యర్థన దాఖలు చేస్తే సరిపోతుంది. అయితే, ఒకే బ్యాంక్‌లో ఒకే వ్యక్తికి సాధారణ సేవింగ్స్ ఖాతా BSBD ఖాతా రెండూ ఉండటానికి వీల్లేదు. BSBD ఖాతా ఓపెన్ చేసిన 30 రోజుల్లోగా పాత సాధారణ ఖాతాను మూసివేయాల్సి ఉంటుంది. దేశంలోని దాదాపు అన్ని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఈ సేవలను అందిస్తున్నాయి. మినిమం బ్యాలెన్స్ భయం లేకుండా బ్యాంకింగ్ సేవలు పొందాలనుకునే వారికి బీఎస్‌బీడీ అత్యుత్తమ ఎంపిక.
ఇది కూడా చదవండి: Business Ideas: కేవలం రూ.5 వేలతో మీ జీవితాన్ని మార్చే బిజినెస్ గురించి మీకు తెలుసా?
ఇది కూడా చదవండి: బంగారం ధరలు పెరిగినా తక్కువ ధరల్లో జ్యువెలరీస్ కొనడం ఎలాగో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్ (VDCA) మాజీ సంయుక్త కార్యదర్శి జీ టీ ప్రసాద్, తన భార్య రమాదేవితో కలిసి ఆస్ట్రేలియా వెళ్లారు. మనవడు, మనవరాలితో సమయం గడపడానికి దాంతో పాటే ఒక శుభకార్యంలో పాల్గొనేందుకు పయనమయ్యారు. కోడలు నేహ టయోటా కరోల్లా కారు నడుపుతుండగా.. వెనుక మరో కారులో ప్రసాద్ ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో జరిగిన ఈ ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బుధవారం రాత్రి 9:40 గంటల సమయంలో.. బోర్డ్‌వాక్ బౌలేవార్డ్, ఇన్నిస్‌ఫెయిల్ డ్రైవ్ కూడలి మలుపు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 60 కి.మీ. వేగ పరిమితి ఉన్న ఈ ప్రాంతంలో, ఒక పోర్షే మకాన్ కారు అత్యంత వేగంగా దూసుకొచ్చి.. నేహ నడుపుతున్న టయోటా కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు డ్రైవింగ్ చేస్తున్న నేహతో పాటు, పక్కనే కూర్చున్న రమాదేవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణమైన పోర్షే కారు డ్రైవర్ కు కూడా గాయాలవడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు.
విక్టోరియా పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం విశాఖపట్నంలోని ఆ కుటుంబంలో, బంధువుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది. మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు కావాల్సిన అధికారిక లాంఛనాలకు మెల్బోర్న్లోని తెలుగు సంఘాలు సహకరిస్తున్నాయి. రమాదేవి కుమారుడు, నేహ భర్త అయిన వరుణ్ చంద్ర గున్న.. తమ వారి భౌతిక కాయాలను భారతదేశానికి రప్పించేందుకు ‘గోఫండ్‌మీ’ (GoFundMe) ద్వారా విరాళాల సేకరణ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు.
సెప్టెంబర్ 16, 2026 న నేహ, రమాదేవి టయోటా కారులో ప్రయాణిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంతో తన ప్రపంచం ఒక్క క్షణం తలకిందులైందని వరుణ్ తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు. “ఒకే ఒక్క విపత్కర క్షణంలో నా జీవిత భాగస్వామిని, అమ్మను కోల్పోయాను” అని రాసుకొచ్చారు. తన 75 ఏళ్ల తండ్రి తులసి ప్రసాద్ జీవితాంతం తోడుగా ఉన్న భార్యను కోల్పోయారని, తమ ఇద్దరు పిల్లలు తల్లిని, అమ్మమ్మను కోల్పోయారని వరుణ్ తన దుఃఖాన్ని పంచుకున్నారు.
వరుణ్ తన భార్య నేహ గురించి చెప్తూ.. ఆమె తమ ఇంటికి “వెలుగు, ప్రాణం” అని కొనియాడారు. తను దయాగుణం ఉన్న వ్యక్తి అని, ఉత్సాహంతో ఉరకలేస్తూ ఉంటుందని, డాన్స్ అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. ఇటీవల స్థానిక కమ్యూనిటీతో కలిసి తమ కుమార్తె విదాన్వి తొలి పుట్టినరోజు వేడుకను తన భార్య ఎంతో ఆనందంగా జరుపుకుందని గుర్తుచేసుకున్నారు. ఇద్దరు పిల్లలను సింగిల్ పేరంట్ గా పెంచే పెద్ద సవాలు ఇప్పుడు తన ముందు ఉందని వరుణ్ తెలిపారు. ఈ ఆర్థిక భారాన్ని తాను ఒక్కడే మోయలేనని పేర్కొంటూ.. ఈ క్లిష్ట సమయంలో తనకు సహాయం చేయాల్సిందిగా కమ్యూనిటీని, స్నేహితులను, దాతలను ఆయన అభ్యర్థించారు.
నేహ, రమాదేవి భౌతిక కాయాలను భారతదేశానికి తరలించడానికి అయ్యే రవాణా ఖర్చుల కోసం గోఫండ్ మీ నిధులను ఉపయోగిస్తారు. దీనివల్ల కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య భారత్‌లో హిందూ సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించడానికి వీలవుతుంది. అలాగే ఈ విరాళాల ద్వారా అత్యవసర ప్రయాణం, కాన్సులేట్ పత్రాల ఖర్చులు, వరుణ్ అతని 75 ఏళ్ల తండ్రికి సంబంధించిన ఖర్చులు, పిల్లలు హారవ్, విదాన్విల అవసరాలకు ఆర్థిక భరోసా అందుతుందని భావిస్తున్నారు.
విశాఖపట్నం నగరంలోని సీతమ్మధార ఎన్ఈ లేఅవుట్లో నివాసం ఉంటున్న షిప్‌యార్డు రిటైర్డ్ ఉద్యోగి ప్రసాద్.. విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్‌కు మాజీ సంయుక్త కార్యదర్శిగా, కోశాధికారిగా కూడా సేవలందించారు. ప్రస్తుతం ఆయన రోడ్డు ప్రమాదంలో తన భార్య, కోడలిని కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన కళ్లెదుటే ఆయన భార్య రమాదేవి, కోడలు బొమ్మలి నేహ మృతి చెందారు. ఆస్ట్రేలియా నుంచి మృతదేహాలు విశాఖకు చేరుకోవడానికి సుమారు పది రోజులు పట్టే అవకాశం ఉందని బంధువులు తెలిపారు.
పూణె, సెప్టెంబర్ 18: మహారాష్ట్రలో గణేశోత్సవ వేడుకలు యేటా ఎంత ఘనంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏడాది గణేశుడి విగ్రహాల్లో ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఈసారి పూణెలో ఏర్పాటు చేసిన ఓ గణేశుడి విగ్రహం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏకంగా 21 వేల పానీపూరీలతో 13 అడుగుల ఎత్తైన గణేశుడి విగ్రహాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఈ వినూత్న బప్పా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పుణెలోని ఫెర్గూసన్ కాలేజ్ (FC) రోడ్డులో ఉన్న గణేశ్ భేల్ వద్ద ఈ ప్రత్యేక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని తయారు చేసేందుకు ఉపయోగించిన ప్రతి పానీపూరీని జాగ్రత్తగా అమర్చి భారీ గణేశుడి రూపాన్ని తీసుకొచ్చారు.
రెండు నెలల పాటు శ్రమ.. 21 వేల పానీపూరీలతో బప్పాగణేశోత్సవం సందర్భంగా ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచనతో గణేశ్ భేల్ నిర్వాహకులు రూపేష్, దినేష్ గుడ్మేవర్ ఈ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. కళాకారుడు ప్రశాంత్ సాలుంఖే ఆధ్వర్యంలో విగ్రహాన్ని రూపొందించారు. ఈ గణేశుడి విగ్రహం సుమారు 13 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పు ఉంటుంది. దీన్ని తయారు చేసేందుకు దాదాపు రెండు నెలల సమయం పట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ముందుగా వెదురు, కాగితంతో విగ్రహానికి ఫ్రేమ్‌ను సిద్ధం చేసి, దానిపై వేలాది పానీపూరీలను ఎంతో జాగ్రత్తగా అమర్చారు. ఇందులో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. పానీపూరీల తయారీలో మిగిలిపోయే పిండిని వృథా చేయకుండా ఉపయోగించినట్లు నిర్వాహకులు తెలిపారు. దీంతో ఆహార వృథాను కూడా కొంతవరకు తగ్గించినట్లయింది.
గణేశోత్సవం తర్వాత ఆ పానీపూరీలన్నీ ఏం చేస్తారు?వేలాది సున్నితమైన, పెళుసైన పానీపూరీలతో ఇంత భారీ విగ్రహాన్ని తయారు చేయడం అంత సులభం కాదు. చిన్న ఒత్తిడి, తేమ తగిలినా పానీపూరీలు దెబ్బతినే అవకాశం ఉండటంతో విగ్రహం వద్ద కళాకారులు 24 గంటల పాటు పర్యవేక్షణ చేస్తున్నారు. దూరం నుంచి చూస్తే ఇది సాధారణంగా కనిపించే భారీ గణేశుడి విగ్రహంలాగే ఉంటుంది. కానీ దగ్గరకు వెళ్లి చూస్తే మాత్రం మొత్తం విగ్రహం పానీపూరీలతో తయారు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో అక్కడికి వచ్చే భక్తులు, సందర్శకులు ఆసక్తిగా ఈ విగ్రహాన్ని తిలకిస్తున్నారు. ఈ విగ్రహానికి సంబంధించిన మరో ప్రత్యేకత కూడా ఉంది. సాధారణంగా గణేశుడి విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. అయితే 21 వేల పానీపూరీలను నీటిలో నిమజ్జనం చేయకుండా సేంద్రీయ ఎరువుగా మార్చాలని నిర్వాహకులు నిర్ణయించారు. అంటే గణేశోత్సవం ముగిసిన తర్వాత కూడా ఈ విగ్రహం కోసం ఉపయోగించిన ఆహార పదార్థాలను వృథా చేయకుండా ఉపయోగించనున్నారు.
View this post on Instagram
A post shared by NDTV Food & Travel (@ndtv_food)
బంగారు మోదకాలు, వివిధ రకాల స్వీట్లతో గణేశుడి విగ్రహాలు ఇప్పటి వరకు వైరల్‌గా మారాయి. ఇప్పుడు పానీపూరీలతో బప్పాను తయారు చేయడం ఆసక్తిగా మారింది. కాగా గణేశోత్సవ వేడుకల్లో ఆహార పదార్థాలతో చేసే సృజనాత్మకత కొత్త రూపాలను సంతరించుకుంటోంది. ఈసారి పుణెలో భారతీయుల ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ అయిన పానీపూరీ.. గణేశుడి అలంకరణలో భాగమై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Asian Games 2026: ఆసియా క్రీడలు (ఏషియన్ గేమ్స్) 2026లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి మ్యాచ్ కోసం మైదానంలోకి అడుగుపెట్టగానే క్రికెట్ ఫ్యాన్సుకు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం ఎదురైంది. ఎప్పుడూ చూసే బీసీసీఐ అధికారిక నీలిరంగు జర్సీ, దానిపై పెద్ద ఎత్తున ఉండే కమర్షియల్ స్పాన్సర్స్ లోగోలు ఆ మ్యాచ్‌లో కనిపించలేదు. ఇది చూసి ఫ్యాన్స్ అందరూ ఆశ్చర్యపోయారు. అసలు మన ప్లేయర్స్ జర్సీ ఎందుకు మార్చాల్సి వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
ఆ నిబంధనలే ప్రధాన కారణం
సాధారణ ద్వైపాక్షిక సిరీస్‌లు లేదా ఐసీసీ టోర్నమెంట్లలో ఆడేటప్పుడు ఆటగాళ్ళు నేరుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. కానీ ఏషియన్ గేమ్స్ వంటి ప్రతిష్టాత్మక మల్టీ-స్పోర్ట్స్ ఈవెంట్లలో క్రికెట్ జట్టు మాత్రమే ప్రత్యేకంగా పాల్గొనదు. ఇది మొత్తం భారతీయ అథ్లెట్ల బృందంలో భాగం మాత్రమే. ఈ వేదికలపై అందరూ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) పతాకం కింద బరిలోకి దిగుతారు. వ్యక్తిగత క్రీడా సంఘాల గుర్తింపు కంటే దేశాన్ని సూచించే జాతీయ ఒలింపిక్ సంఘానికే ఇక్కడ అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.
అన్ని ఆటలకు ఒకే రకమైన కోడ్
అంతర్జాతీయ మల్టీ-స్పోర్ట్స్ ఈవెంట్లలో క్రీడాస్ఫూర్తి, సమానత్వం అత్యంత ముఖ్యమైన సూత్రాలు. అథ్లెటిక్స్, కుస్తీ, బ్యాడ్మింటన్, హాకీ లేదా క్రికెట్.. ఏ ఆట అయినా సరే, దేశం తరఫున బరిలోకి దిగే ప్రతి క్రీడాకారుడికి ఒకేలా ఉండే అధికారిక కిట్ కోడ్ ఖచ్చితంగా వర్తిస్తుంది. ఐఓఏ ప్రత్యేకంగా రూపొందించిన డిజైన్, రంగులు ఉన్న అధికారిక నేషనల్ కిట్నే ప్రతి ఒక్కరూ ధరించాల్సి ఉంటుంది. దీనివల్ల భారతీయ క్రీడాకారులందరికీ మైదానంలో ఒకే రకమైన యూనిఫామ్ కనిపిస్తుంది.
కమర్షియల్ స్పాన్సర్‌షిప్‌లపై కఠిన నిబంధనలు
సాధారణంగా బీసీసీఐ జర్సీలపై ప్రముఖ వ్యాపార సంస్థల లోగోలు, కిట్ తయారీదారుల పేర్లు పెద్ద సైజులో ముద్రించబడి ఉంటాయి. అయితే, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా (OCA), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) నిబంధనల ప్రకారం.. ఈ వేదికలపై ప్రైవేట్ బోర్డుల వాణిజ్య ప్రకటనలు లేదా స్పాన్సర్ లోగోల ప్రదర్శనకు పూర్తిగా అనుమతి ఉండదు. క్రీడా వేదికలను వ్యాపార ప్రచారాలకు ఉపయోగించకూడదనే కఠినమైన రూల్స్ ఉన్నందునే, బీసీసీఐకి చెందిన ప్రత్యేక లోగోలు ఉన్న జర్సీలను పక్కనపెట్టి, నిబంధనలకు అనుగుణంగా సామాన్యమైన జర్సీలతో మన ఆటగాళ్లు బరిలోకి దిగాల్సి వస్తుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ప్రస్తుతం తెలంగాణ పల్లె పాటలకు ప్రపంచమే ఫిదా అవుతున్న సంగతి తెలిసిందే. భాష అర్థం కాకపోయినా దేశ సరిహద్దులు దాటి ఈ ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి. ఇక యూట్యూబ్, సోషల్ మీడియాలో ఈ పాటలకు వచ్చే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల ఆత్మీయతలు, అందచందాలను ప్రతిబింబించే పాటలు ఎంతో మందిని అలరిస్తుంటాయి. కొన్నాళ్లుగా ఫోక్ సాంగ్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఎక్కడా విన్నా ఓ పాట మారుమోగుతుంది. మనం మాట్లాడుకుంటున్న ఆ సాంగ్ పేరు “అబ్బబ్బగా పోరి”. ఈ పాట డీజేలలో మోత మోగిపోతుందనే చెప్పాలి. జోగుల వెంకటేష్ పాడిన ఈ పాట పల్లెటూరి యువతి అందాన్ని, ఆమె నడక తీరును, అలంకారాన్ని ఎంతో ముచ్చటగా వర్ణిస్తుంది. కళ్యాణ్ కీస్ అందించిన సంగీతం కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి నటించిన ఈ వీడియో సాంగ్ తమ నటనతో, ఆకట్టుకునే డ్యాన్స్ మూవ్స్‌తో పాటను మరింత రక్తికట్టించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తొలి సూపర్ స్టార్ కమెడియన్.. ఖరీదైన కారులో ప్రయాణించి.. 44 ఏళ్ళ వయసులోనే రైల్వే స్టేషన్ రోడ్డు మీద అనాథలా..
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించే నాటు పదాలు, అందమైన యాస ఈ పాటకు ప్రధాన బలం. “పట్టు చీర పైట రప రప లాడంగా”, “జడనిండా చామంతి పువ్వులే పెట్టింది” వంటి పదాలు పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కడతాయి. వినగానే కాళ్లకు ఊపు తెప్పించే బీట్, జానపద శైలికి తగినట్లుగా సాగే ఆకట్టుకునే ట్యూన్ ఈ పాటను యూట్యూబ్‌లో ట్రెండింగ్ శ్రేణిలో నిలబెట్టాయి.
ఎక్కువ మంది చదివినవి : Pragathi : ఆ వాన సాంగ్ వల్ల హీరోయిన్గా సినిమాలు చేయడం మానేశా.. నటి ప్రగతి కామెంట్స్..
ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఇప్పటివరకు 61 లక్షలకు పైగా వ్యూస్ రాబట్టింది. ఇప్పుడు వినాయక నిమజ్జనంలో ఈ పాట డీజేలలో మారుమోగుతుంది.
ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao : నా జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్ అది.. తెలుగు చరిత్రలో ఒక గొప్ప మైలురాయి.. రాఘవేంద్రరావు..
అబ్బబ్బ గా పోరీ సాంగ్..
ఎక్కువ మంది చదివినవి : Cinema : వామ్మో.. ఇదేక్కడి క్రేజ్ భయ్యా.. 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సిరీస్..
సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Garuda Purana on Signs Before Death Telugu: మరణం అనే మాట వినగానే మనలో భయం, ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. ఒక వ్యక్తి తన చివరి క్షణాల్లో ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటాడు? తన మరణ సమయం సమీపించిందని ముందుగానే తెలుసుకుంటాడా? చుట్టూ ఉన్నవారికి కనిపించని కొన్ని విషయాలు అతనికి కనిపిస్తాయా? ఇలాంటి ప్రశ్నలకు గరుడ పురాణంలోని కొన్ని వర్ణనలు ఆధ్యాత్మిక కోణంలో సమాధానాలను అందిస్తాయి. గరుడ పురాణంలో విష్ణుమూర్తి–గరుడుని సంభాషణ ద్వారా మరణం, ఆత్మ, శరీరం, కర్మలకు సంబంధించిన అనేక విషయాలు వివరించబడినట్లు హిందూ సంప్రదాయంలో నమ్మకం. మరణం సమీపించే సమయంలో శరీరంలో, ఇంద్రియాల్లో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయని కూడా కొన్ని వర్ణనలు చెబుతాయి. అయితే ఇవన్నీ మత విశ్వాసాలు, ఆధ్యాత్మిక వివరణలుగా మాత్రమే చూడాలి. వీటిని వైద్యపరంగా నిర్ధారించబడిన మరణ సంకేతాలుగా భావించకూడదు.
మరణానికి ముందు యమదూతలు కనిపిస్తారా?మత విశ్వాసాల ప్రకారం, మరణ సమయం సమీపించినప్పుడు యముని దూతలు ఆత్మను తీసుకెళ్లేందుకు వస్తారని గరుడ పురాణానికి సంబంధించిన సంప్రదాయ కథనాలు చెబుతాయి. ఈ సమయంలో మరణానికి దగ్గరగా ఉన్న వ్యక్తి తన చుట్టూ ఉన్నవారికి కనిపించని దృశ్యాలను చూస్తున్నట్లు అనిపించవచ్చని నమ్ముతారు.
పూర్వీకులు కనిపిస్తారా?కొన్ని సంప్రదాయాల ప్రకారం, మరణానికి సమీపంలో ఉన్న వ్యక్తికి గతించిన తల్లిదండ్రులు, తాతామామ్మలు లేదా ఇతర బంధువులు కనిపించినట్లు అనుభవం కలగవచ్చని చెబుతారు. దీన్ని ఆత్మ భౌతిక జీవితాన్ని విడిచిపెట్టి తదుపరి ప్రయాణానికి సిద్ధమవుతున్న సంకేతంగా కొందరు విశ్వసిస్తారు.
జీవితంలోని జ్ఞాపకాలు గుర్తుకొస్తాయా?చివరి దశల్లో బాల్యం, కుటుంబం, స్నేహితులు, జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు ఒక్కసారిగా గుర్తుకు రావడం గురించి కూడా అనేక ఆధ్యాత్మిక కథనాలు ఉన్నాయి. మతపరంగా దీనిని కర్మతో అనుసంధానిస్తారు. మంచి, చెడు పనులను గుర్తుచేసుకోవడం ద్వారా మనసులో ప్రశాంతత లేదా పశ్చాత్తాపం కలగవచ్చని భావిస్తారు.
శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి?మరణం సమీపిస్తున్నప్పుడు చేతులు, కాళ్లు చల్లబడటం, శ్వాసలో మార్పులు రావడం, తీవ్ర నీరసం, చూపు మందగించడం, వినికిడి లేదా ఇతర ఇంద్రియాల స్పందన తగ్గడం వంటి శారీరక మార్పులు సంభవించవచ్చు. కొందరిలో అసాధారణ దృశ్యాలు లేదా గందరగోళం కూడా కనిపించవచ్చు. ఆధునిక వైద్యం వీటిని శరీర విధుల్లో మార్పులు, తీవ్రమైన అనారోగ్యం, మందుల ప్రభావం లేదా ఆక్సిజన్ స్థాయిలలో మార్పులతో వివరిస్తుంది.
వైతరణి నది కనిపిస్తుందా?గరుడ పురాణంలో వైతరణి నదికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. మత విశ్వాసం ప్రకారం, మరణానంతరం ఆత్మ యమలోకానికి వెళ్లే మార్గంలో వైతరణిని దాటుతుంది. అందువల్ల మరణానికి దగ్గరగా ఉన్న వ్యక్తి నీరు, చీకటి లేదా ఏదైనా కఠినమైన మార్గాన్ని అనుభవించినట్లు చెప్పబడితే, సంప్రదాయ విశ్వాసాలు దాన్ని ఆధ్యాత్మిక ప్రయాణంతో అనుసంధానిస్తాయి.
మరణ సమయంలో ఆత్మ శరీరాన్ని ఎలా విడిచిపెడుతుంది?గరుడ పురాణంలోని ఆధ్యాత్మిక భావన ప్రకారం, మరణ సమయంలో శరీర ఇంద్రియాలు క్రమంగా బలహీనపడి, చివరికి ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది. వ్యక్తి చేసిన కర్మలను బట్టి మరణానంతర ప్రయాణం ఉంటుందని హిందూ సంప్రదాయం విశ్వసిస్తుంది.
ముఖ్యంగా, గరుడ పురాణంలో చెప్పబడే ఈ అంశాలు ఆధ్యాత్మిక, మతపరమైన విశ్వాసాలకు సంబంధించినవి. వీటిని మరణాన్ని ముందుగానే గుర్తించే శాస్త్రీయ సంకేతాలుగా భావించకూడదు. చివరి దశల్లో కనిపించే శారీరక లేదా మానసిక మార్పులకు వైద్యపరమైన కారణాలు కూడా ఉండవచ్చు.
(Disclaimer: ఈ కథనంలోని అంశాలు గరుడ పురాణం, హిందూ మత విశ్వాసాల ఆధారంగా ఉన్నాయి. వీటిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన మరణ సంకేతాలుగా భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)
జియో కస్టమర్లకు గుడ్ న్యూస్. రిలయన్స్ జియో మరో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇటీవల తమ కస్టమర్ల కోసం అనేక చౌకైన రీఛార్జ్ ప్లాన్లను తీసుకొస్తూ ఉంది. అందులో భాగంగా ఇప్పుడు మరో స్టన్నింగ్ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. రూ.51తో అన్లిమిటెడ్ 5జీ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 5జీ వినియోగదారులకు ఇది అపరిమితి డేటాను అందిస్తోంది. మీరు 4జీ నెట్ వర్క్ వాడుతుంటే ఈ ప్లాన్‌తో 5జీ సేవలు పొందవచ్చు. ఈ ప్లాన్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
రూ.51కే 5జీ ప్లాన్జియో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.51తో 5జీ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో తక్కువ ధరకే 5జీ నెట్ వర్క్ కవరేజీ పొందవచ్చు. అంతేకాకుండా అన్ లిమిటెడ్ డేటా పొందవచ్చు. ఎలాంటి పరిమితులు లేకుండా అపరిమితి డేటాను యాక్సెస్ చేయవచ్చు. ఈ ప్లాన్ ద్వారా 4జీ నుంచి 5జీకి అప్‌గ్రేడ్ అవ్వవచ్చు. మీ ఫోన్‌కు 5జీ సపోర్ట్ ఉంటే అన్ లిమిటెడ్ డేటా ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు. అయితే ఇప్పటికే మీ ఫోన్లో రోజుకు 1.5జీబీ డేటా, ఒక నెల వ్యాలిడిటీతో కూడిన రీఛార్జ్ ప్లాన్ కలిగి ఉండాలి. అనంతరం రూ.51తో రీఛార్జ్ చేసుకుంటే.. మీ ప్రస్తుత ప్లాన్ కాలపరిమితి వరకు ఈ ప్లాన్ కూడా కూడా వర్తిస్తుంది. మీ ఫోన్ 5జీ నెట్ వర్క్ పరిధిలో ఉంటే ఇవి పనిచేస్తుంది. ఒకవేళ మీరు 4జీ సపోర్ట్ ఫోన్ వినియోగిస్తుంటే.. 3జీబీ డేటా ఉపయోగించాక స్పీడ్ 64కేబీపీఎస్‌కు తగ్గుతుంది.
వ్యాలిడిటీ ఎన్ని రోజులంటే..?మీ ప్రస్తుత ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీ ఉందనుకుందాం. అప్పుడు రూ.51 రోజుల ప్లాన్ కూడా అన్ని రోజుల పాటు అందుబాటులో ఉంటుందని చెప్పవచ్చు. మీ నెంబర్‌పై 56 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుంది. 5జీ సేవలను వినియోగించాలనుకునేవారికి ఇది మంచి ప్లాన్‌గా చెప్పవచ్చు. మై జియో యాప్ లేదా జియో అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా రిటైలర్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక మీ ప్రాంతంలో 5జీ నెట్ వర్క్ ఉందా.. లేదా అనేది మై జియో యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. జియో ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద టెలికాం నెట్ వర్క్ సంస్థగా కొనసాగుతోంది. సబ్‌స్కైబర్లను పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు అనేక ఆఫర్లను ప్రవేశపెడుతోంది. సరసమైన ధరలకే రీఛార్జ్ ప్లాన్లను తీసుకొస్తుంది. ఇక మొబైల్ నెట్‌వర్క్‌లోనే కాకుండా హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్లోనూ జీయో సత్తా చాటుతోంది.
తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కోపంతో తల్లికి ఊహించని షాక్ ఇచ్చాడు కొడుకు. తల్లి ఫిర్యాదుతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులకు ఆ యువకుడు తన తల్లితో అతనికి ఉన్న లైంగిక సంబంధం గురించి చెప్పేశాడు. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఫ్లోరిడా రాష్ట్రంలో లేక్ల్యాండ్కు చెందిన క్రిస్టినా క్లెమెన్స్ (46) అనే మహిళ స్థానికంగా తన ఫ్యామిలీతో కలిసి నివసిస్తోంది. అయితే, 22 ఏళ్ల వయస్సున్న తన కొడుకుతో ఆమె లైంగిక సంబంధాన్ని కొనసాగిస్తున్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది. తాజాగా కొడుకు తనను కొడుతున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు పోలీసులు తెలిపారు.
ఈ కేసు వివరాలను ఎక్స్ వేదికగా వెల్లడిస్తూ ఓ అధికారి ఇలా అన్నారు.. క్రిస్టినా అనే మహిళ తనను తన కొడుకు కొడుతున్నాడని ఫోన్ చేస్తే.. అతన్ని తాము అదుపులోకి తీసుకున్నామని, అయితే ఆ యువకుడు తమకు దిమ్మతిరిగే విషయం చెప్పాడని తెలిపారు. తనకు 18 ఏళ్లు వచ్చినప్పటి నుంచి తన తల్లితో లైంగిక సంబంధం కొనసాగిస్తున్నానని ఆ యువకుడు చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు. మొదట ఆ యువకుడు చెప్పిన మాటలు విని షాక్ అయ్యామని.. దీని గురించి మళ్లీ చెప్పమని అడగ్గా, అదే విషయాన్ని ఆ యువకుడు మళ్లీ రిపీట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
అయితే కొడుకు చెప్పింది ఎంత వరకు నిజమో అని తెలుసుకునేందుకు ఇదే విషయంపై అతని తల్లిని విచారించగా.. ఆమె కూడా అది నిజమేనని ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. తాము కేవలం 100 సార్లు మాత్రమే ఏకాంతంగా గడిపినట్టు ఆమె చెప్పిందని పోలీసులు తెలిపారు. అలాగే ఈ విషయంపై ఆమె భర్తను విచారించగా.. తల్లీకొడుకుల మధ్య ఉన్న ఈ సంబంధం గురించి తనకు తెలియదని అతను చెప్పినట్టు పోలీసులు తెలిపారు. అయితే వాళ్లు ఇద్దరూ ఇంట్లోని మాస్టర్ బెడ్రూమ్లో తలుపులు వేసుకుని ఏకాంతంగా ఎక్కువ సమయం గడిపినప్పుడు తనకు కొంత అనుమానం వచ్చిందని అతను చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు.
తల్లీకొడుకులు ఇలాంటి సంబంధం కలిగి ఉండడం చట్టవిరుద్ధమని పేర్కొన్న షెరీఫ్ జుడ్.. వారిద్దరిపై ఇన్సెస్ట్ కేసులు నమోదు చేశామని తెలిపారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. తల్లి క్రిస్టినాపై గృహ హింస, బహిరంగ వివాహేతర సంబంధం అభియోగాలు ఉన్నట్టు తేలిందని, సెప్టెంబర్ 4న ఆమె మొత్తం 6,250 డాలర్ల పూచీకత్తుతో బెయిల్‌పై విడుదలయ్యారని తెలిపారు. మరోవైపు షేన్పై గృహ హింసకు పాల్పడినందుకు అదనపు అభియోగాలు నమోదయ్యాయని, అతను ప్రస్తుతం ఎలాంటి బెయిల్ లేకుండా పోలీసు కస్టడీలోనే ఉన్నట్టు వెల్లడించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన శైలిలో డ్యాన్స్ లు, ఎందరో తారలకు, యువ కొరియోగ్రాఫర్లకు స్ఫూర్తిగా నిలిచిన డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ప్రముఖ యాంకర్ ఉదయభాను, రాకేష్ మాస్టర్‌తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాకేష్ మాస్టర్ మరణ వార్తను మొదట నమ్మలేదని ఉదయభాను తెలిపారు. గతంలోనూ ఇలాంటి వార్తలు రావడంతో లైట్ తీసుకున్నానని, అయితే వార్త నిజమని తెలియగానే తీవ్రంగా బాధపడినట్లు చెప్పారు. తన కెరీర్ ప్రారంభ దశలో “హోరాహోరీ” అనే డ్యాన్స్ ప్రోగ్రాం ద్వారా రాకేష్ మాస్టర్‌తో పరిచయం ఏర్పడిందని ఉదయభాను వివరించారు. డ్యాన్స్ గురించి పెద్దగా అవగాహన లేని తనకు, నువ్వు ఈ స్టెప్ చేయగలవు అంటూ ఆయన ఎంతో ధైర్యాన్నిచ్చారని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య అనుబంధం మొదలైందని ఆమె అన్నారు.
రాకేష్ మాస్టర్ కేవలం ఒక డ్యాన్స్ మాస్టర్ మాత్రమే కాదు, ఒక గొప్ప గురువు అని ఉదయభాను అన్నారు. ప్రభుదేవా, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వంటి నేటితరం స్టార్ కొరియోగ్రాఫర్లకు ఆయన గురువుగా వ్యవహరించారు. వారిని అద్భుతంగా తీర్చిదిద్దడంలో ఆయన కృషి ఎంతో ఉందని తెలిపారు. ఒక ఆర్టిస్ట్ చేత తను అనుకున్న విధంగా డ్యాన్స్ చేయించగల సమర్థత రాకేష్ మాస్టర్‌కు ఉందని, ఆయన గురువుగా ఉన్నప్పుడు నూరు శాతం విజయం సాధించిన వ్యక్తి అని ఉదయభాను అన్నారు. అయితే, ఆయన జీవితంలో తను తీసుకున్న కొన్ని నిర్ణయాలు, తన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావం వల్ల ఆయన జీవితం పూర్తిగా మారిపోయిందని ఉదయభాను అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న రాకేష్ మాస్టర్, చివరి దశలో ఇండస్ట్రీకి, తనవారికి దూరం కావడం బాధాకరమని అన్నారు. అయినప్పటికీ, తను ఇటీవల రాకేష్ మాస్టర్ ఆధ్వర్యంలో ఒక పాటలో నటించానని, ఆ సమయంలో ఆయన పూర్తి ఎనర్జీతో, పాత రాకేష్ మాస్టర్‌గానే కనిపించారని ఉదయభాను చెప్పారు. తెరపై తను అనుకున్నది వచ్చే వరకు నిద్రపోని పర్ఫెక్ట్ మాస్టర్ ఆయన అని చెప్పుకొచ్చారు.
రాకేష్ మాస్టర్ మరణం తర్వాత, ఆయన శిష్యులైన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వంటి వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న వీడియోలు తనను ఎంతో బాధించాయని ఉదయభాను పేర్కొన్నారు. రాకేష్ మాస్టర్ ఎంతోమంది అనాధలకు, పేదలకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి అని గుర్తుచేసుకున్నారు. నేను ఎంతోమందికి అన్నం పెట్టాను, కానీ ఇప్పుడు నాకు అన్నం పెట్టేవాళ్లు లేరు అని ఆయన పదేపదే చెప్పే మాటలు తనను కలచివేశాయని అన్నారు. ఒకప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎలా చూడలో తెలిసిన వ్యక్తిగా తనకు రాకేష్ మాస్టర్ గుర్తు అని, తన విషయంలో ఆయన ఎప్పుడూ మంచిగానే ఉన్నారని ఉదయభాను స్పష్టం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, రాకేష్ మాస్టర్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : వామ్మో.. ఇదేక్కడి క్రేజ్ భయ్యా.. 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సిరీస్..
సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
విశాఖపట్నం గాజువాకలో కొలువుదీరిన భారీ గణనాథుడి ఉత్సవాలు తీవ్ర వివాదానికి దారితీశాయి. కోటి మట్టి గాజులతో 89 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన శ్రీ దివ్య కంకణ అలంకార మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తుతుండగా.. మండపం ప్రాంగణంలో నిర్వాహకులు ఏర్పాటు చేసిన సెట్టింగులు, వాణిజ్య కార్యకలాపాలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వినాయకుడి దర్శనం ఉచితమే అయినప్పటికీ, పక్కనే వేసిన యమలోకం, డైనోసార్ సెట్లకు టికెట్లు వసూలు చేయడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేశారు. గాజువాక శ్రీనగర్ గ్రౌండ్లో ప్రతిష్ఠించిన ఈ మహా గణపతిని 21 రోజుల పాటు భక్తుల దర్శనార్థం ఉంచేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అయితే మండపానికి ఇరువైపులా వినోదం పేరుతో భారీ ఎమ్యూజ్మెంట్ సెట్లు వేశారు. అందులో సినిమా సెట్టింగ్‌ను తలపించేలా రూపొందించిన యమలోకం సెట్‌కు రూ.100, అలాగే డైనోసార్ పార్క్ సెట్‌కు రూ.80 చొప్పున ఎంట్రీ ఫీజు నిర్ణయించారు. అంతేకాకుండా యమలోకం సెట్ టికెట్ కొన్నవారికి లోపలి మార్గం గుండా వినాయకుడి శీఘ్ర దర్శనం కల్పిస్తుండటంతో, సాధారణ క్యూలైన్లలోని రద్దీని తప్పించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో టికెట్లు కొనుగోలు చేశారు. వీటికి తోడు మైదానంలో పెద్దఎత్తున తాత్కాలిక కమర్షియల్ స్టాళ్లను సైతం ఏర్పాటు చేసి నిర్వాహకులు భారీగా ఆదాయం గడిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఉత్సవాల పేరుతో ఎలాంటి వసూళ్లకు పాల్పడకూడదని, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించరాదని పోలీసులు ముందే స్పష్టమైన నిబంధనలు విధించినప్పటికీ.. ఈ మండపానికి అధికారిక అనుమతులు తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. భక్తి ముసుగులో దందా సాగుతోందన్న ఫిర్యాదులతో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారులతో కూడిన జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ శ్రీనగర్ గ్రౌండ్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. హైవే సర్వీస్ రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా భక్తుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని కమిటీ నిర్ధారించింది. తనిఖీల సమయంలో నిర్వాహకులు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ నివేదిక ఆధారంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రంగంలోకి దిగి నిర్వాహకులకు సీరియస్ నోటీసులు జారీ చేశారు. యమలోకం, డైనోసార్ సెట్లతో పాటు మైదానంలోని అనధికార వాణిజ్య స్టాళ్లను వెంటనే స్వచ్ఛందంగా తొలగించాలని ఆదేశించారు. గడువులోగా తొలగించకపోతే ప్రభుత్వ యంత్రాంగమే బుల్డోజర్లతో కూల్చివేస్తుందని హెచ్చరించారు. తాము భక్తితోనే ఏర్పాట్లు చేశామని, వ్యాపారం చేయడం లేదని నిర్వాహకులు వాదిస్తుండగా.. నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే సాధారణ భక్తుల దర్శనానికి ఎలాంటి ఆటంకం ఉండదని పోలీసులు స్పష్టత ఇచ్చారు. ఈ వివాదం విశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వీడియో చూడండి..Best Cars: భారతీయ కార్ల మార్కెట్లో ఆగస్టు 2026లో అనేక కంపెనీల కార్లు అద్భుతమైన అమ్మకాలను నమోదు చేశాయి. ముఖ్యంగా అత్యధికంగా అమ్ముడైన టాప్ ఐదు మోడళ్లలో నాలుగు మారుతి సుజుకికి చెందినవి కాగా, టాటా పంచ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ కార్ల అమ్మకాలతో పాటు, వినియోగదారులు వాటి మైలేజ్, ధరపై కూడా దృష్టి సారిస్తారు.
ఆగస్టు 2026లో అమ్మకాల పరంగా టాటా పంచ్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మైక్రో ఎస్‌యూవీకి చెందిన మొత్తం 21,320 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే దాదాపు 99 శాతం ఎక్కువ. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.6.13 లక్షల నుండి ప్రారంభమవుతుంది. పంచ్ పెట్రోల్, సిఎన్జి రెండు ఆప్షన్లలోనూ అందుబాటులో ఉంది.
మారుతి సుజుకి వాగన్ఆర్ ఆగస్టు నెలలో 20,180 యూనిట్లు అమ్ముడై, దేశంలో రెండవ అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు సుమారుగా 39% పెరిగాయి. వాగన్ఆర్ ఎక్స్-షోరూమ్ ధరలు సుమారుగా రూ.5.55 లక్షల నుండి ప్రారంభమవుతాయి. ఇది పెట్రోల్, సీఎన్జీ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.
మారుతి సుజుకి స్విఫ్ట్ ఆగస్టు 2026లో 19,832 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి, దేశంలో అత్యధికంగా అమ్ముడైన మూడవ కారుగా నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే దీని అమ్మకాలు సుమారు 60 శాతం పెరిగాయి. స్విఫ్ట్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 6.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
మారుతి సుజుకీ ఫ్రాంక్స్ కూడా ఆగస్ట్ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-5 కార్డలో ఒకటిగా నిలిచింది. ఈ క్రాసోవర్‌కు చెందిన మొత్తం 18, యూనిట్లు అమ్ముడయ్యాయి. వార్షిక ప్రతిపాదికన దీని అమ్మకాలు సుమారు శాతం పెరుగుదలను మోదు చేశాయి. ఫ్రాంక్స్ షోరూమ్ ధర సుమారు రూ. లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
ఈ జాబితాలో మారుతి సుజుకీ ఎర్టిగా ఐదో స్థానంలో నిలిచింది. ఆగస్ట్‌లో 18,516 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది 7 సీటర్ ఎంపీవీ, ఎక్కువ సీటింగ్ సామర్థ్యం ఉన్న కారును కోరుకునే కుటుంబాలలో ఇది ప్రత్యేకంగా ప్రజాదరణ పొందింది. ఎర్టిగా ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.8.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లో లభిస్తుంది. పెట్రోల్ మోడల్ లీటర్‌కు సుమారు 20.51 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుండగా, సీఎన్జీ మోడల్ కిలో గ్రాముకు సుమారు 26.11 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
ఆగస్ట్ 2026 అమ్మకాలలో మారుతి సుజుకీ బలమైన ఆధిపత్యం మధ్య టాటా పంచ్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. వ్యాగన్ఆర్, స్విఫ్ట్, ఫ్రాంక్స్, ఎర్టిగా టాప్ 5లో ప్రవేశించాయి. ఈ జాబితా వివిధ విభాగాల కార్ల కోసం వినియోగదారులలో బలమైన డిమాండ్ ఉందని కూడా స్పష్టంగా కనిపిస్తోంది. స్విఫ్ట్ వంటి హ్యాచ్‌బ్యాక్‌లు, అలాగే ఫ్రాంక్స్, ఎర్టిగా వంటి మోడళ్లను కూడా పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు.
రోజువారీ జీవితంలో త్వరగా, సులువుగా చేసుకోగలిగే అల్పాహారం ఎంతో అవసరం. ముఖ్యంగా రాత్రి మిగిలిన అన్నాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన రిసిపీ. నూనె, నీళ్లు అస్సలు వాడకుండా, కేవలం కొన్ని పదార్థాలతోనే అద్భుతమైన రొట్టెలను, వాటికి తగ్గ కమ్మని చట్నీ తయారు చేసుకోవచ్చునంట. అది ఎలా అనుకుంటున్నారా?
మిగిలిపోయిన అన్నంతో చపాతీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. రాత్రి మిగిలిన అన్నం: 1 కప్పు, బియ్యప్పిండి: 1 కప్పు, పచ్చిమిర్చి: 2 లేదా మూడు. చిటికెడు ఉప్పు.
ముందుగా, రాత్రి మిగిలిన ఒక కప్పు అన్నాన్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులోకి రెండు పచ్చి మిర్చిని కలపాలి. కొంచెం కూడా నీళ్లు పోయకుండా, అన్నాన్ని పచ్చిమిర్చిని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. మీకు పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే, ఒక టీస్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ అన్నం పేస్ట్‌ను ఒక గిన్నెలోకి తీసుకొని, ఒక కప్పు బియ్యప్పిండిని కలపాలి. నీళ్లు అస్సలు పోయకుండా, చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. అన్నంలో ఉన్న తేమతోనే పిండి కలుస్తుంది. పిండిని బాగా కలిపిన తర్వాత, మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ సమయం పిండిని బాగా సెట్ చేస్తుంది.
10 నిమిషాల తర్వాత, పిండిని మరోసారి కలుపుకొని, రెండు సమాన భాగాలుగా విభజించుకోవాలి. కొద్దిగా గోధుమ పిండి లేదా బియ్యప్పిండి చల్లుకుంటూ, ఒక్కో భాగాన్ని పెద్ద చపాతీలా, సమంగా రుద్దుకోవాలి. ఒక గిన్నె లేదా మూత సహాయంతో గుండ్రని ఆకారంలో కట్ చేసుకోవాలి. ఇది రొట్టెలకు మంచి రూపాన్ని ఇస్తుంది. స్టవ్‌పై పెనం పెట్టి వేడి చేయాలి. పెనం వేడయ్యాక, మధ్యస్థ మంట మీద ఒక్కో రొట్టెను వేసి కాల్చుకోవాలి.
నూనె లేదా నెయ్యి అస్సలు వేయకుండా కాల్చవచ్చు. రెండు వైపులా తిప్పుకుంటూ, గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకూ కాల్చుకోవాలి. మధ్యస్థ మంట మీద కాల్చడం వల్ల రొట్టెలు మృదువుగా వస్తాయి, అదే తక్కువ మంట మీద కాల్చితే గట్టిపడతాయి. ఆలస్యంగా లేచినప్పుడు లేదా అన్నం మిగిలిపోయినప్పుడు ఇది ఒక అద్భుతమైన పరిష్కారం.
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. తాజాగా జపాన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. కేవలం 57 పరుగులకే జపాన్ ఇన్నింగ్స్‌ను చుట్టేసిన భారత జట్టు, ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని కేవలం 30 బంతుల్లోనే ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత అమ్మాయిలు ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్స్‌లోకి అధికారికంగా ప్రవేశించారు.
అదరగొట్టిన శ్రీచరణి
టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు కెప్టెన్ నిర్ణయాన్ని బౌలర్లు అద్భుతంగా నిరూపించారు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి తన కెరీర్లోనే అత్యుత్తమ బౌలింగ్‌ను ప్రదర్శిస్తూ కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. జపాన్ బ్యాటర్లు కనీసం క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. మొత్తం ఇన్నింగ్స్‌లో జపాన్ జట్టు కేవలం మూడు బౌండరీలు మాత్రమే కొట్టగలిగింది. మరోవైపు పార్ట్-టైమ్ స్పిన్నర్ షెఫాలి వర్మ కూడా 13 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, ఇద్దరు రన్ అవుట్ రూపంలో వెనుదిరిగారు. దీంతో జపాన్ జట్టు కేవలం 57 పరుగులకే కుప్పకూలింది.
షెఫాలి వర్మ విధ్వంసకర బ్యాటింగ్
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఎలాంటి ఇబ్బంది పడకుండా విజయాన్ని అందుకుంది. ఓపెనర్ షెఫాలి వర్మ మొదటి నుంచి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడింది. కేవలం 15 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయంగా 40 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడింది. మరో ఎండ్‌లో రిచా ఘోష్ 6 బంతుల్లో 12 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. దీంతో భారత జట్టు కేవలం 30 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించి సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 40 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకంలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ (AEE) – 40 పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టుకలు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టుకు సంబంధించిన పూర్తి విద్యార్హతలు, ఇతర నిబంధనలను అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలి. అర్హత కలిగిన వారు ఆన్లైన్ విధానంలో అక్టోబర్ 27, 2026వ తేదీ రాత్రి రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. AEE పోస్టులకు సింగిల్ లెవెల్ కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష (CBRT) నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 కామన్ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 1/3వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. రాత పరీక్షతో పాటు అభ్యర్థులు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) లో కూడా అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ నియామకానికి స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు. ఎంపికైన వారికి నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు జీతంగా అందిస్తారు.
ముఖ్యమైన వివరాలుపోస్టు: అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ (AEE)
మొత్తం ఖాళీలు: 40
అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ డిగ్రీ
వేతనం: రూ.57,100 – రూ.1,47,760
ఎంపిక: CBRT + CPT
నెగెటివ్ మార్కింగ్: 1/3
స్క్రీనింగ్ టెస్ట్: లేదు
దరఖాస్తు విధానం: ఆన్లైన్
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 6, 2026.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 27, 2026.
ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మూవీ రివ్యూ: పిఠాపురంలో.. అలా మొదలైంది
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, కేదార్ శంకర్, 30 ఇయర్స్ పృథ్వీ, ప్రత్యూష, శ్రీలు, రిహానా తదితరులు
ఎడిటర్: బి సత్యనారాయణ
సినిమాటోగ్రఫీ: GC క్రిష్
నిర్మాతలు: దుండిగళ్ల బాలకృష్ణ, ఆకుల సురేష్, FM మురళి
దర్శకుడు: మహేష్ చంద్ర
ఒకప్పుడు ప్రేయసి రావే.. లాంటి సినిమాలు తీసిన చంద్ర మహేష్ చాలా సంవత్సరాల తర్వాత రాజేంద్రప్రసాద్ హీరోగా చేసిన సినిమా పిఠాపురంలో అలా మొదలైంది. తండ్రి కూతుర్ల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.
కథ:
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర్లోని ఓ పల్లెటూరిలో సర్పంచ్ వీర రాఘవ (రాజేంద్ర ప్రసాద్), పంతులు విశ్వనాథం (కేదార్ శంకర్), మోతుబరి రైతు బంగారయ్య (పృథ్వీరాజ్) అత్యంత ఆప్తులు. వీళ్ల అమ్మాయిలైన అంజని (ప్రత్యూష), కీర్తన (శ్రీలు), గీత (రిహానా) కూడా ఎంతో ఆత్మీయంగా మెలిగే ప్రాణ మిత్రులు. పై చదువుల కోసం ఈ ముగ్గురు పిఠాపురం వెళ్తారు. అక్కడి క్యాంపస్ వాతావరణంలో ముగ్గురు కుర్రాళ్లకు ఆకర్షితులవుతారు. అందులో ఒకమ్మాయి గీత తన లవర్‌తో లేచిపోతుంది. మరో అమ్మాయి కీర్తన ఏకంగా గుళ్లో తాళి కట్టించుకుని ఇంటికి వచ్చేస్తుంది. వీళ్ల పరిస్థితి చూశాక, మూడో యువతి అంజని తన ప్రేమ వ్యవహారం పెద్దలకు చెప్పాలా వద్దా అనే డైలమాలో పడిపోతుంది. అసలు పెద్దలను ఎదిరించి వెళ్లిన ఆ స్నేహితురాళ్ల బతుకులు ఏ తీరానికి చేరాయి? కన్నవారిని కాదంటే బయటి ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివి? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
కథనం:
ప్రేయసి రావే లాంటి గొప్ప సినిమా తీసిన దర్శకుడు చంద్ర మహేష్ తన పేరును ‘మహేష్ చంద్ర’గా మార్చుకొని చాలా గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టిన చిత్రమిది. ముఖ్యంగా యుక్త వయసులో పిల్లలు ఆకర్షణను ప్రేమ అనుకుని ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు, దానివల్ల కన్నవారికి ఎంతటి క్షోభ మిగులుతుంది అనే సున్నితమైన అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు. ఈ కాలం యువతకు అద్భుతమైన సందేశం ఇచ్చే ఉద్దేశం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కాలేజీ ఎపిసోడ్స్, ప్రేమ వ్యవహారాలు కాస్త రొటీన్ గానే అనిపిస్తాయి. ఆ ట్రాక్ అంతా రొటీన్ సీన్లతో సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఎప్పుడైతే ఆ ఇద్దరు అమ్మాయిలు ఇల్లు వదిలి వెళ్లిపోతారో.. అక్కడి నుంచి అసలు ఎమోషన్ మొదలవుతుంది. కూతుళ్ల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించే నాన్నల వేదనను తెరపై ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తుంది. ద్వితీయార్థంలో భావోద్వేగాలు బాగా పండాయి. అయితే దర్శకుడు ఎంచుకున్న పాయింట్ గొప్పదే అయినా, దానిని నడిపించిన స్క్రీన్ ప్లేలో ఇంకాస్త వేగం ఉంటే బాగుండేది. ఓల్డ్ ఫార్మాట్ డ్రామా తగ్గించి, నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా సీన్స్ రాసుకుని ఉంటే రిజల్ట్ మరింత అద్భుతంగా ఉండేది. అయినప్పటికీ, ఒక మంచి పాయింట్‌తో తీసిన ఈ ఫ్యామిలీ డ్రామా చూసేవారిని ఆలోచింపజేస్తుంది.
నటీనటులు:
ఊరి పెద్దగా, కూతురి బాగోగులు చూసుకునే స్నేహపూర్వకమైన నాన్న పాత్రలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ తన అనుభవాన్ని చూపించారు. చాలా కచ్చితంగా ఉండే తండ్రి క్యారెక్టర్లో కేదార్ శంకర్ ఒదిగిపోగా, పృథ్వీరాజ్ తన మార్క్ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించే బాధ్యత తీసుకున్నారు. ముగ్గురు యువతులుగా చేసిన రిహానా, శ్రీలు, ప్రత్యూష తమ క్యారెక్టర్ల పరిధి మేరకు చక్కని అభినయం కనబరిచారు. గ్లామర్ పరంగానే కాకుండా ఎమోషనల్ సన్నివేశాల్లోనూ మెప్పించారు.
టెక్నికల్ టీం:
సంగీతం, నేపథ్య సంగీతం పర్వాలేదనిపిస్తాయి. క్రిష్ కెమెరా వర్క్ బాగుంది. ముఖ్యంగా గోవా నేపథ్యంలో వచ్చే రొమాంటిక్ పాటను చిత్రీకరించిన విధానం, విజువల్స్ చాలా రిచ్‌గా వచ్చాయి. అయితే ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఇంకాస్త వర్క్ చేయాల్సింది. నిర్మాణ విలువలు కథకు సరిపడా ఉన్నాయి కానీ, ఆర్టిస్టుల డబ్బింగ్, అలాగే వారి మేకప్ విషయంలో ఇంకొంచెం శ్రద్ధ వహించి ఉంటే అవుట్‌పుట్ మరింత మెరుగ్గా ఉండేది.
పంచ్ లైన్:
ఓవరాల్ గా పిఠాపురంలో అలా మొదలైంది.. లైన్ మంచిదే..!
Abhishek Sharma: అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా అద్భుతమైన ప్రదర్శనతో 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్ ఆఖరి మ్యాచ్‌లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 34 బంతుల్లోనే 108 పరుగుల విధ్వంసకర శతకం బాది చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ వెనుక భారత మాజీ దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఇచ్చిన సలహా ఎంతో కీలకమని అభిషేక్ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. తన సహజమైన దూకుడుతో పాటు పరిస్థితికి తగినట్లుగా ఆడాలని యువీ తనకు సూచించినట్లు అతను తెలిపాడు.
రెండో టీ20 మ్యాచ్ ముగిసిన తర్వాత తన గురువైన యువరాజ్ సింగ్ నుంచి తనకు ఒక స్పెషల్ మెసేజ్ వచ్చినట్లు అభిషేక్ తెలిపాడు. ప్రతి బంతిని కచ్చితంగా బౌండరీకి తరలించాలని ప్రయత్నించవద్దని, కొన్ని సందర్భాల్లో సింగిల్స్ తీస్తూ ప్రశాంతంగా ఆడాలని యువీ సూచించినట్లు పేర్కొన్నాడు. క్రీజులో ఎక్కువసేపు నిలబడి మ్యాచ్‌ను గెలిపించే బాధ్యత తీసుకోవాలని యువరాజ్ ఎప్పుడూ చెబుతుంటాడని, ఆయన మాటలు తన మైండ్‌లో స్పష్టంగా ఉన్నాయని అభిషేక్ వెల్లడించాడు.
సిరీస్ ప్రారంభానికి ముందు వరుస వైఫల్యాలతో కొంత ఒత్తిడిని ఎదుర్కొన్న అభిషేక్ శర్మ, ఈ సిరీస్‌లో మొత్తం 229 పరుగులు సాధించి లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేశాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తాను మరింత మెరుగయ్యానని, రాబోయే ఆసియా క్రీడలకు ఈ ఆత్మవిశ్వాసం ఎంతగానో ఉపయోగపడుతుందని అభిషేక్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గురువైన యువరాజ్ మార్గదర్శకత్వంలో మరింత రాణించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Artificial Plants Vastu Tips Telugu: ఇంటిని అందంగా, పచ్చగా కనిపించేలా అలంకరించుకోవాలని చాలామంది కోరుకుంటారు. ముఖ్యంగా సూర్యరశ్మి తక్కువగా ఉండే గదులు, చిన్న అపార్ట్మెంట్లు లేదా మొక్కలను క్రమం తప్పకుండా సంరక్షించడం కష్టంగా ఉన్న ఇళ్లలో కృత్రిమ మొక్కలను అలంకరణ కోసం ఉపయోగించడం సాధారణంగా మారింది. అయితే, వాస్తు శాస్త్రంలో మొక్కలను కేవలం అలంకరణ వస్తువులుగా కాకుండా ఇంటి వాతావరణంతో ముడిపడిన అంశాలుగా పరిగణిస్తారు. అందుకే ఇంట్లో కృత్రిమ మొక్కలను ఎక్కడ ఉంచాలి? ఎక్కడ ఉంచకూడదు? అనే విషయాలపై కొన్ని నమ్మకాలు ఉన్నాయి.
కృత్రిమ(ప్లాస్టిక్) మొక్కలు ఇంట్లో పెట్టుకోవచ్చా?వాస్తు నమ్మకాల ప్రకారం, ఇంట్లో కృత్రిమ మొక్కలను ఉంచడం పూర్తిగా నిషేధం కాదు. శుభ్రంగా, అందంగా ఉన్న మంచి నాణ్యత కలిగిన కృత్రిమ మొక్కలను కేవలం అలంకరణ కోసం ఉపయోగించుకోవచ్చని భావిస్తారు. అయితే అవి సహజమైన మొక్కలు కావు కాబట్టి, నిజమైన మొక్కల మాదిరిగా సహజత్వం, తాజాదనం, జీవంతో కూడిన వాతావరణాన్ని అందించలేవని వాస్తు సంప్రదాయంలో చెబుతారు. ముఖ్యంగా దుమ్ము పట్టినవి, ఆకులు విరిగిపోయినవి, రంగు వెలిసినవి లేదా పాడైపోయిన కృత్రిమ మొక్కలను ఇంట్లో అలాగే ఉంచకూడదని భావిస్తారు. అలాంటి వస్తువులు ఇంటి అందాన్ని తగ్గించడంతో పాటు ప్రతికూల వాతావరణానికి కారణమవుతాయని వాస్తు నమ్మకం.
సజీవ మొక్కలకు ఎందుకు ప్రాధాన్యత?వాస్తు సంప్రదాయంలో సహజమైన మొక్కలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మొక్కల పచ్చదనం ప్రకృతి, పెరుగుదల, తాజాదనం వంటి భావాలకు ప్రతీకగా భావిస్తారు. తులసి, మనీ ప్లాంట్ వంటి మొక్కలను చాలామంది ఇళ్లలో ఆధ్యాత్మిక, అలంకరణ పరంగా ఉపయోగిస్తారు. అయితే ప్రతి మొక్కను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉంచడం కంటే, దాని అవసరాలు, ఇంటి పరిస్థితులు, నిర్వహణ సౌలభ్యం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం మంచిది.
పూజా గదిలో కృత్రిమ మొక్కలు వద్దని ఎందుకు అంటారు?పూజా గదిని ఇంటిలో పవిత్రమైన, ప్రశాంతమైన ప్రదేశంగా భావిస్తారు. అందువల్ల ఈ ప్రదేశంలో అనవసరమైన అలంకరణ వస్తువులను ఎక్కువగా ఉంచకుండా పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉంచడం మంచిదని వాస్తు సంప్రదాయంలో చెబుతారు. కృత్రిమ మొక్కలకు బదులుగా తాజా పువ్వులు లేదా సహజమైన పచ్చదనాన్ని ఉపయోగించడం మరింత అనుకూలంగా భావిస్తారు. ముఖ్యంగా పూజా గదిలో దుమ్ము పట్టిన అలంకరణ వస్తువులు పేరుకుపోకుండా చూసుకోవాలి.
పడకగదిలో కృత్రిమ మొక్కలు ఎలా ఉండాలి?పడకగది విశ్రాంతి, నిద్ర కోసం ఉపయోగించే ప్రదేశం. కాబట్టి అక్కడ అలంకరణ కోసం పెద్ద సంఖ్యలో కృత్రిమ మొక్కలను ఏర్పాటు చేయకుండా సింపుల్‌గా ఉంచడం మంచిదని వాస్తు నమ్మకాలు సూచిస్తాయి. కృత్రిమ మొక్కలను ఉంచాలనుకుంటే తక్కువ సంఖ్యలో, శుభ్రంగా ఉండే వాటిని మాత్రమే అలంకరణ కోసం ఉపయోగించుకోవచ్చు. అయితే ఎండిపోయినట్లు కనిపించే, దుమ్ము పట్టిన లేదా పాడైన కృత్రిమ మొక్కలను మాత్రం వెంటనే తొలగించడం మంచిది.
ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేక జాగ్రత్తఇంటి ప్రధాన ద్వారాన్ని శక్తి, వెలుతురు, సానుకూలత ఇంట్లోకి ప్రవేశించే ముఖ్యమైన ప్రదేశంగా వాస్తు సంప్రదాయంలో భావిస్తారు. అందువల్ల ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ శుభ్రంగా, చక్కగా ఉంచడం ముఖ్యం. ప్రధాన ద్వారం వద్ద కృత్రిమ మొక్కలను అలంకరణ కోసం ఉంచితే అవి దుమ్ము పట్టకుండా క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. విరిగిపోయిన లేదా రంగు వెలిసిన మొక్కలను అక్కడ ఉంచడం మంచిది కాదని వాస్తు నమ్మకం. వీలైతే సహజమైన పచ్చని మొక్కలను ఉపయోగించడం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
పరిశుభ్రతే ముఖ్యమైన విషయంఇంట్లో కృత్రిమ మొక్కలను ఉపయోగించాలా వద్దా అనే విషయంలో వాస్తు నమ్మకాలు ఎలా ఉన్నా, ఒక విషయం మాత్రం ముఖ్యమైనది.. అదే పరిశుభ్రత. కృత్రిమ మొక్కలపై దుమ్ము పేరుకుపోతే అవి ఇంటి అందాన్ని తగ్గిస్తాయి. కాబట్టి వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. పాడైనవి, విరిగినవి లేదా ఎక్కువగా రంగు వెలిసిన వాటిని తొలగించి కొత్తవాటితో మార్చడం మంచిది.
మొత్తంగా చూస్తే, వాస్తు నమ్మకాల ప్రకారం కృత్రిమ మొక్కలను పూర్తిగా నిషేధించినట్లు కాదు. అయితే వాటిని పరిమితంగా, శుభ్రంగా, సరైన ప్రదేశంలో అలంకరణ కోసం ఉపయోగించడం మంచిదని భావిస్తారు. సహజమైన మొక్కలకు మాత్రం తాజాదనం, పచ్చదనం కారణంగా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఇంటి అందంతో పాటు పరిశుభ్రత, సహజత్వం, సమతుల్యతను కూడా దృష్టిలో ఉంచుకోవడం ఉత్తమం.
(Disclaimer: ఈ కథనంలోని విషయాలు వాస్తు శాస్త్రం, సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా చెప్పబడినవి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)
మూవీ రివ్యూ: మిస్సింగ్ మేఘన
నటీనటులు: రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, కౌశిక్, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య, గోపరాజు రమణ తదితరులు..
సంగీతం: ఆర్ఆర్ ధృవన్
ఎడిటర్: బసవ
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కే నాయుడు
దర్శకత్వం: వాచస్పతి
కూతురు మిస్సింగ్ నేపథ్యంలో ఓ నాన్న ఏం చేశాడు అనే కథతో వచ్చిన సినిమా మిస్సింగ్ మేఘన. వాచస్పతి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దామా..
కథ:
సడెన్‌గా ఒక రోజు మేఘన (అమ్ము అభిరామి) ఇంటికి రాకపోవడంతో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. కూతురు కనిపించడం లేదని ఆమె నాన్న పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. కానీ వాళ్ళ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన ఉండదు. దాంతో మేఘనను పెళ్లి చేసుకోబోయే కుర్రాడు, వృత్తిరీత్యా ACP అయిన అర్జున్ (కౌశిక్) స్వయంగా ఈ అదృశ్యం మిస్టరీని ఛేదించే పనిలో పడతాడు. ఈ క్రమంలో విచారణ మొదలుపెట్టగా.. చివరగా ఆమెకు లిఫ్ట్ ఇచ్చిన బైక్ రైడర్ కార్తీక్ (రామ్ కార్తీక్) పోలీసుల కంట్లో పడతాడు. కానీ తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని అతను బుకాయిస్తాడు. మరో పక్క అతని పాత లవ్ స్టోరీ, ఫోన్ కాల్స్ డేటా విచారణను వేరే దారికి తీసుకెళ్తాయి. ఇంతకీ మేఘన ఏమైంది? ఆమె మిస్ అవ్వడానికి కార్తీక్‌కు ఉన్న లింక్ ఏంటి? అసలు ఈ అదృశ్యం వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? అనేదే ఈ చిత్ర ఇతివృత్తం.
కథనం:
ఈ చిత్రాన్ని కేవలం ఒక అమ్మాయి అదృశ్యం చుట్టూ తిరిగే పాయింట్లా కాకుండా మర్డర్ మిస్టరీ, డ్రగ్ మాఫియా, ప్రేమకథ ఇలా రకరకాల ఎలిమెంట్స్‌ను జోడించి తీశారు. ప్రారంభంలో పాత్రల పరిచయం, వాతావరణం సెట్ చేయడానికి దర్శకుడు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. దీనివల్ల ప్రథమార్ధం నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ సగం సినిమా పూర్తయ్యే సరికి వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ప్రేక్షకులలో తదుపరి ఏం జరుగుతుందనే ఉత్కంఠను గట్టిగానే రేపుతుంది. ఇక ద్వితీయార్థంలో మాత్రం సినిమా స్పీడ్ అందుకుంటుంది. ఒక సాధారణ మిస్సింగ్ కేసు కాస్తా పెద్ద క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లాగా టర్న్ అవ్వడం, ఊహించని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. హీరో, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఆధారాలు సేకరించే తీరు మెప్పిస్తుంది. అయితే దర్శకుడు రాసుకున్న కొన్ని మలుపులు సగటు ప్రేక్షకుడికి ముందే అర్థమైపోతాయి. ముఖ్యంగా మెయిన్ విలన్ ఎవరనేది రివీల్ చేసినప్పుడు ఎలాంటి సర్ప్రైజ్ అనిపించదు. అలాగే క్లైమాక్స్ కూడా రొటీన్ యాక్షన్ సినిమాలను తలపిస్తాయి. ఇన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, సెకండాఫ్‌లో ఉండే ఇన్వెస్టిగేషన్ ట్రాక్, అక్కడక్కడా వచ్చే కొన్ని థ్రిల్లింగ్ అంశాలు సినిమాను బోర్ కొట్టకుండా కాపాడాయి. క్రైమ్ కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక మోస్తరుగా నచ్చుతుంది.
నటీనటులు:
టైటిల్ రోల్ ప్లే చేసిన అమ్ము అభిరామి చాలా చక్కగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, సెంటిమెంట్ పండించే చోట తన ప్రతిభ కనబరిచింది. ఇక రామ్ కార్తీక్ తన క్యారెక్టర్లో పూర్తిగా ఇమిడిపోయాడు. బ్రేకప్ అయిన యువకుడిగా, యాక్షన్ సీక్వెన్సుల్లో తన బెస్ట్ ఇచ్చాడు. ఖాకీ దుస్తుల్లో కనిపించిన కౌశిక్ ఫుల్ ఎనర్జీతో అదరగొట్టాడు. తండ్రి పాత్రలో గోపరాజు రమణ తనదైన సహజ నటనతో కట్టిపడేశారు. అంకిత్ కొయ్యతో పాటు మిగిలిన ఆర్టిస్టులంతా తమ పాత్రల పరిధి మేర న్యాయం చేశారు.
టెక్నికల్ టీం:
ధృవన్ ఇచ్చిన పాటలు వినడానికి పర్వాలేదనిపిస్తాయి. అయితే ఒక థ్రిల్లర్ జానర్‌కి ప్రాణమైన నేపథ్య సంగీతం ఇంకాస్త పవర్‌ఫుల్‌గా ఇచ్చి ఉంటే రిజల్ట్ బాగుండేది. కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు పనితనం ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. చాలా విజువల్స్ రిచ్‌గా అనిపిస్తాయి. ఎడిటర్ బసవ తన కత్తెరకు ఫస్ట్ హాఫ్‌లో కొంచెం పని చెప్పాల్సింది. సాగదీతగా అనిపించే సీన్లను కట్ చేసి ఉంటే సినిమా మరింత గ్రిప్పింగ్‌గా వచ్చేది. నిర్మాణ విలువలు కథా స్థాయికి తగ్గట్టుగా బాగానే ఉన్నాయి.
పంచ్ లైన్:
ఓవరాల్ గా మిస్సింగ్ మేఘన.. డీసెంట్ థ్రిల్లర్..!
తిరుపతి జిల్లాలోని ప్రముఖ రైల్వే జంక్షన్ రేణిగుంటలో తీవ్ర కలకలం రేగింది. అస్సాంకు చెందిన ఓ ప్రయాణికుడు ఆత్మహత్య చేసుకుంటానంటూ ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి వేలాడుతూ చేసిన హంగామాతో రైల్వే అధికారులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ హైడ్రామా కారణంగా దాదాపు రెండున్నర గంటల పాటు రైళ్ల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. త్రివేండ్రం నుంచి న్యూఢిల్లీ వెళ్లే కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సదరు వ్యక్తి, తోటి ప్రయాణికులతో గొడవ పడుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో ఉదయం 5 గంటల సమయంలో రైలు రేణిగుంట స్టేషన్‌కు చేరుకోగానే అతడు క్రిందికి దిగిపోయాడు. అనంతరం 2వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి పైకెక్కి, అక్కడి నుంచి కిందకి వేలాడుతూ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు.
వంతెన కిందే హైటెన్షన్ విద్యుత్ లైన్లు ఉండటంతో ఘటనాస్థలిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేసి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ఉదయం 5:00 గంటల నుంచి 7:30 గంటల వరకు తిరుపతి, రేణిగుంట మీదుగా చెన్నై, హైదరాబాద్, విజయవాడ వైపు వెళ్లాల్సిన పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అధికారులు, పోలీసులు దాదాపు రెండు గంటల పాటు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అతను వినలేదు. దీంతో అగ్నిమాపక సిబ్బంది సహాయంతో ట్రాక్‌పై రక్షణ నెట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి బ్రిడ్జి పైనుంచి రైలు పైకి దూకి పరుగులు తీయగా, రెస్క్యూ సిబ్బంది చాకచక్యంగా వెంబడించారు. రైలు పైనుంచి కిందకు జారిపడుతున్న సమయంలో సిబ్బంది వల సాయంతో అతడిని సురక్షితంగా పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
రెండున్నర గంటల శ్రమ అనంతరం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు, వైద్య పరీక్షల నిమిత్తం రైల్వే ఆసుపత్రికి తరలించారు. విచారణలో అతను తన పేరు, వివరాలు సరిగ్గా చెప్పకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అతడి మానసిక స్థితిపై ఆరా తీస్తున్నారు. పరిస్థితి అదుపులోకి రావడంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి రైళ్ల రాకపోకలను అధికారులు క్రమబద్ధీకరించారు.
వీడియో చూడండి..Ration Card Holders Alert: రేషన్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ఆదేశం జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ పీడీఎస్ పథకం వచ్చే నెల నుంచి అమలులోకి రానుంది. దీనితో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులు రద్దు కానున్నాయి. కనీసం ఆరు లక్షలకు పైగా కార్డులు రద్దు కానున్నాయని సమాచారం. ఆరు నెలలకు పైగా రేషన్ తీసుకోని కార్డుదారులపై ఈ ప్రభావం పడనుంది. ఆరు నెలలకు పైగా ఉపయోగించని కార్డులు 16 లక్షలకు పైగా ఉన్నాయి. ఉపయోగించని కార్డులను యాక్టివేట్ చేయడానికి, కేవైసీని అప్డేట్ చేయాలి. స్మార్ట్ పీడీఎస్ అనేది రేషన్ కార్డు సభ్యుల సమాచారాన్ని కేంద్రంగా నిల్వ చేయడానికి, క్షేత్రస్థాయి వరకు పంపిణీని పూర్తిగా పర్యవేక్షించడానికి రూపొందించిన ఒక ప్రాజెక్ట్.
ఇది కూడా చదవండి: Business Ideas: కేవలం రూ.5 వేలతో మీ జీవితాన్ని మార్చే బిజినెస్ గురించి మీకు తెలుసా?
ఆరు నెలలుగా రేషన్ తీసుకోలేదా?ఈ చర్యలు ప్రధానంగా ఆరు నెలలకు పైగా రేషన్ తీసుకోని వారిని ప్రభావితం చేస్తాయి. ఆరు నెలలకు పైగా తమ రేషన్ వాటాను తీసుకోని వారి కార్డులు నిలిచిపోయే అవకాశం ఉంది. దీని తర్వాత కార్డులోని సభ్యులందరూ మూడు నెలల్లోగా ఇ-కెవైసిని పూర్తి చేయాలి. అప్పుడే రేషన్ పంపిణీని తిరిగి పొందవచ్చు.
అంతేకాకుండా, ఒకే వ్యక్తి ఏదైనా రాష్ట్రంలో ఒకటి కంటే ఎక్కువ కార్డులలో ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా ఇది గుర్తిస్తుంది. ఒకవేళ అలా ఉంటే, వారి కార్డులు నిలిచిపోయే అవకాశం ఉంది. వారు మూడు నెలల్లోగా eKYCని కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ దశలో ఏ రేషన్ కార్డును ఉంచుకోవాలో నిర్ణయించి, మిగిలిన వాటి నుండి వారి పేరును తొలగించాలి.
ఈ చర్యలు స్మార్ట్ పీడీఎస్ పథకం మొదటి దశలోని పసుపు, గులాబీ వర్గాలపై ప్రభావం చూపుతాయి. కేరళలో ఈ వర్గాలలో సుమారు 45,000 కార్డులు, 66,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ఆరు నెలలకు పైగా రేషన్ అందలేదు. లక్షలాది నీలం, గోధుమ, తెలుపు కార్డులుదారులు కూడా ఆరు నెలల నుంచి రేషన్ తీసుకోలేదని గుర్తించారు అధికారులు. దీంతో వారి కార్డులను నిలిపివేసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Personal Finance: ఇది కదా అసలైన స్కీమ్.. ప్రతి 3 నెలలకు మీ ఖాతాలో రూ. 57,400 జమ..!
ఇది కూడా చదవండి: Driving License: వాహనదారులకు హెచ్చరిక.. సెప్టెంబర్ 25లోగా ఈ పనిచేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రస్తుతం ప్రతి పల్లె పట్నంలోని ప్రతి వాడ వాడలో వినాయకుడిని ప్రతిష్టించి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, ఆఫీసు భవనాల్లో ఇలా అన్ని చోట్ల వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజిస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వినాయకుడిని ప్రతిష్టించి పూజలు చేస్తుండగా అద్భుతం చోటు చేసుకున్నదంట. ఇంతకీ అది ఏమిటి అంటే?
వినాయక చవితి ఉత్సవాల వేళ అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులో ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు పూజలు చేస్తుండగా ఎలుక ప్రత్యక్షమైంది. భక్తిశ్రద్ధలతో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలను ఘనంగా ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఊహించని విధంగా వినాయక విగ్రహం వద్దకు ఎలుక వచ్చింది. విఘ్నేశ్వరుడి ఒడిలో కాసేపు, పాదాల చెంత కూర్చొని కనిపించింది.
విఘ్నేశ్వరుడి వాహనమైన మూషికం స్వయంగా వచ్చిందని భావించిన ఉపాధ్యాయుల విద్యార్థులు, ఉపాధ్యాయులు దైవ మహిమ గా భావించారు. సాధారణంగా మనుషులను చూస్తే పరుగులు తీసే ఎలుక, ఏమాత్రం భయం లేకుండా అలాగే ఉండిపోయింది. విద్యార్థులు భజన చేస్తున్న సమయంలో.. ఆ మూషికం కూడా ముందు కాళ్లు పైకి ఎత్తి కదిలించింది. దీంతో మూషికం కూడా పూజల్లో పాల్గొన్నట్టు అంతా భావించి ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇది గమనించిన హాస్టల్ వార్డెన్ శకుంతల.. ఆ మూషికానికి నమస్కరించారు. దాని నుదుటన బొట్టు పెట్టారు. అయినా ఎక్కడ మెరుపు లేకుండా అక్కడే కూర్చుని అన్ని సేవలు అందుకుంది ఆ మూషికం.
భక్తులు సమర్పించిన నైవేద్యం, పండ్లను ఆ మూషికం అక్కడే కూర్చుని ఎంతో ఇష్టంగా తిన్నది. ఈ దృశ్యాన్ని చూసిన విద్యార్థులంతా స్వామివారి నామస్మరణ చేశారు. విఘ్నేశ్వరుడి మహిమగా భావించిన హాస్టల్ ఉపాధ్యాయులు వార్డెన్.. వినాయకుడు చెంత ఉన్న ఆ మూషికాన్ని వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కానీ మన ఇంటి ముందు వెనక ఉండే చిన్న చిన్న మొక్కల నుంచి పెద్ద పెద్ద చెట్ల వరకు కూడా వాస్తు అనేది ప్రభావితం చేస్తుందంట. ముఖ్యంగా చాలా మంది తమ ఇంటి ముందు సీతాఫలం మొక్క నాటుకుంటారు. మరి ఇలా ఇంటి ముందు సీతాఫలం మొక్క ఉండటం మంచిదేనా? అసలు దీని గురించి వాస్తు శాస్త్ర నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
చాలా మంది తమ ఇంటి ముందు ఫలాలను ఇచ్చే చెట్లు నాటుకుంటారు. ముఖ్యంగా జామ చెట్టు, మామిడి చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇక కొంత మంది ఏకంగా సీతాఫలం చెట్టును కూడా ఇంటి ముందు నాటుకుంటారు. మరి ఇలా ఇంటి ముందు సీతాఫలం చెట్టు ఉండటం మంచిదేనా? అంటే? అస్సలే మంచిది కాదు అంటున్నారు వాస్తు పండితులు. చాలా మంది సీతాఫలం ప్రతి పూజలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా లక్ష్మీదేవికి ఈ పండు సమర్పిస్తే దారిద్ర్యం తొలిగిపోతుంది అంటారు. పూజలో ఉపయోగిస్తారు కాబట్టి, ఇంటి ముందు ఉండటం కూడా మంచిది అనుకుంటారు.
కానీ ఇంటి ముందు సీతాఫలం మొక్క ఉండటం వలన ఆర్థిక సమస్యలు అధికం అవుతాయంట. అంతే కాకుండా ఇది అనేక ఇబ్బందులకు కారణం అవుతుందంట. అందువలన ఎవరి ఇంటి ముందు అయినా సరే సీతాఫలం మొక్క ఉంటే దానిని వెంటనే నరికివేయడం మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఒక వేళ మీకు నరికి వేయడం ఇష్టం లేకపోతే, దాని పక్కనే అశోక మొక్క నాటడం వలన లేదా ఉసిరి మొక్క నాటడం వలన వాస్తు దోషం తొలిగిపోతుందంట.
కానీ చాలా మంది ఈ మధ్య కాలంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు ఎక్కువగా తమ ఇంటి ముందు సీతాఫలం మొక్కను నాటుకుంటున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదే అయినప్పటికీ, వాస్తు ప్రకారం అస్సలే మంచిది కాదు అని వాస్తు పండితులు తెలియజేస్తున్నారు. అందువలన మొక్కను నాటుకోకూడదు, ఒక వేళ ఉన్నట్లు అయితే పక్కనే ఉసిరి మొక్క నాటుకోవడం మంచిదంట.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు
ఈ వంకాయ ఫ్రై రెసిపీ, దాని అద్భుతమైన రుచి, సులభమైన తయారీ విధానం.. వంటల్లో ఎంతో ప్రత్యేకం. కేవలం పావు కిలో వంకాయలతో, ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండా, మాంసాహార వంటకాలైన చికెన్, మటన్ కన్నా మరింత రుచికరంగా ఈ ఫ్రైని తయారుచేసుకోవచ్చు. వారానికి రెండుసార్లు ఈ విధంగా వండుకొని తింటే, ఆదివారం చికెన్, మటన్ అవసరం లేదనిపించేంత కమ్మగా ఉంటుందని వారు తెలిపారు.
కావలసిన పదార్థాలు.. వంకాయలు (నల్లవి లేదా తెల్లవి) - 250 గ్రాములు, నూనె - తగినంత (ఫ్రైకి కొద్దిగా ఎక్కువ), ఆవాలు - అర స్పూన్, జీలకర్ర - ఒక స్పూన్, పచ్చిమిర్చి - 4 (పొడవుగా చీల్చినవి), పెద్ద ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది), కరివేపాకు రెబ్బలు - కొన్ని, అల్లం పేస్ట్ - ఒక చిన్న స్పూన్, పసుపు - చిటికెడు, కాశ్మీరీ మిర్చి పౌడర్ - 2 స్పూన్లు (కారం కోసం), ఉప్పు - రుచికి సరిపడా, ధనియా పౌడర్ - ఒక స్పూన్, మిక్స్డ్ మసాలా/గరం మసాలా - ఒక స్పూన్ చొప్పున తీసుకోవాలి.
ముందుగా పావు కిలో నల్ల వంకాయలను (తెల్ల వంకాయలు అందుబాటులో లేకపోతే నల్ల వాటిని ఉపయోగించవచ్చు) శుభ్రంగా నీటిలో కడిగి మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. పొడి క్లాత్‌తో వంకాయల పైన ఉన్న నీటిని తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి. వంకాయల తొడిమలను లైట్‌గా కత్తిరించి, ప్రతి వంకాయను రెండు ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫ్రై పర్ఫెక్ట్గా అవుతుంది మరియు రుచి కూడా బాగుంటుంది. కత్తిరించిన వంకాయ ముక్కలను నల్లబడకుండా ఉండేందుకు ఒక బౌల్లో సగం స్పూన్ ఉప్పు కలిపిన నీటిలో పది నిమిషాల పాటు నానబెట్టాలి.
స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని, ఫ్రైకి సరిపడా నూనె (ఒక స్పూన్ ఎక్కువ వేస్తే రుచి బాగుంటుంది) వేయాలి. నూనె కొద్దిగా వేడెక్కాక, అర స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత, పొడవుగా చీల్చిన నాలుగు పచ్చిమిర్చిలను వేయాలి. ఇలా చీలికలుగా వేయడం వల్ల రుచి బాగా పడుతుంది. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను సన్నని ముక్కలుగా తరిగి వేసి, పావు స్పూన్ ఉప్పు వేసి ఉల్లిపాయలు బాగా వేగేలా కలుపుకోవాలి. చిన్న మంటపై ఉల్లిపాయలను వేయించడం వల్ల చక్కగా ఫ్రై అవుతాయి.
ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత, శుభ్రంగా కడిగిన కరివేపాకు రెబ్బలను వేసి మరోసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు సగం వేగిన దశలో, ఒక చిన్న స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఫ్రైలలో వెల్లుల్లి కాకుండా అల్లం వేయడం వల్ల అద్భుతమైన రుచి, కమ్మటి సువాసన వస్తుందని నిపుణులు సూచించారు. అల్లం పేస్ట్ వేసి వేయించిన తర్వాత, చిటికెడు పసుపు, రెండు స్పూన్ల కాశ్మీరీ మిర్చి పౌడర్ (కారం కోసం), రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ మిక్స్డ్ మసాలా లేదా గరం మసాలా వేసి ఉల్లిపాయలతో పాటు మసాలాలు బాగా కలిసేలా కలుపుకోవాలి. ఎలాంటి కాజు లేదా కొబ్బరి మసాలాలను గ్రైండ్ చేయకుండా ఈ పద్ధతిలో మసాలాలు కలిపి ఫ్రై చేయడం వల్ల రుచి అద్భుతంగా ఉంటుంది.
పది నిమిషాలు ఉప్పు నీటిలో నానబెట్టిన వంకాయ ముక్కలను నీటి నుండి తీసి, మసాలా కలిపిన ఉల్లిపాయ మిశ్రమంలో వేయాలి. వంకాయ ముక్కలను ముందు వెనుక వైపులా తిప్పుతూ ఫ్రై చేయాలి. నూనె వేసిన చిన్న తప్పెలతో ఒక చుక్క నీటిని వంకాయల పైన చిలకరించి, మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి, వంకాయలను ఒక్కసారి తిప్పి, ఉప్పు, కారం బాగా పట్టేలా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన, కమ్మని వంకాయ ఫ్రై సిద్ధమవుతుంది. ఈ వంకాయ ఫ్రై రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందని, చికెన్, మటన్, గుడ్డు కన్నా రుచిగా ఉంటుందని వంట నిపుణులు హామీ ఇస్తున్నారు. వంకాయ ఫ్రైని వేడివేడి అన్నంలో, రాత్రి అన్నంలో, రొట్టెలతో కలిపి ఆస్వాదించవచ్చు. ఒక్కొక్క వంకాయ ముక్కను కలుపుకొని తింటుంటే ఒక గ్లాస్ అన్నం తినేవారు రెండు గ్లాసుల అన్నం తినేయగలరని తెలిపారు. ఈ రెసిపీని తప్పనిసరిగా ప్రయత్నించండి.
హైదరాబాద్‌లోని మదాపూర్‌లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి వివరించారు.
మిగిలిన 9.56 లక్షల ఇండ్లు కేటాయించాలి..
కేంద్ర ప్రభుత్వం PMAY-G పథకంలో భాగంగా మొదటి విడతగా రాష్ట్రానికి 2 లక్షల ఇండ్లను కేటాయించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గత జూలైలో ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసినప్పుడు, 11,56,915 మంది అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయాలని వినతి పత్రం అందించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్ర డిమాండ్‌కు అనుగుణంగా ఇంకా మిగిలి ఉన్న 9.56 లక్షల ఇండ్లను కూడా వెంటనే కేటాయించాలని ఆయన కోరారు.
ఎల్‌నినో పరిస్థితులపై కేంద్రం సహకరించాలి..
రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో ప్రభావంపై కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయంలో విద్యుత్ వినియోగం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఎల్‌నినో కారణంగా తాగునీరు, విద్యుత్ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో ఈ ఎల్‌నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
ప్రత్యామ్నాయ పంటలు, సన్నబియ్యం పంపిణీ..
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యాన్ని అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే, సన్న వడ్లు పండించే రైతులను ప్రోత్సహించేందుకు రూ.500 బోనస్ అందిస్తున్నామన్నారు. ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని, పంట మార్పిడిపై రైతులను మరింత ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించి కేంద్రం సహకరించాలని కోరారు.
250 ఎకరాల్లో మార్కెట్..
వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా, 250 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్స్, వెజిటెబుల్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రముఖ పారిశ్రామికవేత్త, RPG Enterprises ఛైర్మన్ హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట చర్చకు దారితీసింది. ఈ వీడియోలో ఓ బార్బర్ ఒక వ్యక్తికి గడ్డం షేవ్ చేస్తుండగా.. అతను ఫ్యూచరిస్టిక్ మోషన్ క్యాప్చర్ సిస్టమ్‌ను ధరించి ఉండటం కనిపించింది. వీడియోలో బార్బర్ తలకు కెమెరా, శరీరానికి హార్నెస్, వైర్లు, సెన్సర్లు ధరించి కనిపిస్తాడు. చేతుల కదలికలను ట్రాక్ చేసేందుకు మణికట్టుల వద్ద కూడా ట్రాకింగ్ పరికరాలు అమర్చినట్లు తెలుస్తోంది.
‘బార్బర్ ఉద్యోగం కూడా పోతుందా?’అయితే బార్బర్ తన సాధారణ పనిని మాత్రం కొనసాగిస్తాడు. షేవింగ్ టూల్స్ ఉపయోగించడం, గడ్డానికి గ్రూమింగ్ ప్రొడక్ట్స్ అప్లై చేయడం, వివిధ కోణాల్లో షేవ్ చేయడం వంటి పనులను చేస్తూనే ఉంటాడు. అదే సమయంలో అతని చేతుల కదలికలు, శరీర భంగిమ, చేతుల కోణాలు, పని చేసే విధానం వంటి వివరాలను సిస్టమ్ రికార్డ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి టెక్నాలజీ ద్వారా మనుషులు చేసే క్లిష్టమైన శారీరక పనులపై డేటాను సేకరించవచ్చు. భవిష్యత్తులో ఈ డేటాను AI లేదా రోబోటిక్ సిస్టమ్స్‌కు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. హర్ష్ గోయెంకా పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఇప్పటివరకు AI ప్రభావం ఎక్కువగా డెస్క్ జాబ్స్పైనే ఉంటుందని భావించిన చాలామంది.. భవిష్యత్తులో చేతి నైపుణ్యం అవసరమైన సంప్రదాయ వృత్తుల్లోనూ ఆటోమేషన్ ప్రవేశించవచ్చా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.
‘బార్బర్ దగ్గరకు వెళ్లినప్పుడు జరిగే వ్యక్తిగత సంభాషణలు, ఉచిత సలహాలు కూడా భవిష్యత్తులో AI తీసుకుంటుందా?’ అంటూ కొందరు నెటిజన్లు పేర్కొంటే.. మరికొందరు మాత్రం భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. మనిషి ముఖం దగ్గర పదునైన బ్లేడ్లతో పనిచేసే విషయంలో రోబోటిక్ వ్యవస్థలను ఎంతవరకు నమ్మవచ్చనే ప్రశ్నలను లేవనెత్తారు. ఓ నెటిజన్.. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, సాఫ్ట్వేర్ అప్డేట్పై ఆధారపడే రోబోట్ కంటే చేతులు కొద్దిగా వణికే మనిషి బార్బర్‌నే నమ్ముతానని సరదాగా వ్యాఖ్యానించాడు. మరో వ్యక్తి కూడా గడ్డం, జుట్టు కత్తిరించడానికి రోబోట్‌పై నమ్మకం లేదని, తాను ఎప్పటికీ తన బార్బర్పైనే ఆధారపడతానని కామెంట్ చేశాడు. మరికొందరు మాత్రం ఇలాంటి టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో చివరకు బార్బర్లే తమ నైపుణ్యాన్ని అందిస్తున్నారని, దీర్ఘకాలంలో ఇది వారి వృత్తిపై ప్రభావం చూపవచ్చని అభిప్రాయపడ్డారు.
కాగా సంప్రదాయ నైపుణ్యాలపై AI, ఆటోమేషన్ ప్రభావాన్ని చూపించే వీడియోను హర్ష్ గోయెంకా షేర్ చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో మహిళ చేతులకు మెహందీ వేసే యంత్రానికి సంబంధించిన AI రూపొందించిన వీడియోను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో మహిళ తన చేతిని ఓ యంత్రంలో ఉంచగా.. యంత్రం తక్కువ మానవ జోక్యంతో క్లిష్టమైన మెహందీ డిజైన్‌ను రూపొందిస్తున్నట్లు కనిపించింది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. సృజనాత్మకత, నైపుణ్యం, ఖచ్చితత్వం అవసరమైన సంప్రదాయ వృత్తులను కూడా భవిష్యత్తులో ఆటోమేషన్ మార్చగలదా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
AI training going on India ! Even barbers job may soon be at risk https://t.co/99CAwj5m2h
— Harsh Goenka (@hvgoenka) September 14, 2026
AI అభివృద్ధి కేవలం కంప్యూటర్ ముందు చేసే పనులకే పరిమితం కాకుండా.. మనుషులు చేతులతో చేసే క్లిష్టమైన పనులను కూడా నేర్చుకునే దిశగా సాగుతున్నట్లు ఈ వీడియోలు చర్చకు తెస్తున్నాయి. అయితే బార్బర్ వంటి వృత్తుల్లో మానవ స్పర్శ, అనుభవం, కస్టమర్‌తో ప్రత్యక్షంగా వ్యవహరించే నైపుణ్యం ఎంతవరకు యంత్రాలతో భర్తీ చేయగలమనే ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. AI భవిష్యత్తులో ఉద్యోగాల స్వభావాన్ని మాత్రమే కాదు.. మనం ఇప్పటివరకు పూర్తిగా మానవ నైపుణ్యంపై ఆధారపడతాయని భావించిన వృత్తులనూ మార్చే అవకాశం ఉందనే చర్చను ఈ వైరల్ వీడియో మరోసారి ముందుకు తెచ్చింది.